— జిల్లా గౌరవ అధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణ
Pending Bills of ASHA Workers : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్ల గొండ జిల్లాలో పనిచేస్తున్న ఆశా వ ర్కర్లకు మూడు సంవత్సరాల లేప్ర సి సర్వే బిల్లులు, అసెంబ్లీ పార్లమెం టు ఎలక్షన్ డ్యూటీ డబ్బులు వెం టనే చెల్లించాలని, సబ్ సెంటర్ డ్యూటీలు రద్దు చేయాలని పని భా రాన్ని తగ్గించాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా గౌరవ అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. సోమవారం ఆశా వర్కర్ల సమస్యల పరిష్కరించాలని కలెక్టరేట్ ముందు ముందు భారీ ధర్నా జరిగింది. అనంతరం జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ కు వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ ధర్నాను ఉద్దేశించి ఆయన మా ట్లాడుతూ ఎన్ హెచ్ ఎం స్కీములో భాగంగా నల్గొండ జిల్లాలో 39 పట్ట ణ మరియు గ్రామీణ ప్రాథమిక ఆ రోగ్య కేంద్రాలతో పాటు జిల్లా కేంద్ర హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ కు అనుబంధంగా 1460 మంది ఆశా వర్కర్లు ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంలో కీలక భూమిక పోషి స్తున్నారన్నారు. అతి తక్కువ వేత నాలు ఇస్తున్న భవిష్యత్తు మీద ఆశ తో అనేక ఇబ్బందులను కష్ట నష్టాల కోర్చి తమ వీధులను ఎంతో అంకి తభావంతో నిర్వహిస్తున్నారు.ఆశా డ్యూటీలకే పరిమితం కాకుండా ప్ర భుత్వం నిర్వహించే అనేక రకాల ప థకాలను ప్రజల దగ్గరికి చేర్చే పని లో కూడా ఉన్నారు. అనేక ప్రభుత్వ సర్వేలు కూడా చేస్తున్నారు. ఇంత కష్టపడి పని చేస్తున్న చేసిన పనికి ఇవ్వవలసిన డబ్బులు రావడం లే దు. లెప్రసీ సర్వే బిల్లులు 2022, 2 023,2024 సంవత్సరాల గాను సం వత్సరానికి రూ. 1050 చొప్పున ఒ క ఆశా కార్యకర్తకు రూ. 3150 రా వాలని అన్ని జిల్లాల్లో ఈ డబ్బులు ఎప్పుడో వచ్చిన మన నల్లగొండ జి ల్లాలో మాత్రం ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా అసెంబ్లీ, పార్లమెంటు ఎలక్షన్స్ లో పనిచేసిన ఆశలకు కూడా ఎక్కువ మందికి డబ్బులు రాలేదు. ఎన్నిసా ర్లు అడిగినా రకరకాల కారణాలతో దాటవేస్తున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా అధ్యక్ష కార్యదర్శి లు డి మ హేశ్వరి, టీ వెంకటమ్మలు మాట్లా డుతూ జిల్లాలో పల్లె దావకాన పే రుతో ఏర్పాటైన సెంటర్లలో డ్యూటీ ల పేరుతో ఆశలను వేధిస్తున్నారు. పల్లె దావకానలు ఊడ్చడం నీళ్లు పెట్టడం డాక్టరు ఏఎన్ఎం వచ్చే వర కు తాళం తీసి అక్కడే ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గం ట ల వరకు పని చేయించడం న్యాయ మా అని ప్రశ్నించారు. బిఎల్ ఓలు గా డ్యూటీలు తమకు సంబంధం లేకుండా వేస్తూ బెదిరించి ఆశలతో చేయిస్తున్నారని అన్నారు.బి ఎల్ ఓ డ్యూటీ లను వెంటనే ఆపాలని కోరారు. ఆశాలకు జాబ్ చార్ట్ లేక పోవడంతో వారికి సంబంధంలేని ప నులు కూడా చేయిస్తూ వేధిస్తున్నా రు. వినకపోతే బెదిరింపులకు దిగ డం జరుగుతుంది.ఏ ఎన్ సి టార్గె ట్స్ పెట్టి ఇబ్బందుల గురిచేస్తున్నా రు.సహజ సిద్ధమైన గర్భధారణను టార్గెట్లు పెట్టడంతో కేసులు దొరకక టార్గెట్లు పూర్తి కాలేదని ఆశాలు మ నోవేదనకు గురవుతున్నారు.
జిల్లా కేంద్రం మరియు ఏరియా ఆ సుపత్రిలో ఆశాలకు వెయిటింగ్ రూ మ్స్ ఇప్పించే విధంగా తగిన చర్య లు తీసుకోవాలి. టీబి స్పూటం డ బ్బాలు ఆశాలతో ముగించే పద్ధతిని వెంట నే ఆపాలని, నట్టల టాబ్లెట్లు పంచినందుకు ఇవ్వవలసిన పారి తోషకాలు గాని టీబి జబ్బు నయ మైన కేసులకు ఇవ్వవలసిన పారి తోషకాలు కూడా ఇవ్వడం లేదు. ఆ శాలకు తీవ్రమైన పని భారంతో అ నారోగ్యాలకు గురై ప్రాణాలు కోల్పో తున్న సందర్భాలు ఉన్నాయని ఆ వేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాద య్య, జిల్లా నా యకులు, అవుట రవీందర్, భీమగాని సిఐటియు నా యకురాలు అనురాధ ఆశ యూని యన్ జిల్లా నాయకులు ఆర్ కవి త, సైదమ్మ,స్వర్ణ, శైలు, ధనమ్మ, సుజాత,పద్మ, మంజుల, సౌజన్య, వెంకటమ్మ, విమల పుష్పలత, వజ్ర మ్మ జయమ్మ, సునీత, ఎండి అఫీ జా, పార్వతమ్మ, సిహెచ్ రోజా, వ సంత, భాగ్యమ్మ, నవనీత, సుమ లత తదితరులు పాల్గొన్నారు.


