Ex Minister Harish Rao : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల క ట్టుకథలు చెప్పి, కోట్లు ఖర్చు చేసి గ్లోబల్ సమ్మిట్ అట్టర్ ఫ్లాప్ చేశా రంటూ రేవంత్ రెడ్డిపై మాజీ మం త్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ధ్వజమెత్తారు. క్యూర్, ప్యూర్, రేర్ అంటూ అంటున్న రేవంత్ రెడ్డి తె లంగాణను కొల్లగొడుతున్న చోర్ అంటూ ఫైర్ అయ్యారు. గ్లోబల్ స మ్మిట్ లో MOU ల వెనుక చీ కటి ఒప్పందాలు, అంకెల గారడీ తప్ప ప్రజలకు పనికొచ్చే పనులు ఏవీ లే వని మండిపడ్డారు. రెండేళ్లుగా కో ట్లు ఖర్చు చేసి నువ్వు తిరిగిన దేశా లు, నిర్వహించిన సమ్మిట్స్ ద్వారా మొత్తం ఎన్ని కోట్ల పెట్టుబడులు వ చ్చాయి, అందులో ఎన్ని కంపెనీలు గ్రౌండ్ అయ్యాయి ఎంత మంది తె లంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వ చ్చాయి, దమ్ముంటే శ్వేతపత్రం వి డుదల చేయాలని రేవంత్ రెడ్డికి బ హిరంగ సవాల్ చేశారు. హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే..
కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి గురించి గ్లోబల్ సమ్మిట్ వేదికగా టో నీ బ్లెయిర్, సుబ్బారావు ఇచ్చిన కి తాబు రేవంత్ రెడ్డికి చెంపపెట్ట న్నా రు.రేవంత్ రెడ్డి నిర్వహించింది గ్లో బల్ సమ్మిట్ లాగా లేదు, భూము లు అమ్ముకునేందుకు ఏర్పాటు చే సిన రియల్ ఎస్టేట్ ఎక్స్ పోలాగా ఉందన్నారు. ఫ్యూచర్ సిటీ వేదికగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అంతర్జాతీ య స్థాయిలో పరువు పోగొట్టుకు న్నది.అందాల పోటీల్లాగే, ఏఐ స మ్మిట్ లాగే గ్లోబల్ సమ్మిట్ కూడా అట్టర్ ఫ్లాప్ షో అయ్యింది.
విజన్ డాక్యుమెంట్ లో విజన్ లే దు, దాన్ని చేరుకునే మిషన్ లేదు.
విజన్ డాక్యుమెంట్ ప్రిపరేషన్ లో కమిట్మెంట్ లేదు. ఆ డాక్యుమెంట్ కు శాంటిటీ లేదు.అక్షరాలు, అంకె లు, రంగు రంగుల పేజీలతో అర్థం లేకుండా అల్లిన అబద్ధాలు, అర్థ సత్యాల ‘విజన్ లెస్’ డాక్యుమెంట్ అది.రెండేళ్ల పాలన వైఫల్యాల నుం చి దృష్టి మరల్చడానికి రేవంత్ రెడ్డి చేసిన పీఆర్ స్టంట్ గ్లోబల్ సమ్మిట్.
గ్లోబల్ సమ్మిట్ అని మూడు నెలల నుంచి ఊదరగొట్టారు.18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 5వేల మంది వి దేశీ ప్రతినిధులు వస్తరన్నరు.
మంత్రులు పోయి ఒక్కో ముఖ్య మంత్రికి స్వయంగా ఆహ్వాన పత్రి కలు అందించారు.కనీసం ఒక్క ము ఖ్యమంత్రి రాలేదు, 5వేల మంది వి దేశీ రిప్రెజంటేటివ్స్ రాలేదు. ఒక్క మీ పార్టనర్ డీకే శివకుమార్ తప్ప.
