Wednesday, October 7, 2026
More
    HomePoliticsNalgonda district Collector ila Tripathi: నల్లగొండ జిల్లా కలెక్టర్ కీలకఆదేశం, ఎన్నికల సామాగ్రి పంపిణీ,...

    Nalgonda district Collector ila Tripathi: నల్లగొండ జిల్లా కలెక్టర్ కీలకఆదేశం, ఎన్నికల సామాగ్రి పంపిణీ, స్వీకరణ ప్రక్రియ జాగ్రత్తగా నిర్వహించాలి

    📰 Generate e-Paper Clip

    Nalgonda district Collector ila Tripathi: ప్రజా దీవెన, కేతేపల్లి: గ్రామపంచా యతీ ఎన్నికల సామాగ్రి పంపిణీ, స్వీకరణ ప్రక్రియను జాగ్రత్తగా నిర్వ హించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపా ఠి డిఆర్సి కేంద్రాల ఇన్చార్జిలను ఆ దేశించారు. సోమవారం ఆమె కేతే పల్లి మండల కేంద్రంలోని పీపాల్ పాఠశాలలో ఏర్పాటుచేసిన గ్రామ పంచాయతీ ఎన్నికల సామాగ్రి పం పిణీ,స్వీకరణ కేంద్రాన్ని తనిఖీ చేశా రు. ఎన్నికల సామాగ్రి, పోస్టల్ బ్యా లెట్ సామాగ్రిని, పోలింగ్ బాక్సుల ను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

    ఎన్నికల నిర్వహణ అత్యంత బా ధ్యతతో నిర్వర్తించాల్సిన ప్రక్రియ అ ని, పోలింగ్ సిబ్బందికి కావాల్సిన సామాగ్రిని సరైన సమయానికి, సరై న ప్రోటోకాల్ ప్రకారం అందించాల ని, ప్రతి కిట్ ను చెక్ లిస్ట్ తో సరి పోల్చిచూసుకొని పంపిణీ చేయాల న్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత రిసెప్షన్ సమయంలో సైతం ఇదే విధంగా అన్ని క్షున్నంగా పరిశీలించి తీసుకోవాలని, రికార్డింగ్, ధ్రువీక ర ణ పనులు కచ్చితంగా జరిగేలా చూడాలన్నారు. అలాగే సెంటర్లో ఏ ర్పాటు చేసిన సౌకర్యాలు భద్రతా ప్రమాణాలు, సీసీ కెమెరాల పర్య వేక్షణ, త్రాగునీరు, ర్యాంపులు, వీల్ చైర్లు, లైటింగ్ తదితర ఏర్పాట్లు చే సుకోవాలని ఆదేశించారు. అధి కా రులందరూ జాగ్రత్తగా పని చేయా లన్నారు.

    ఈ సందర్భంగా ఎంపిడిఓ కార్యాల యంలో పోస్టల్ బ్యాలెట్, మెటీరి యల్ ను పరిశీలించారు.జడ్పీ సీఈ వో శ్రీనివాసరావు,జిల్లా పంచాయత అధికారి వెంకటయ్య,నల్గొండ ఆర్డి ఓ వై. అశోక్ రెడ్డి , జిల్లా గ్రామీణ అ భివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి , కేతప ల్లి తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీ వో బి .శ్రీనివాసులు కలెక్టర్ వెంట ఉన్నారు.

    *ఎన్నికల్లో అన్ని విభాగాలు స మన్వయంతో పనిచేయాలి*

    గ్రామపంచాయతీ ఎన్నికల నేప థ్యంలో అన్ని విభాగాలు సమన్వ యంతో పనిచేయాలని ఎటువంటి లోపాలు కనిపించిన వెంటనే సరిది ద్దుకొని పని చేయాలనీ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం ఆమె శాలిగౌరారం వ్యవసాయ మా ర్కెట్ కమిటీ యార్డ్ లో ఏర్పాటు చే సిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ మరి యు రిసెప్షన్ కేంద్రాన్ని తనిఖీ చే శారు. ఎన్నికల పోలింగ్ సామాగ్రి ని ,పోస్టల్ బ్యాలెట్ పత్రాలను, పో లింగ్ బాక్సులను పరిశీలించారు.

    పోలింగ్ ఏర్పాట్లపై అధికారులతో వివరంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో గ్రామస్థా యి ఎన్నికలు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటాయని, ప్రతి ఒక్కరూ ఓ టు హక్కు వినియోగించు కునేం దుకు ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలు క్రమబద్ధంగా, శాస్త్రీయ పద్ధతుల్లో ఉండాలన్నారు.

    పోలింగ్ సిబ్బందికి అవసరమైన సా మాగ్రి పంపిణీ ఆలస్యం లేకుండా ని ర్వహించాలని,పోలింగ్ మెటీరియ ల్ పంపిణీ ,స్వీకరించే ప్రక్రియలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి స్ప ష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాల న్నారు. రిసీవింగ్ కేంద్రాలలో బ్యా లెట్ బాక్సులు స్వీకరణ సమయం లో ఏవైనా గందరగోళాలు ఏర్ప డకుండా పటిష్ట నియంత్రణ చర్య లు తప్పనిసరి అని అధికారులకు సూచించారు.

    పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బం దోబస్తు నిరంతరం ఉండాలని, ప్ర వే శ, నిష్కరణ ద్వారాల వద్ద క్యూలైన్ వ్యవస్థను అమలు చేయాలని, సీసీ కెమెరాలు ద్వారా కార్యకలాపాలు నిరంతరం పర్యవేక్షించే విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి నిర్ల క్ష్యం సహించకుండా ప్రతి అధికారి తన బాధ్యతను పూర్తిస్థాయిలో ని ర్వహించాలన్నారు.

    సమన్వయం, శీఘ్ర స్పందన, పార దర్శకత ఇవే ఎన్నికలకు విజయవం తమైన మూలాధారాలని స్పష్టంగా తెలిపారు. అదేవిధంగా తాగునీరు, విశ్రాంతి గదులు, పారిశుద్ధ వసతు లు ,వైద్య సౌకర్యాలు ర్యాంపులు, లైటింగ్ సదుపాయాలు ఏర్పాటు చే యాలని చెప్పారు.జడ్పీ సీఈఓ శ్రీని వాసరావు,జిల్లా పంచాయతీ రాజ్ అధికారి వెంకటయ్య,నల్గొండ ఆర్డీ వో వై. అశోక్ రెడ్డి, జిల్లా గ్రామీణ అ భివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి, శాలి గౌరారం తహసీ ల్దార్ వరప్రసాద్, ఎంపీడీవో జ్యోతి లక్ష్మి తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.