Tuesday, September 29, 2026
More
    HomeOpinionOnline Cashback Schemes group arrested : బిగ్ బ్రేకింగ్, విప్స్(vips) ముసుగు లో వందల...

    Online Cashback Schemes group arrested : బిగ్ బ్రేకింగ్, విప్స్(vips) ముసుగు లో వందల కోట్ల మాయాజాలం, మళ్లీ వేవ్(WAVE)తో రంగంలోకి దిగి బుక్కయ్యారు

    📰 Generate e-Paper Clip

     

    Online Cashback Schemes group arrested : ప్రజా దీవెన, నల్లగొండ:మీరు పెట్టి న ప్రతి రూపాయికి భారీ లా భం, అదనంగా క్యాష్‌బ్యాక్ ఒకరిని చేర్పిస్తే కమిషన్ల వర్షం, ఇలాంటి ఆకర్ష ణీయమైన మాటలతో అమాయక ప్రజలను బురిడీ కొట్టించి, వందల కోట్ల రూపాయలు కొల్ల గొట్టిన VIP S Group of Companies గుట్టు ను నల్గొండ పోలీసులు రట్టు చేశా రు. పాత బాధితులనే మళ్లీ మో సం చేసేందుకు ‘WAVE’ పేరుతో స్కెచ్ వేయగా, పోలీసులు మె రుపు దాడి చేసి గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

    ఒక ‘డిజిటల్’ మాయాజాలం మహారాష్ట్రకు చెందిన వినోద్ తుకా రాం ఖుటే అనే వ్యక్తి 2016లో ఒక వాలెట్ యాప్‌గా ప్రారంభించిన ఈ ప్రయాణం కొనసాగిస్తుండగా చూ స్తుండ గానే వందల కోట్ల స్కామ్‌గా మారింది. వీరు అనుసరించిన పద్ధ తులు వింటే ఎవరైనా ఆశ్చర్యపో వాల్సిందేనని నల్లగొం డ జిల్లా అడిషనల్ ఎస్పీ రమేష్ వెల్లడించారు.

    ప్రైమ్ మెంబర్‌షిప్ మాయగా రూ. 1,995 కడితే చాలు రో జూ రూ.7 చొప్పున మొత్తం డబ్బులు వెనక్కి వస్తాయని, అదే సమయంలో అ నేక ఆఫర్లు కూడా వస్తాయని న మ్మిం చారు. ఈ క్రమంలో మీ కింద ముగ్గురిని చేర్పించండి వారు మరో ముగ్గురిని ఇలా 5 లెవల్స్ వరకు కమిషన్ల వర్షం కురు స్తుందని ఊరిం చారు. నెలకు 5 శాతం వడ్డీ అంటూ ఇన్వె స్ట్‌మెంట్ స్కీమ్‌లు,100 నెలల్లో 100 క్యాష్‌బ్యాక్ అంటూ భూముల అమ్మకాలు ఇలా అన్నీ అబద్ధాలే మూటగట్టి న మ్మించి మోసం చేశారు.

     

       

          పోలీసుల మెరుపు దాడి

    ‘WAVE’ఆగిపోయింది మోసం చేసి కోట్లు సంపాదించినా ఈ గ్యాంగ్ ఆ శ చావలేదు. పాత కస్టమర్ల వద్దకు వెళ్లి, “మీ పా త డబ్బులు రావాలం టే **WAVE** అనే కొత్త కంపెనీ లో మరో రూ. 1,00,000 పెట్టండి” అంటూ నల్గొండలోని లక్ష్మి గార్డెన్స్ వద్ద మీటింగ్ పెట్టారు. పక్కా సమా చారంతో రం గంలోకి దిగిన నల్గొండ రూరల్ పోలీసులు, 10 మంది ఏ జెం ట్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకు ని, వారి వద్ద నుంచి 10 మొ బైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

    అదుపులో ఉన్న నిందితులతో పా టు పరారీలో ఉన్న ‘పెద్ద తలకా యలు పోలీసులు ప్రస్తుతంకానాల లక్ష్మినారాయణ రావు, పున్నం బా లకృష్ణ సహా పది మందిని అరెస్ట్ చే శారు. అయితే, ప్రధాన నిందితుడు వినోద్ తుకారాం ఖుటే (CEO) తో పాటు మరికొందరు డైరెక్టర్లు ప్రస్తుతం పరారీలో ఉన్నా రు. వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలు ము మ్మరం చే శారు. ఆశే మీకు శాపం కాకూడదు త్వరగా డబ్బు సంపా దించాలనే ఆశే మోసగాళ్లకు పెట్టు బడి. తక్కువ కాలంలో రెట్టింపు లాభాలు, రోజువారీ ఆదాయం అ నే ప్రకటనలు చూసి నమ్మకండి. ఏ దైనా స్కీమ్‌లో చేరే ముందు దాని చ ట్టబద్ధతను తనిఖీ చేయండని అడిషనల్ ఎస్పీ రమేష్ సూ చించారు.