చివరకు ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ ఎంపీలు కూడా రాని పరిస్థితి. గ్లో బల్ సమ్మిట్ లో గ్లోబల్ రిప్రెజెంటే టివ్స్ కరువయ్యారు. ఆఖరుకు ఎం బీఏ విద్యార్థులను, కాంగ్రెస్ నాయ కులు, కార్యకర్తలకు కోట్ వేసి తెచ్చి కూర్చోబెట్టారు. గ్లోబల్ సమ్మిట్ కా దు అది లోకల్ సమ్మిట్ అట్టర్ ఫ్లాప్ పొలిటికల్ షో ఇది. ఫార్మా సిటీ భూ ముల్లో ఫ్యూచర్ సిటీ అని, ఆ ఫ్యూ చర్ సిటీలో పెట్టుబడుల కోసం గ్లో బల్ సమ్మిట్ అని అందమైన కట్టు కథ అల్లినవు రేవంత్ రెడ్డి, బయో స్కోప్ సినిమా చూపించావు, భూ ముల స్కాం అయిపోయింది.పవర్ స్కాం అయిపోయింది,లిక్కర్ స్కాం అయిపోయింది. ఇప్పుడుఇగ రియ ల్ ఎస్టేట్ స్కాం మొదలు పెట్టిండు.
రేవంతు గ్లోబల్ సమ్మిట్ పెట్టింది ఫో ర్త్ సిటీ వైపు రియల్ ఎస్టేట్ డెవల ప్మెంట్ కోసమే కానీ, పెట్టుబడుల కో సం కాదు అని అందరికీ అర్థం అ య్యింది.ఫార్మా సిటీ పక్క భూము లు ముందుగానే మీ బినామీలతో కొనిపించి లే అవుట్లు చేసి రెడీగా పెట్టుకున్నావు.ఇప్పుడు అక్కడ గ్లో బల్ సమ్మిట్ అని పెట్టీ, ఆ భూము లను తెగ నమ్మడానికి ప్లాన్ వేశా వు. గ్లోబల్ సమ్మిట్ పేరిట రియల్ ఎస్టేట్ స్కాం కు తెరతీసావు. పెట్టు బడులు తెచ్చింది లేదు, ఉద్యోగా లు ఇచ్చింది లేదు. రెండేళ్లుగా పెట్టు బడుల పేరిట కట్టు కథలు తప్ప చే సింది ఏం లేదు.2024 జనవరి నెల లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల మంత్రి దావోస్ సమావే శానికి వెళ్లారు. 40,232 కోట్ల పెట్టు బ డులు సాధించినం అని, 2,500 ప్రత్యక్ష ఉద్యోగాలు వస్తయని చె ప్పారు.ఆ పెట్టుబడులు ఏమయ్యా యి ఆ ఉద్యోగాలు ఎక్కడ వచ్చా యి.
ఇదే రాష్ట్ర ప్రభుత్వం 2024 సెప్టెం బర్ నెలలో ఏఐ గ్లోబల్ సమ్మిట్ -2 024 నిర్వహించింది.100 దేశాల కంపెనీలు పాల్గొన్నరూ, 20 అవగా హన ఒప్పందాలు కుదుర్చుకున్నం అని డబ్బా కొట్టారు.ఆ పెట్టుబడు లు ఏమయ్యాయి, ఆ ఉద్యోగాలు ఎక్కడ వచ్చాయి.జనవరి 2025 వ రల్డ్ ఎకనామిక్ ఫోరం దావాస్ లో జరిగిన సమావేశం సీఎం, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నరు. పె ద్ద ఎత్తున పెట్టుబడులు తెస్తున్నం అని అక్కడ ఎంతో తిరిగినట్లు, ఎం తో కష్టపడ్డట్లు సూటు బూటు వేసు కున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెట్టించుకున్నరు.
