Praja Deveena
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 2:42 pm Posted by : prajadeveena.com

Revanth Red CM Revanth Reddy : పాలమూరు ప్రాజెక్టులపై రేవంత్ ఫైర్.. “ఆ లెక్కలు నాకు అర్థం కావడం లేదు”

CM Revanth Reddy : పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Red dy), గత బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీ రుపై తీవ్ర విమర్శలు గు ప్పించారు. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడితే పాలమూ రు అభివృద్ధి చెందుతుందనే ఆశలు ప్ర జలకు కలిగించారని, కానీ పదేళ్ల పాలనలో జిల్లాకు ఆశించి న ఫలితాలు అంద లేదని అన్నారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు తగిన ప్రాధాన్యత ఇవ్వ కుండా, భారీగా నిధులు ఇతర ప్రాజెక్టులకు మళ్లించారని సీఎం ఆరోపించారు. 90 టీఎంసీల నీటి (TMC Water)తో లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నప్పటి కీ, ఈ ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైందని చెప్పారు. ఖర్చు సగం కూడా కాకముందే 90 శాతం పనులు పూర్తయ్యాయని చె ప్పడం ప్రజలను తప్పుదారి పట్టించడమేనని విమర్శించా రు.

“నేను 80 వేల పుస్తకాలు చదవలేదు. కానీ ఖర్చు తక్కువ చేసి పనులు ఎక్కువ పూర్తయ్యాయని చెప్పే ఆ లెక్కలు మాత్రం నాకు అర్థం కావడం లేదు” అంటూ రేవంత్ రెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సమావేశంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.ప్రాజెక్టుల నిర్మాణంలో భూసేక రణ కీలకమని గుర్తు చేసిన సీఎం, అనేక ప్రాంతాల్లో భూము లు సేకరించకుండానే పంపులు, లిఫ్టులు ఏర్పాటు చేశారని అన్నారు. పనులు పూర్తికాకముందే వేల కోట్ల రూపాయల బిల్లులు ఎలా చెల్లించారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం కూడా వేల ఎకరాల భూసేకరణ పెండింగ్‌లో ఉందని వెల్లడించారు.

 

Also Read:Miryalaguda terrible fire accident : బిగ్ బ్రేకింగ్, మిర్యాలగూడలో అర్ధరాత్రి ఘోర కలియుగం, నిద్రలోనే ముగ్గురు సజీవదహనం

ప్రాజెక్టులను తామే పూర్తి చేస్తామని బీఆర్ఎస్ నేతలు చేస్తు న్న వ్యాఖ్యలపై కూడా రేవంత్ ఘాటుగా స్పందించారు. జి ల్లాకు సహాయం చేయాలంటే వచ్చే రెండేళ్లు విమర్శలు మా నేసి నిశ్శబ్దంగా ఉండడమే పెద్ద సహాయమని అన్నారు. ప్ర జలు వాస్తవాలను గమనిస్తున్నారని, ఎవరూ అమాయకు లు కాదని స్పష్టం చేశారు.పాలమూరు అభివృద్ధిపై తనకు ప్రత్యేక బాధ్యత ఉందని పేర్కొన్న సీఎం, జిల్లాలో పుట్టి పెరి గిన వ్యక్తిగా అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయాలనే సంకల్పం తో పనిచేస్తున్నానని చెప్పారు. ప్రజలు భూసేకరణకు సహక రిస్తే రాబోయే రెండేళ్లలో ప్రధాన ప్రాజెక్టులను పూర్తి చేసే ల క్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.