Encounter Chhattisgarh :ప్రజా దీవెన, భద్రాచలం: చత్తీస్ గఢ్ దండకారణ్యంలో మరోసారి కా ల్పు ల మోతమోగింది. సుక్మా జిల్లాలో ఆదివారం జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో బాగంగా భద్రతా బలగాలు, మా వోయిస్టుల మధ్య భీకర ఎదురు కా ల్పులు చోటుచేసుకోవడంతో ము గ్గురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు.
మృతులను జన్మిలిషియా కమాండ ర్, స్నిపర్ స్పెషలిస్ట్ మద్వి దేవా, సీ ఎన్ఎం కమాండర్ పోడియం గంగి, కిష్టారాం కమిటీ మెంబర్ సోడి గంగి గా గుర్తించారు. సుక్మా జిల్లాలోని బెజ్జి, చింతగుఫా అడవుల మధ్య లో మావోయిస్టులు ఉన్నారన్న స మాచారంతో డీఆరో బలగాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. ఈ క్ర మంలో ఉదయం నుంచి ఇరువైపు ల నుంచి కాల్పులు కొనసాగుతు న్నట్లు సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ తె లిపారు. ఇప్పటివరకు ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు, పే లుడు పదార్థాలు ఆయుధాలు స్వా ధీనం చేసుకున్నట్లు అధికారు లు పే ర్కొన్నారు.
చనిపోయిన వారిలో ఇద్దరు మహి ళలు ఉన్నట్లు గుర్తించారు. ఆపరేష న్ ఇంకా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అ వకాశం ఉన్నదని తెలిపారు. కాల్పు లు ముగిసిన తర్వాతే పూర్తి స్పష్ట త వచ్చే అవకాశముందన్నారు.
