Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నార్కట్ పల్లి: రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖను అన్ని రంగాల్లో నంబర్‌వన్ స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శా ఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని నార్కట్‌పల్లి మండల కేం ద్రంలో 76 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నా ర్కట్ పల్లి–మునుగోడు సేతుబంధు (సీఆర్‌ఐ) రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ మెరుగైన రహదా రులు, వంతెనలు, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్ర మాదాలను తగ్గించి ప్రజలకు సురక్షితమైన రవాణా వ్యవస్థ ను అందించడమే రాష్ట్ర ప్ర భుత్వ లక్ష్యమన్నారు.నల్లగొండ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, రోడ్లు, సా గునీరు, వ్యవసాయం, తదితర రంగాల్లో భారీ పె ట్టుబడులు పెట్టి జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తు న్నామని తెలిపారు. రైతులు ఎక్కువ స్థాయిలో ధాన్యం పం డిస్తున్నారని, వారికి అవసరమైన మౌ లిక సదుపాయాలు కల్పించేందు కు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నా రు.రాష్ట్రంలో నే ధాన్యం అత్యధికంగా పండించిన జిల్లా నల్గొండ జిల్లా అ ని అన్నారు.
నార్కట్‌పల్లి–మునుగోడు రహదారి అభివృద్ధి పనుల్లో స్థా నిక రైతుల భూములకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని మం త్రి హామీ ఇచ్చారు. ప్రజలకు ఇ బ్బం దులు లేకుండా అభివృద్ధి ప నులను పూర్తి చేస్తామని తెలి పారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను దశలవారీగా పూర్తి చేసి నార్కట్‌పల్లి ప్రాంతాన్ని రాష్ట్రంలో ఆదర్శంగా తీ ర్చిదిద్దుతామని చె ప్పారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షే మం, అభివృద్ధి అనే రెండు లక్ష్యా లతో ముందుకు సాగుతోందని, ప్రజల ఆశయాలకు అ నుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని మంత్రి కోమటిరెడ్డి వెం కటరెడ్డి వెల్లడించారు. నార్కెట్ పల్లి మండలంలో 600 కోట్లతో హ్యాంరోడ్లను,4000 కోట్లతో రా ష్ట్రంలో అన్ని రోడ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 2028 లో ఎస్ ఎల్ బిసి సొరంగ మార్గం పూర్తి చేసి నార్కట్ పల్లి మండల ప్రజలకు తాగు నీరు,సాగు నీరుఅందిస్తామన్నారు.
ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడా రు.ఈ సమావేశంలో భువనగిరి ఎంపీ చా మల కిరణ్ కు మార్ రెడ్డి, జిల్లా కలె క్టర్ బి చంద్రశేఖర్, సేతు బందు సి ఆ ర్ఐఎఫ్ చీఫ్ వసంత నాయక్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అద నపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్ ఈ శ్రీధర్ రెడ్డి, నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



