CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం లో బీసీలకు స్థానిక సంస్థల ఎన్ని క ల్లో 42 శాతం రిజర్వేషన్లను సాధిం చడంపై శాసనసభ సమావేశాల్లో చ ర్చించి అన్ని పార్టీల అభిప్రాయం మే రకు ఎంపీటీసీ, జేడ్పీటీసీ, మున్సి పల్ ఎన్నికలపై నిర్ణయానికి వస్తా మని ముఖ్యమంత్రి ఎనుముల రే వంత్ రెడ్డి కీలక వ్యాఖ్య చేశారు.
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్ని కలను ప్రశాంతమైన వాతావరణం లో, ప్రజాస్వామిక బద్ధంగా ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ని ర్వహించినందుకు ఎన్నికల యం త్రాంగానికి,అధికారులకు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమా ర్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రె డ్డి, దామోదర రాజనర్సింహ, ధన సరి అనసూయ సీతక్కతో పాటు పలువురు ప్రజాప్రతినిధులతో క లి సి ముఖ్యమంత్రి మీడియా సమావే శంలో మాట్లాడారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రజ లకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో 12,728 పంచాయతీల కు గాను 12,702 గ్రామ పంచాయ తీలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగ్గా, ప్రజాస్వామిక బద్ధంగా స్వే చ్ఛాయుత వాతావరణంలో ఎన్ని క లు నిర్వహించడం, ప్రజలు స్వేచ్ఛ గా తీర్పును ఇవ్వడం అభినందనీ యమని అన్నారు.
ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పరిపాలన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలతో ప్రజల ముందుకు వెళ్లగా, తమకు 7,527 గ్రామ పంచాయతీల్లో (66 శాతం) ప్రజలు అందించిన ఆశీర్వా దం ప్రభుత్వంపై మరింత బాధ్యత పెంచిందని చెప్పారు. ప్రజల ఆశీ ర్వాదంలో రాష్ట్రంలో సంక్షేమం, అ భివృద్ధి రెండిండినీ సమపాళ్లలో ముందుకు తీసుకెళుతున్నామని అన్నారు.
రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డుల జా రీ, సన్నబియ్యం పంపిణీ, రైతు రు ణమాఫీ, రైతు భరోసా, సన్నధాన్యా నికి బోనస్ చెల్లింపు, ఉచిత కరెం ట్, మహిళలకు ఉచిత బస్సు సౌ కర్యం, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, రూ. 500 లకే సిలిండర్, 27 వేల కోట్ల రూపాయల మేరకు సున్నా వడ్డీకే మహిళా సమాఖ్యల కు రుణాలు, 4.5 లక్షల మంది ని రుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, అధి కారం చేపట్టిన తొలి ఏడాదిలోనే 61 వేల ఉద్యోగాల భర్తీ, సుదీర్ఘకా లం అపరిష్కృతంగా ఉన్న ఎస్సీ వర్గీకరణ సమస్యకు పరిష్కారం, వందేళ్లుగా జరగని బీసీ కులగణన చేపట్టడం, పేదలకు మంచి విద్యను అందించాలన్న ప్రయత్నాలు ఇలా అనేక అంశాల్లో ప్రభుత్వం ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధిని, సంక్షేమ కా ర్యక్రమాలతో ముందుకు వెళుతోంద ని ముఖ్యమంత్రి వివరించారు.
ఒకవైపు ఆదాయాన్ని పెంచుకుం టూ దుబారాను తగ్గిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ఒక్క రూపాయి కూడా దుర్విని యోగం జరక్కుండా ప్రజలకు మేలు చేయాలన్నదే ప్రభుత్వ తాపత్రయ మని ఒక ప్రశ్నకు సమాధానంగా ముఖ్యమంత్రి చెప్పారు.కృష్ణా, గో దావరి జలాలపై తెలంగాణ హక్కు లకు సంబంధించి పూర్తి వివరాలతో శాసనసభలో చర్చించడానికి ప్రభు త్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
