Wednesday, October 7, 2026
More
    Homeఖమ్మం జిల్లాBig Breaking : బిగ్ బ్రేకింగ్, డీజీపీని కలిసిన సీపీఐ (ఎం) రాష్ట్ర నాయకులు, సామినేని...

    Big Breaking : బిగ్ బ్రేకింగ్, డీజీపీని కలిసిన సీపీఐ (ఎం) రాష్ట్ర నాయకులు, సామినేని హంతకుల అరెస్టు చేయాలి

    📰 Generate e-Paper Clip

    Big Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్ : ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్ల పాడు గ్రామానికి చెందిన సీపీఐ (ఎం) రాష్ట్ర నాయకులు సామినేని రామారావు హంతకులను అరెస్ట్ చే యాలని సీపీఐ (ఎం) నాయకులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూ లకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శ న్ రావు, ఖమ్మం జిల్లా కార్యదర్శి వ ర్గ సభ్యులు మాదినేని రమేష్, మ ధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు, తెలంగాణ రైతు సం ఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పెసర కా యల జంగారెడ్డి లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) బి. శివధర్ రె డ్డిని కలిసి హైదరాబాదులో మంగ ళవారం వినతిపత్రం సమర్పించా రు.

    పార్టీకి చెందిన సామినేని రామారా వును అక్టోబర్ 31వ తేదీన పాతర్ల పాడు గ్రామంలో ఉదయం 5:30 గంటల సమయంలో అతి కిరాతకం గా హత్య చేశారని, ఈ ఘటన జరి గి ఇప్పటికీ12 రోజులుఅవుతున్నా నిందితులను అరెస్టు చేయటంలో పోలీస్ శాఖ నిర్లక్ష్యం వహిస్తున్నద ని ఆరోపించారు.

    రాజకీయ కక్షతోనే హత్య రామా రావు బతికి ఉంటే సీపీఐ (ఎం)ను ఓడించటం సాధ్యం కాదని భావించి రాజకీయ కక్షలతోనే ఆ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కుట్ర పన్ని హత్య చేశారని ఆరోపించా రు. హంతకులను నేను స్వయంగా చూశానని వారి పేర్లతో సహా రా మారావు భార్య స్వరాజ్యం పోలీ సులకు పిటిషన్ ఇచ్చినా ఇప్పటి వ రకు నిందితులను అరెస్టు చేయ క పోవటాన్ని వారు ఈ సందర్భంగా తప్పుపట్టారు.

    రామారావు నిస్వార్ధ నాయకుడు, వారి స్వగ్రామానికి రెండుసార్లు ఆ యన ఏకగ్రీవ సర్పంచిగా ఎన్నిక య్యారని తెలిపారు. రామారావు సతీమణి ఒకసారి గ్రామ సర్పంచ్ గా పనిచేసినట్లు పేర్కొన్నారు. గ్రా మంలోని పేదలకు తమ సొంత భూ మిని ఇండ్ల స్థలాల కోసం పంచిన చరిత్ర రామారావు కుటుంబానికి ఉందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శిగా రామారావు సేవలు అందించారని, సీపీఐ (ఎం)లో దా దాపు 50 ఏళ్లుగా కొనసాగుతున్నా రని వివరించారు.

    గత కొంతకాలం గా తన స్వగ్రామం పాతర్లపాడు లో ఉంటూ అభివృ ద్ధి కి పాటుపడుతున్నట్లు తెలిపారు. ఇది సహించలేని కాంగ్రెస్ నాయకు లు ఆయన ఉంటే రాజకీయంగా త మ మనుగడ సాగదని భావించి, కు ట్ర చేసి హత్య చేశారని ఆరోపిం చారు.ఈ హత్యకు కారణమైన వా రందరినీ అరెస్టు చేసి చట్టరీత్యా చ ర్యలు తీసుకోవాలని డిమాండ్ చే స్తూ డీజీపీకి వినతిపత్రం అందజే శారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.