    ఇదిలా ఉండగా సెక్షన్ 420, 120 (B) మరియు ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ నిషేధ చట్టం కింద కేసులు నమో దయ్యాయి. కష్టపడి సంపాదించిన డబ్బును ఆన్లైన్ మాయ గాళ్ల చేతిలో పెట్టి మోసపోకండి. అనుమానం వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండని కోరారు.

    ఇదిలా ఉండగా ఈ కేసులో అరె స్టైన నిoధితుల్లో కానాల లక్ష్మినా రాయణ రావు, వనస్థలిపురం, హైదరాబాద్.పున్నం బాలకృష్ణ – మర్రూర్ గ్రామం, నకిరేకల్ మండలం, ఉయ్యా ల శ్రీనివాస్ , ఏలికట్టే గ్రామం, చిట్యాల మండలం. కురా కుల రమేష్ నల్గొండ పట్టణం, గా జుల మహేష్ దోరేపల్లి గ్రామం, కన గల్ మండలం, కోల కుశలయ్య కా కుల కొండారం గ్రా మం, నల్గొండ మండలం, మాదగొని సైదులు – శ్రీరామ్ నగ ర్ కాలనీ, నల్గొండ పట్టణం, ముడుసు ఉమా శంకర్ – ము నుకుంట్ల గ్రామం, కట్టంగూర్ మండలం.ఓరుగంటి శంకర్, అ ప్పాజీపేట గ్రామం, నల్గొండ మండ లం, గుడపూరి లింగ స్వామి @ గూడూరు అఖిల్, కట్టంగూర్ మండలంలను అ రెస్ట్ చేయగా

    VIPS Group of Compani es, CEO వినోద్ తుకారాం ఖుటే, సు మిత్ పురాంక్ డైరెక్టర్ , కల్యాణ్ చ క్రవర్తి, సౌత్ ఇండియా డెవల ప్మెం ట్ డైరెక్టర్, గుమ్మల సత్యనారాయ ణ – డైరెక్టర్ గుమ్ముల అభినాష్– డైరెక్టర్ లు పరారీలో ఉ న్నా రని చెప్పారు.సులభంగా డబ్బు సంపా దించాలనే ఆశ పె ట్టుకోవద్దు ఆన్‌లై న్ పెట్టుబడుల పేరుతో మోసాలకు జాగ్ర త్తగా ఉండాలని అన్నారు. ఇ టీవల కాలంలో సోషల్ మీడి యా, మొబైల్ యాప్‌లు, వెబ్‌సైట్ల ద్వా రా “తక్కువ సమ యంలో ఎక్కువ లాభాలు”, “పెట్టిన డబ్బు రెట్టింపు”, “రోజు కు భారీ ఆదాయం” వం టి ఆకర్షణీయమైన ప్రకటనలతో ప్రజలను మోసం చేసే ఘటనలు పెరుగుతున్నాయి.

    ముఖ్యంగా యువత, ఉద్యోగార్థు లు మరియు మద్య త రగతి ప్రజ లు త్వరగా డబ్బు సంపాదించాల ని ఆశపడే వ్యక్తులను లక్ష్యంగా చే సుకుని మోసగాళ్లు వివిధ పద్ధతు ల్లో వల వేస్తున్నారు. ఈ మోసగా ళ్లు మొదట చిన్న మొ త్తంలో లా భాలు చూపించి నమ్మకం కలిగించి, తరువాత పెద్ద మొత్తంలో పె ట్టుబడులు పెట్టమని ప్రోత్సహిస్తా రు. డబ్బు పంపించిన తర్వాత వా రు సంప్రదింపులు నిలిపి వేయడం లేదా ఖాతాలను మూసివేయడం జరుగుతోంది. కాబట్టి సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఆన్‌లైన్ పెట్టుబడులు పెట్టడం వల్ల ఆర్థిక నష్టం మాత్రమే కాకుండా మానసిక ఒత్తిడికి కూడా గురయ్యే అవకాశం ఉంది.

    కాబట్టి ఇలాంటి మోసాల పట్ల ప్రజలు, యువత జాగ్రత్తగా వ్యవ హరించాలి, ఎవరైనా ఇలాంటి మోసలకు పాల్పడితే తక్షణ మే సమీప పోలీస్ స్టేషన్‌ను తెలియజేయాలని అడిష నల్ ఎస్పి అన్నారు.ఈ కేసును నల్లగొండ డిఎస్పీ శివ రాం రెడ్డిపర్యవేక్షణలో ఇట్టి కేసులో నిందితులను అరెస్ట్ చేసిన నల్గొం డ II టౌన్ సి‌ఐ వి.రాఘవరావు, నల్గొండ రూ రల్ ఎస్‌ఐ సైదాబాబు మరియు వారి సిబ్బందిని నల్గొండ ఎస్‌పి శరత్ చంద్ర పవార్ అభినందించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.