అంతా అయిపోయినంక 16 ప్రపం చ అగ్రగామి కంపెనీలతో సుమారు లక్షా డెబ్బై ఎనిమిది వేల కోట్ల (1.7 8లక్షల కోట్లు) పెట్టుబడుల ఒప్పం దాలను రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చు కున్నదని ఘనంగా ప్రకటించారు. ఈ ఒప్పందాల ద్వారా 49,550 ఉద్యోగాలు వస్తయి అన్నరు. ఆ పె ట్టుబడులు ఏమయ్యాయి? ఆ ఉ ద్యోగాలు ఎక్కడ వచ్చాయి?పెట్టు బడులు తెస్తం అని రెండు సార్లు దా వోస్ పోయిండు. అమెరికా పోయిం డు. సౌత్ కొరియా పోయిండు. ఆ స్ట్రేలియా పోయిండు, సింగపూర్ పోయిండు, జపాన్ పోయిండు. ఆ పెట్టుబడులు ఏమయ్యాయి, ఆ ఉద్యోగాలు ఎక్కడ వచ్చాయి.
నిన్న, మొన్న రెండు రోజుల పాటు జరిగిన సమ్మిట్ లో ఏకంగా 5లక్షల కోట్ల పై చిలుకు పెట్టుబడులు, వేల సంఖ్యలో ఉద్యోగాలు అంటున్నరు.
రేవంత్ రెడ్డి నీకు బహిరంగ సవాల్ విసురుతున్నా దమ్ముంటే స్వీకరిం చు. రెండేళ్లుగా కోట్లు ఖర్చు చేసి ను వ్వు తిరిగిన దేశాలు, నిర్వహించిన సమ్మిట్స్ ద్వారా మొత్తం ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయి, అందులో ఎన్ని కంపెనీలు గ్రౌండ్ అయ్యాయి ఎంత మంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి.. శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చే స్తున్నాం. దావోస్ పెట్టుబడులు, అ మెరికా, సౌత్ కొరియా, జపాన్, సిం గపూర్ కంపెనీలు ఎక్కడకు పోయా యి, పెట్టుబడులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి. విదేశీ పర్యటనలు, గ్లోబ ల్ సమ్మిట్ పేరుతో ప్రభుత్వం చేస్తు న్న ఆర్భాటం చూస్తే, ఆచరణకు నో చుకోని ఆరు గ్యారెంటీలవలే ఉ న్నాయి.క్యూర్, ప్యూర్, రేర్ అంటూ అంటున్న రేవంత్ రెడ్డి తెలంగాణ ను కొల్లగొడుతున్న చోర్.
2025-26 బడ్జెట్ ప్రసంగంలో మెగా మాస్టర్ ప్లాన్ 2050 అన్నరు. ఒక్క చోటే పారిశ్రామిక ప్రగతి కేంద్రీకృతం కాకుండా, పారిశ్రామిక వికేంద్రీకరణ జరిపి తెలంగాణలోని అన్ని ప్రాంతా లు, హైదరాబాద్ తరహాలోనే అభి వృద్ది చేస్తం అన్నరు.ఇప్పుడేం చేస్తు న్నరు. ఫ్యూచర్ సిటీ పేరిట ఒకే ప్రాంతంలో పరిశ్రమల కేంద్రీకరణ చేయాలని చూస్తున్నరు. మీ చెత్త విధానాలను చూసి ఉన్న పరిశ్రమ లు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న యి. ఫ్యూచర్ సిటీ అని ఫార్మాసిటీ ని బొంద పెట్టినవు కాబట్టే సిగాచి ఇండస్ట్రీస్, విరూపాక్ష ఆర్గానిక్స్ వంటి హైదరాబాద్ బేస్డ్ ఫార్మా కంపెనీలు ఆంద్రాకు తరలివెళ్లాయి.
కర్నూల్ జిల్లాలోని ఓర్వకల్ ఇండ స్ట్రియల్ పార్క్ లో 2315 కోట్ల పె ట్టుబడులు పెట్టి, 3000 ఉద్యోగా లు ఇచ్చే ప్రణాళికలు రూపొందిం చాయి. ఒకవైపు గ్లోబల్ సమ్మిట్ జ రుగుతుంటే, మరో వైపు హైదరా బా లద్ లో నడిరోడ్డుపై మర్డర్లు జరుగుతున్నయి.
