Wednesday, October 7, 2026
More
    HomeతెలంగాణBig Breaking : బిగ్ బ్రేకింగ్, అఖండ-2 కు హైకోర్టు డివిజన్ బెంచ్ అభయం, సింగిల్‌...

    Big Breaking : బిగ్ బ్రేకింగ్, అఖండ-2 కు హైకోర్టు డివిజన్ బెంచ్ అభయం, సింగిల్‌ బెంచ్‌ ఉత్తర్వులపై డివిజన్‌ బెంచ్‌స్టే

    📰 Generate e-Paper Clip

    Big Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: అఖండ -2 సినిమా ఆది నుంచి వివాదాలకు నెలవుగా నిలిచిన విషయం తెలి సిందే. అయితే తాజాగా అఖండ-2 చిత్ర నిర్మాతలకు తెలంగాణ హై కో ర్టు డివిజన్‌ బెంచ్‌ అభయమిచ్చిం ది. ఇటీవల అఖండ -2కు సినిమా పై హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఉ త్తర్వులపై డివిజన్ బెంచ్ అభ్యంత రం వ్యక్తం చేసిన విషయం విదిత మే.

    హైకోర్టు సింగిల్ బెంచ్ వెలువరించి న ఉత్తర్వులపై అఖండ సినిమా యూనిట్ డివిజన్ బెంచ్ కు అప్పీ ల్ చేయడంతో విచారించిన డివిజ న్ బెంచ్ డిసెంబర్ 14వ తేదీ వరకు స్టే విధిస్తూ నిర్ణయం ప్రకటించింది. ఈ క్రమంలోనే అందరి వాదనలు వినకుండా సింగిల్‌ బెంచ్‌ తీర్పు ఇ చ్చిందని డివిజన్‌ బెంచ్‌ వ్యాఖ్యా నించింది. విచారణ అనంతరం ఈ అంశంపై తదుపరి విచారణను డి సెంబర్ 15 వ తేదీకి వాయిదా వే సింది.

    14 రీల్స్ యాజమాన్యం హైకోర్టు సింగిల్ బెంచ్ వెలువరించి తీర్పుపై గురువారం మధ్యాహ్నం హైకోర్టు డి విజన్ బెంచ్‌లో లంచ్ మోషన్‌ను దాఖలు చేసింది. అఖండ-2పై సింగి ల్‌ బెంచ్‌ ఉత్తర్వులను డివిజన్‌ బెం చ్‌లో 14 రీల్స్ సంస్థ అప్పీల్‌ చేయ గా ఈ పిటిషన్‌పై మధ్యాహ్నం 2. 3 0 గంటలకు డివిజన్ బెంచ్ విచార ణ చేపట్టింది. ఈ విచారణలో ఈ చి త్ర నిర్మాతలకు కోర్టు స్వల్ప ఊరట నిచ్చింది.

    *బుక్‌ మై షోపై హైకోర్టు ఆగ్ర హం…* గురువారం ఉదయం అ ఖండ 2 సి నిమాపై తెలంగాణ హై కోర్టులో విచారణ జరిగింది. తమ ఆదేశాలు ధిక్కరించడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదే శాలిచ్చినా ఈ సినిమా టికెట్లను ఎందుకు ఆన్‌లైన్‌ లో విక్రయిస్తు న్నారంటూ బుక్‌ మై షోను తెలంగా ణ హైకోర్టు ప్రశ్నించింది.

    పెంచిన ధరలతో టికెట్లను ఆన్‌ లై న్‌లో విక్రయిస్తున్నారా లేదా అం టూ అసహనం వ్యక్తం చేసింది. మీ పై ఎందుకు కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ బుక్ మైషోను వివరణ కోరింది. మధ్యా హ్నం లంచ్ మోషన్ పిటి షన్‌తో మళ్లీ విచారణ చేపట్టింది. హైకోర్టు డివిజన్ బెంచ్ వెలువరించి తీర్పు నేపద్యంలో ఈ చిత్రనిర్మాతకు భారీ ఊరటలభించినట్లు భావిస్తున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.