— టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యద ర్శి శ్రీకాంత్ రెడ్డి
Journalists Issues : ప్రజా దీవెన,హైదరాబాద్: జర్నలిస్టుల సమస్యల పరిష్కారం లో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్ల క్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నదని టీ యూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని చందానగర్ పిజేఆర్ స్టే డియంలో ఏర్పాటు చేసిన కార్యక్ర మంలో డిసెంబర్ 3 న జరిగే మహా ధర్నా పోస్టర్ ను జిల్లా అధ్యక్షులు సలీమ్ పాషా, ఉపాధ్యక్షులు మా ధవ్ రెడ్డి, జిల్లా ఎలక్ట్రానిక్ మీడి యా ఉపాధ్యక్షులు దూపం ప్రసాద్, కార్యదర్శి షకీల్, ఈసీ సభ్యులు ప్రణయ్, ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ కొండా విజయ్ కుమార్, కార్యదర్శి తిరు పతి రెడ్డి, కోశాధికారి వరుణ్ తది తరులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా శ్రీకాంత్ రెడ్డి మా ట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత అనేక సంవత్సరాలుగా అత్యంత నిరాద రణకు గురైన వర్గం జర్నలిస్టులేన నడంలో ఎంత మాత్రం సందేహం లేదన్నారు.
తెలంగాణ ఉద్యమంలో కీలక భూ మిక పోషించిన జర్నలిస్టుల జీవితా లు గత పుష్కర కాలంలో ఏ మా త్రం మెరుగు పడలేదని, ఉమ్మడి రా ష్ట్రంలో పొందిన ఆరోగ్య బీమా వం టి సౌకర్యాలు సైతం అందకుండా పోయాయన్నారు. నాడు పోరాటా ల ద్వారా సాధించుకున్న అనేక వృ త్తి సౌకర్యాలు సైతం మాయమైపో యాయన్నారు. ఉద్యమ కాలంలో నూ, ఆ తర్వాత పదేళ్ల పాలనలో నూ బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు కా గితాలకే పరిమితమైపోయాయని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అదే బాటలో పయనిస్తున్నది ఆవే దన వ్యక్తం చేశారు.
నూతన పాలసీని రూపొందించి అ క్రెడిటేషన్లు జారీ చేయడం, ఆరోగ్య భద్రత కల్పించడం, ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం, అనేక వృత్తి కమిటీలను పునరుద్ధరించడం వం టి కనీస సౌకర్యాలు కల్పనలో ప్ర భుత్వం తీవ్రమైన అలక్ష్యాన్ని ప్రద ర్శిస్తున్నదని మండిపడ్డారు. జర్న లిస్టుల సమస్యలను పరిష్కరించ డంలో సమాచార శాఖ పూర్తిగా వి ఫలమైందిని,తెలంగాణ స్టేట్ యూ నియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీ యూడబ్ల్యూజే) ప్రతినిధి బృందాలు గత రెండేళ్ల కాలంలో సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొం గులేటి శ్రీనివాస్ రెడ్డి అనేక దఫాలు కలిసి జర్నలిస్టుల సమస్యలపైన, సంక్షేమంపైన విజ్ఞాపన పత్రాలు స మర్పించాయని గుర్తు చేశారు.
మన న్యాయమైన డిమాండ్లపై ప్ర భుత్వం మీద ఒత్తిడి తేవడానికి పో రుబాట పట్టాలని నవంబర్ 6 న రంగారెడ్డి జిల్లా ప్రగతి రిసార్ట్స్ లో జరిగిన యూనియన్ రాష్ట్ర కార్య వర్గ సమావేశం నిర్ణయం తీసుకుం దని,అందులో భాగంగా హైదరాబా ద్ లోని మాసాబ్ ట్యాంక్ లో గల రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద డిసెంబర్ 3వ తే దీ, ఉదయం 10 గంటలకు మహా ధర్నా నిర్వహించాలని టియుడ బ్ల్యూజే నిర్ణయించిందన్నారు.
రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎండీ సలీమ్ పాషా మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం కదా అని ఇన్నాళ్ల్లు ఓపి క పట్టామని,ప్రభుత్వం పాతది అ యిపోయిన కనీసం కొత్త అక్రీడేషన్ లు కూడా పొందలేక పోయాం అని ఆవేదన వ్యక్తం చేశారు.మన జిల్లా లోనే కాకా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమై న పని వత్తిడి కారణంగా మన జర్న లిస్టులు, కుటుంబ సభ్యులు పిట్టల్ల రాలుతున్నారని,హెల్త్ కార్డులు రాక ఖరీదైనా వైద్యం చేయించుకోలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. డిసెంబర్ 3 న జరిగే ధర్నా కు శేరిలింగంపల్లి నుండి పెద్ద ఎత్తున జర్నలిస్టులు తరలి రావాలని పిలు పునిచ్చారు.అక్రెడిటేషన్ పాలసీని వెంటనే ప్రకటించి కొత్త కార్డులు జా రీ చేయాలని,ఆరోగ్య బీమా పథ కాన్ని వెంటనే పునరుద్ధరించాలని, అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్లస్థ లాలు మంజూరు చేయాలని,వృత్తి కమిటీలు వెంటనే ఏర్పాటు చేయా లని,సంక్షోభంలో ఉన్న చిన్న మధ్య తరగతి పత్రికలను ఆదుకోవాలనే 5 ప్రధాన డిమాండ్లతో ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలి పారు.
శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొండా విజయ్ కుమార్ మాట్లాడు తూ వచ్చే నెల 3 న జరిగే ధర్నాకు శేరిలింగంపల్లి నియోజకవర్గం నుం డి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నట్లు తె లిపారు. ఆ రోజు ఉదయం 9 గం ట లకు పెద్ద ఎత్తున వాహనాల్లో సమా చార కమిషనర్ కార్యాలయానికి తరలి వెళ్తామన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్న లి స్టులు శ్యామ్, మూర్తి,శ్రీనివాస్ గౌ డ్, నాగేందర్ రెడ్డి,విజయ్, మల్లేష్, శంకర్,శ్రీనివాస్, షఫీ, షకిల్ నరే ష్,ప్రభాకర్, శశి, ప్రణయ్ ముది రాజ్, ప్రవీణ్, మణికంఠ,టిల్లు, బ స్వరాజ్, షారఫాద్దీన్, యాసీన్, సింహాద్రి,మహేందర్, ప్రవీణ్, ఫా రు క్, ఫరీద్, జయరాం, మారం శ్రీనివా స్, లక్ష్మీకాంత్, శంకర్, లక్ష్మణ్, గోవ ర్ధన్ రెడ్డి, మణికంఠ, డానియల్ తదితరులు పాల్గొన్నారు.