తెలంగాణ అంటే బిజినెస్ అంటూ దిగజారుడు నిర్వచనాలు ఇచ్చే మీ కు బిజినెస్ చేయడం తప్ప తెలంగా ణ ప్రజలు, రైతుల కష్టాలు కనిపిం చవా. గ్లోబల్ సమ్మిట్ లో MOU ల వెనుక చీకటి ఒప్పందాలు, అంకెల గారడీ తప్ప ప్రజలకు పనికొచ్చే ప నులు ఏవీ లేవు, కోట్లాది రూపా యలు దండుకునే స్కెచ్ ను రేవంత్ రెడ్డి గ్లోబల్ సమిట్ లో ఘనంగా అ మలు చేస్తున్నారు.అంబానీలు, ఆ దానీలు దేశాన్ని దోచుకుంటున్నా ర ని రాహుల్ గాంధీ చెబుతుంటే, రా హుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తు న్నానని, చెప్పుకునే రేవంత్ రెడ్డి మాత్రం అంబానీ, ఆదానీలకు తె లంగాణను అమ్మేస్తున్నడు.రాష్ట్రం లో రాహుల్ గాంధీ ఆలోచనలు ప క్కన బెట్టి అదానీ, అంబానీ ప్రతిని ధులకు రేవంత్ ఎర్ర తివాచీ పర చడంలో ఆంతర్యం ఏమిటీ. వి మ ర్శలు రావడంతో గతంలో అదానీ ఇ చ్చిన వందకోట్ల రూపాయల విరా ళం చెక్కును వెనక్కు పంపి గ్లోబల్ సమిట్ ప్రారంభ కార్యక్రమంలో అ దానీ కుమారుడు కరణ్ అదానీతో ఒప్పందాలు ఎలా చేసుకున్నారు. సీఎం రేవంత్, కాంగ్రెస్ ముఖ్య నే త ల బినామీలతోనే ఒప్పందాలు జరి గాయి. ఆ పూర్తి వివరాలు త్వరలో బయటపెడుతాం.
గుజరాత్ సమ్మిట్ అయినా, కేరళ సమ్మిట్ అయినా, కర్ణాటక సమ్మిట్, వెస్ట్ బెంగాల్ సమ్మిట్ అయినా గ తంలో పీఆర్ స్టంట్లు అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలే కాబట్టే, రేవంత్ గ్లోబల్ సమ్మిట్ పీఆర్ స్టంట్ గా భా వించి రాహుల్, ప్రియాంక, ఖార్గే లు ముఖం చాటేసారు. మీరు నిర్వ హించిన గ్లోబల్ సమ్మిట్ లో, మీ స మక్షంలోనే పదేళ్ల బి ఆర్ ఎస్ పాల నలో జరిగిన రికార్డు స్థాయి తెలం గాణ అభివృద్ధి గురించి బ్రిటన్ మా జీ ప్రధాని టోనీ బ్లెయిర్ వివరించా రు.తెలంగాణ ఒక మాడల్ అంటూ పొ గడ్తలు కురిపించారు. అదే వేది క నుండి ఆర్బీఐ మాజీ గవర్నర్ దు వ్వూరి సుబ్బారావు. కేసీఆర్ పాల నలో వృద్ధిరేటులో దేశంలోనే తెలం గాణ అగ్రస్థానంలో నిలిచిందని ప్ర శంసించారు.
కేసీఆర్ పదేళ్ళ పాలన గురించి, తె లంగాణ అభివృద్ధి గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడే రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. నీచెత్త విధానాలు, చిల్లర చేష్టలు, వాటా లు, కమీషన్ల కోసం కేసీఆర్ చే సిన అభివృద్ధిని నాశనం చెయ్యకు. నీకు చేతనైతే ఆ అభివృద్ధిని కొనసాగిం చి చూపు. అంతే గాని చేసిన అభి వృద్ధిని విద్వంసం చేయొద్దని హిత వు పలుకుతున్నాం.

