Thursday, October 8, 2026
More
    HomePoliticsMLA Komatireddy Raj Gopal Reddy : మునుగోడు ఎమ్మెల్యే అప్పీల్, వ యసుతో సంబంధం...

    MLA Komatireddy Raj Gopal Reddy : మునుగోడు ఎమ్మెల్యే అప్పీల్, వ యసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఆటలు ఆడాలి

    📰 Generate e-Paper Clip

    –క్రీడలతో మానసిక ఉల్లాసం మెరుగుపడుతుంది

    –గ్రామీణ ప్రాంతాల్లోని టాలెంటున్న విద్యార్థులను రాష్ట్ర, జాతీయ స్థా యి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతాం

    –క్రికెట్ టోర్నమెంట్ ప్రైజ్ ల ప్రధా నోత్సవంలో కోమటిరెడ్డి రాజ్ గోపా ల్ రెడ్డి

    MLA Komatireddy Raj Gopal Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు క్రీ డలు ఆడాలని క్రీడలు ఆడటం వల్ల శారీరక సామర్థ్యం మెరుగవుతుం దని మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు. ఈ మైదానంలో క్రికెట్ ఆటను చూస్తుం టే చిన్ననాటి మేము ఆడిన ఆట లు గుర్తుకొస్తున్నాయని ప్రతి ఒక్కరి కి క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తా యన్నారు.నల్లగొండ జిల్లా కేంద్రం లోని నాగార్జున కళాశాల మైదా నంలో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌం డేషన్ ఆధ్వర్యంలో నల్గొండ ప్రీమి యర్ లీగ్ -6 (NPL-6) క్రికెట్ టో ర్న మెంట్ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅ తి థిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా మొదటి బహుమతి ద్వితీయ బ హుమతి సాధించిన క్రీడాకారులకు నగదు చెక్కుతో పాటు ట్రోఫీలను ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ , నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్య క్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ ము న్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి వై స్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ తో కలిసి బహుమతులను అందజేశా రు.

    ఈ సందర్భంగా రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ టోర్నమెంటును రా బోయే కాలంలో మునుగోడు నియో జకవర్గంలో కూడా నిర్వహిస్తామని, గ్రామీణ ప్రాంతాలలో టాలెంట్ ఉ న్న పేద విద్యార్థులను గుర్తించి వా రిని రాష్ట్రస్థాయి జాతీయ స్థాయి క్రీ డాకారులుగా తీర్చిదిద్దడానికి కో మటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ తర ఫున సహకరిస్తామన్నారు.

    నల్గొండ జిల్లా కేంద్రంలో క్రికెట్ ఫుట్ బాల్ లాంటి ఆటలు ఆడడానికి ప ది ఎకరాల స్థలంలో నూతన హం గులతో స్టేడియం ఏర్పాటు చేసుకొ ని సామర్థ్యం ఉన్న క్రీడాకారులను తయారు చేసుకోవాలన్నారు. నూ తన స్టేడియం ఏర్పాటు కోసం రా ష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతాన న్నారు.

    ఇదిలా ఉండగా NPL-6 క్రికెట్ టో ర్నమెంట్ విజేత డీకే వారియర్స్ కు ప్రథమ బహుమతిగా కోమటిరెడ్డి ప్ర తీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో షీల్డ్, రూ. 2,22,222 నగదు బహుమ తి ని అందజేశారు. రన్నర్ గా నిలిచిన ఆదా సి.సి జట్టుకు నల్లగొండ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరపున షీ ల్డ్, రూ. 1,11,111 నగదు బహు మతులను అందజేశారు. అదేవిధం గా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్, బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్ మాన్ లకు షీల్డ్ తో పాటు న గదు బహుమతులను అందించా రు. ఫైనల్ మ్యాచ్ ను తిలకించ డానికి క్రీడాభిమానులు పెద్ద సంఖ్య లో తరలివచ్చారు.దీంతో ఎన్జీ కళా శాల ప్రాంగణమంతా సందడిగా మారింది.

    ఈ బహుమతుల ప్రధానోత్సవ కా ర్యక్రమంలో నల్గొండ మార్కెట్ కమి టీ చైర్మన్ జూకురి రమేష్, నల్లగొం డ, కనగల్ మాజీ జడ్పీటీసీలు వం గూరి లక్ష్మయ్య, నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్,డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, టోర్నమెంట్ ఆర్గనైజర్స్ ప్రదీప్ నాయక్, కేసాని వేణుగోపాల్ రెడ్డి, ముత్తినేని నాగేశ్వరరావు, బోనగిరి ప్రభాకర్, రంగా, పాలకూరి శ్రీధర్, నిర్వాహకులు, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు యువజన కాంగ్రె స్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.