Thursday, October 8, 2026
More
    HomePoliticsMinister Komatireddy Venkat Reddy : ప్రజాప్రభుత్వంలో కొత్త పోలీస్ క్వార్టర్ల నిర్మాణం 

    Minister Komatireddy Venkat Reddy : ప్రజాప్రభుత్వంలో కొత్త పోలీస్ క్వార్టర్ల నిర్మాణం 

    📰 Generate e-Paper Clip

    –24 గంటల పని చేసే పోలీస్ సి బ్బందికి సహాయ సహకారాలు అం దిస్తాం

    –డ్రగ్స్ నిర్మూలనకు జిల్లా కలెక్టర్, ఎస్పీల కృషి అభినందనీయం

    –రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

    Minister Komatireddy Venkat Reddy :

    ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్రవ్యా ప్తంగా 232 కోట్ల రూపాయలతో పో లీసు అధికారులు, సిబ్బంది క్వార్ట ర్స్ నిర్మాణం చేపట్టడం జరిగిందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటో గ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెం కటరెడ్డి తెలిపారు. శనివారం నల్గొం డ జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్ లో నిర్మించిన ఏ ఆర్ డి ఎస్ పి రెసిడెన్సి క్వార్టర్స్, సీఐ, ఎస్ ఐ క్వార్టర్లను, శిశువిహార్ ను ఆ యన ప్రారంభించారు. ఈ సంద ర్భంగా మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు.

    ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన తర్వా త శిథిలావస్థలో ఉన్న పోలీస్ అధి కారులు, సిబ్బంది క్వా ర్టర్స్ ను తొల గించి వాటి స్థానంలో కొత్త క్వార్టర్ల ను నిర్మిస్తున్నామని, ఇందులో భాగంగానే అవసరమై నచోట 232 కోట్ల రూపాయలతో పోలీస్ క్వార్టర్స్ నిర్మాణం చేపట్టిన ట్లు వెల్లడించారు. ఇంకా ఎక్కడైనా ఇలాంటి స్థితిలో క్వార్టర్స్ ఉన్నట్ల యితే గుర్తించి వాటిని స్థానంలో కొ త్త వాటిని నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ హౌసింగ్ కా ర్పొరేషన్ ఎండి రమేష్ రెడ్డిని ఆదే శించారు.

    నల్గొండ జిల్లా డీఎస్పీ కార్యాలయం 50 సంవత్సరాల క్రితం నిర్మించిన ది అయినందున త్వరలోనే ఈ కా ర్యాలయాన్ని కూలగొట్టి దాని స్థా నంలో కొత్తది మంజూరు చేయిస్తా మని, రాష్ట్ర ముఖ్యమంత్రితో మా ట్లాడి డిఎస్పి కార్యాలయంతో పా టు, ఏ ఆర్ కానిస్టేబుల్ క్వార్టర్స్ శి థిలావస్థలో ఉన్నందున వాటికి కూ డా మంజూరు చేయించడం జరు గుతుందని తెలిపారు. పోలీసు అధి కారులు, సిబ్బంది 24 గంటలు పని చేస్తారని, అలాంటివారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామ న్నారు.

    హింసను నిర్మించి శాంతియుత వా తావరణం నెలకొల్పడంతో పాటు, సమాజంలో మత్తుమందుల ని ర్మూలన కు పోలీసులు కృషి చేస్తు న్నారని, ప్రత్యేకించి నల్గొండ జిల్లా లో జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ మ త్తుపదార్థాల నివారణకు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ రహిత రా ష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ము ఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలి పారు.

    జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, జి ల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐ జి ఇ క్బాల్, ఎం ఎల్ సి నెల్లికంటి స త్యం, స్థానిక సంస్థల ఇంచార్జ్ అద నపు కలెక్టర్ నారాయణ్ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీని వాస్, దేవరకొండ ఏ సి పి మౌనిక, ఇతర పోలీసు అధికారులు, తదిత రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నా రు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.