Saturday, October 3, 2026
More
    HomePoliticsNalgonda collector Chandrashekhar : : రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారుల సమన్వయం అవసరం

    Nalgonda collector Chandrashekhar : : రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారుల సమన్వయం అవసరం

    📰 Generate e-Paper Clip

    –ప్రతి 30 కి.మీ.కు అంబులెన్స్, క్రేన్, హెల్పర్ ఏర్పాటు చేయాలి
    –నల్లగొండ జిల్లా కలెక్టర్ బి. చం ద్రశేఖర్

    Nalgonda collector Chandrashekhar : ప్రజా దీవెన నల్లగొండ: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. నేషనల్ హైవేలపై ప్రతి 30 కిలోమీటర్లకు ఒక అంబులెన్స్, క్రేన్, హెల్పర్‌ను అందుబాటులో ఉంచాలని అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా రోడ్డు భద్రత కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిం చిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రమాదా లు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని , 26 మంది అధికారులతో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ నిరంతరం రోడ్డు భద్రతను పర్యవేక్షించా లని, జంక్షన్ల వద్ద ఒక్క ప్రాణం కూడా కోల్పోకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, నిర్లక్ష్యం వ హిస్తే చర్యలు తప్పవని హెచ్చ రించారు.


    మిర్యాలగూడ–నందిపాడు రహ దారి, చిట్యాల–నార్కట్‌పల్లి, కొండమల్లేపల్లి–ఆలగడప, డిండి–కొండపల్లి, నార్కట్‌పల్లి–వాడపల్లి మార్గాల్లో ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని,
    దామరచర్ల రైల్వే బ్రిడ్జి, లైటింగ్ ఏర్పాటు చేయాలని
    కట్టంగూర్ పెట్రోల్ బంక్ ప్రాంతాల్లో అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని .
    ఎన్‌హెచ్‌-65పై ఆక్రమణలను తొలగించాలని, రోడ్లపై వాహనాలు నిలిపి ఉంచకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ పరిధిలో రోడ్ల ఆక్రమణలను తొలగించాలని, ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని,
    జిల్లాలోని బ్లాక్‌స్పాట్లను గుర్తించి తదుపరి సమావేశం నాటికి వాటి సంఖ్యను తగ్గించేలా కార్యాచరణ రూపొందించాలని , రోడ్డు ప్రమాదాల నివారణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేషనల్ హైవేలపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ వైద్యసేవలు అందించేందుకు అవసరమైన ప్రాంతాల్లో ట్రామా కేర్ హెల్త్ సెంటర్ల ఏర్పాటుకు సీఎస్‌ఆర్ నిధులను వినియోగించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు.

    జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ మా ట్లాడుతూ మిర్యాలగూడ పట్ట ణంలోకి లారీల రాకపోకలకు స మయపాలన విధించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఎన్‌హెచ్‌-65 పరిధిలో ప్రమాదాలకు కారణమవుతున్న డాబాల దగ్గర లారీలను ఆపకుండా చూసుకోవాలనీ సంబంధిత డాబాల యజమానులతో ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించాలని, జిల్లాలో ప్రస్తుతం 30 బ్లాక్‌స్పాట్లు ఉన్నాయని, తదుపరి సమావేశం నాటికి వాటిని తగ్గించేలా ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని చెప్పారు. ఈ సమావేశానికి రవా ణా శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ శ్రీవాణి ,జిల్లా రెవిన్యూ అధికారి దశరథ , జాతీయ రహ దారులు ఆర్ అండ్ బి పంచా యతీరాజ్, ఎక్సైజ్ తదితర శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.