Nalgonda District Administration :ప్రజా దీవెన, నల్లగొండ: ప్రాంతీయ అభివృద్ధికి సైన్స్, టెక్నాలజీ ఆధా రిత పరిష్కారాలను రూపొందించ డం ద్వారా విద్యాసంస్థలు, పరిశ్రమ లు, స్టాటప్ లు, ప్రభుత్వంతో కలిసి పని చేసే సైన్స్ అండ్ టెక్నాలజీ క్ల స్టర్ కు సంబంధించిన కేంద్ర ప్రభు త్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజరి కార్యాలయం డిసెంబర్ లో న్యూ ఢి ల్లీలో నిర్వహించనున్న అంతర్జాతీ య సమావేశంలో పాల్గొనేందుకు హాజరు కావలసిందిగా కోరుతూ న ల్గొండ జిల్లా యంత్రాంగాన్ని ఆహ్వా నించడం జరిగింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదా రు కార్యాలయం నుండి జిల్లా కలెక్ట ర్ కు మంగళవారం ఈ మెయిల్ ద్వారా ఆహ్వానం అందింది.
సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్ లో భా గంగా హైదరాబాద్ లోని టి హబ్ లో రీసెర్చ్ మరియు ఇన్నోవేషన్ స ర్కిల్ క్లస్టర్ ఏర్పాటు చేసిన విష యం తెలిసిందే. ఈ క్లస్టర్ వ్యవసా యం, జీవశాస్త్రం, మరియు పర్యావ రణ, సాంకేతిక రంగాలలో భాగస్వా మ్యదారులను కలిపి స్థిరమైన ఆవి ష్కరణలను ప్రోత్సహిస్తుంది. అంతే కాక ఎం ఎస్ ఎం ఈ లకు సాంకేతిక స్వీకరణ, స్టార్టప్ లు ,విధాన పరిశో ధన మొదలైన అంశాలలో సహ కా రం అందిస్తుంది.
ఈ నేపథ్యంలో ఢిల్లీలోని కేంద్ర ప్రభు త్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజరి కార్యాలయానికి చెందిన ప్రధాన కా ర్యాలయం డిసెంబర్ 4, 5 తేదీలలో డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ న్యూఢిల్లీలో “ఫస్ట్ ఇంట ర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సైన్స్ అం డ్ టెక్నాలజీ క్లస్టర్స్ మేకింగ్ లైవ్స్ ఈజియర్ త్రో ఎస్ అండ్ టి” అనే అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వ హిస్తున్నది. ఈ అంతర్జాతీయ స మావేశానికి కేంద్ర సైన్స్ అండ్ టె క్నాలజీ మంత్రి జీతేంద్ర సింగ్ ము ఖ్యఅతిథిగా హాజరవుతారని, అం తేగాక వివిధ దేశాల నుండి ప్రభు త్వాధికారులు, అకాడమిక్ లు, ప రిశ్రమల నిపుణులు, ఆవిష్కర్తలు పాల్గొంటారని ప్రధాన శాస్త్రీయ సల హాదారు కార్యాలయం తెలిపింది.
ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం సైన్స్ అండ్ టెక్నాలజీని సామాజిక సేవల పరిష్కారంలో ఉపయోగించడం, మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ క్ల స్టర్ల ద్వారా అభివృద్ధి చేయబడిన విజయవంతమైన నమూనాలను ప్రదర్శించడం. రాష్ట్రంలో సైన్స్ అం డ్ టెక్నాలజీ పర్యావరణాన్ని బలో పేతం చేయడంలో రెవెన్యూ శాఖ ముఖ్య పాత్ర పోసిస్తుండడాన్ని దృ ష్టిలో ఉంచుకొని నల్గొండ జిల్లా యంత్రాంగాన్ని ఈ సమావేశంలో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నట్లు ఆ సందేశంలో పేర్కొనడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సల హాదారు కార్యాలయం ఆహ్వానం మేరకు డిసెంబర్ 4న న్యూఢిల్లీ లో ని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో నిర్వహించే అంతర్జాతీయ సమావేశంలో పాల్గొన్నందుకు జిల్లా యంత్రాంగం తరఫున జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సంబంధిత అధి కారులు హాజరుకానున్నారు.
