–ఎవరివాటావారికి అన్న రాహు ల్ మాటలు వట్టి నీటి మూటలే –కాంగ్రెస్ భవిష్యత్తులో రాజకీ య మూల్యం చెల్లించాల్సిందే
–అభ్యర్థులను మార్చి బీసీలకు అవకాశం ఇవ్వాలి
–ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం
Congress Graduate MLC Candidates : ప్రజా దీవెన, హైదరాబాద్: వచ్చే సంవత్సరం జరగనున్న పట్టభ ద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థు లుగా కాంగ్రెస్ పార్టీ అగ్రకుల రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరి కీ అవకాశం ఇచ్చి తెలంగాణ రా ష్ట్రంలో సామాజిక న్యాయాన్ని ని ట్ట నిలువునా బొంద పెడుతుంద ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా ఫైర్ అయ్యారు. బుధవారం హైదరా బాదులోని బీసీ భవన్ లో జరిగి న మీడియా సమావేశంలో జా జుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో కులగరణ చేసి దేశానికి రోల్డ్ మోడల్ గా ని లిచామని, సామాజిక న్యాయాని కి పెద్దపీట వేశామని గొప్పలు చె ప్పుకునే కాంగ్రెస్ పార్టీ త్వరలో జ రగబోయే హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ మరియు నల్గొం డ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు రెడ్డి సామా జిక వర్గానికి చెందిన సర్వోత్తమ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి ల ను ప్రకటించడం చాలా సిగ్గుచే టు అన్నారు ఇద్దరి రెడ్లకు అవ కాశం ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తమ నిజస్వరూపాన్ని బట్ట బయలు చేసుకుందని, కాంగ్రెస్ పార్టీ చెప్పే మాటలకు, చేసే చేత లకు ఎక్కడ పొంతనలేదని అం దుకు ఉదాహరణ నే రెండు టికె ట్లకు గాను రెండు రెడ్లకే (ఒకే సా మాజిక వర్గానికి) కేటాయించడం చూస్తే కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రా హుల్ గాంధీ మాటలు నీటి మూ టలని తేలిపోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం ధృ తరాష్ట్రునిలా వ్యహరిస్తుందని, కనీసం బీసీలకు ఇవ్వాలని ఆలో చన లేకపోవడం తమను విస్మ యానికి గురి చేస్తుందని ఆయన తెలిపారు, తెలంగాణ రాష్ట్రంలో కులగరణ చేయకముందు ఎలా ఉందో కులగాన చేసిన తర్వాత కూడా ఎలాంటి మార్పు లేదని, 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తా మని మాయమాటలు చెప్పి, మంత్రివర్గంలో, నామినేటెడ్ పో స్టుల్లో, ఎమ్మెల్సీ టికెట్ల కేటాయిం పులు ఎందుకు 42 శాతం అమ లు చేయడం లేదని ఆయన నిల దీశారు.
90% పట్టభద్రులు బడుగు బల హీన వర్గాలు చెందిన వారైతే నా లుగు శాతం ఉన్న రెడ్డి సామాజి క వర్గానికి టికెట్లు ఎలా కేటాయి స్తారని, అగ్రకులాలకు బి ఫామ్ లు ఇస్తే, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ లు దగ్గర ఓట్లు ఉన్నాయని విష యాన్ని గ్రహించాలని ఆయన హె చ్చరించారు.కాంగ్రెస్ పార్టీ పున పరిశీలన చేసి నిన్న ప్రకటించిన అభ్యర్థులను ఉపసంహరిం చు కొని కాంగ్రెస్ పార్టీలో జండా మో సిన బీసీలకు, ఎస్సీ ఎస్టీ మై నార్టీ లకు అవకాశం కల్పించాలని లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎ న్నికలు రాజకీయంగా భారీ న ష్టాన్ని చవి చూడాల్సి వస్తుందని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిం చారు. ఈ సమావేశంలో బీసీ జే ఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కా ర్యనిర్వాహక అధ్యక్షులు కుల్క చర్ల శ్రీనివాస్ ముదిరాజ్, యువ జన సంఘం జాతీయ అధ్యక్షు లు కనకాల శ్యాం కుర్మా, రావుల కోల్ నరేష్ ప్రజాపతి, ఈడిగ శ్రీని వాస్ గౌడ్, డాక్టర్ నరసింహ నా యక్, గూడూరు భాస్కర్ మేరు, కొప్పుల చందు గౌడ్, తదితరు లు పాల్గొన్నారు.


