Thursday, October 8, 2026
More
    HomePoliticsVBJ Ramji : వీబీజీరామ్ జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి

    VBJ Ramji : వీబీజీరామ్ జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి

    📰 Generate e-Paper Clip

    –ప్రజలకు ఉపాధి, పల్లెలకు పాల నాహక్కులు పునరుద్ధరించాలి

    — నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షు డు పున్న కైలాష్ నేత

    VBJ Ramji : ప్రజా దీవెన, నల్లగొండ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల ఉపాధి హ క్కును కాలరాస్తూ గ్రామ పంచాయ తీలకు రాజ్యాంగ బద్ధంగా లభించి న అధికారాలను నిర్వీర్యం చేసింద ని నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్య క్షు డు పున్న కైలాష్ నేత ఆరోపించా రు. మహాత్మా గాంధీ జాతీయ గ్రా మీణ ఉపాధి హామీ చట్టం (మన్ రే గ) స్థానంలో తీసుకొచ్చిన ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ర్ అండ్ అ జీవిక మిషన్ (గ్రామీణ) చట్టం (వీబీ జీ రామ్ జీ) గ్రామీణ ప్రజల జీవితా లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూ పుతోందన్నారు. శనివారం ఆయన నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో మాట్లాడారు.

    ఈ చట్టం ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రమాదకర మైన విధాన మార్పులను పూర్తిగా తిరస్కరిస్తున్నామని చెప్పారు.

    వీబీ జీ రామ్ జీ చట్టం ద్వారా అనే క మార్పులు తీసుకొచ్చారని ‘ఉపా ధి హక్కు’ పథకం వలన గతంలో ప్ర జలు సంవత్సరానికి 100 రోజుల పని హక్కు ఉండేదని, ఇప్పుడు వీ బీ జీ రామ్ జీ చట్టం వల్ల కేంద్ర ప్ర భుత్వం నోటిఫై చేసి బడ్జెట్ కేటా యిస్తేనే ప్రజలకు పని లభిస్తుంద న్నారు.

    గతంలో ఏ గ్రామీణ ప్రాంతంలోనైనా పని కోరే వీలుండేదని, ఇప్పుడు వీ బీ జీ రామ్ జీ చట్టం కింద కేంద్రం ఎంపిక చేసిన పంచాయతీల్లో మా త్రమే పని చేయాల్సి ఉంటుందని చెప్పారు. గతంలో ఏడాది పొడవు నా ఉపాధి కల్పించేవారని, ఇప్పు డు వ్యవసాయ సీజన్ లో 60 రో జుల పనులపై నిషేధం విధించారని విమర్శించారు.దీని వల్ల కూలీలకు పని అవకాశాలు తగ్గి తక్కువ వేత నాలకు పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు.

    ద్రవ్యోల్బణానికి వేతనాలను అను సంధానం చేయడంతో పని చేసిన వాటికి వేతనాలపై హామీ లేని పరి స్థితి కేంద్రం తీసుకొచ్చిన మార్పుల ద్వారా ఏర్పడిందని, గతంలో ఎ లాంటి నిబంధనలు లేకుండా వేత నాలు, పెంపు ముందస్తు గానే ప్రక టించినట్టు అందుబాటులో ఉండే వని, ఇప్పుడు కొత్త చట్టంతో పంచా యతీలకు నిర్ధారిత హామీలు లేవని కేంద్రం నిర్ణయించిన మేరకే వేత నా లు ఉంటాయని వివరించారు. ప్రస్తుతం పనులు ‘గ్రామసభ నిర్ణ యం’పై కాకుండా ‘ఢిల్లీ’ నిర్ణయం’పై ఆధార పడి ఉంటాయి. పాత చట్టం లో గ్రామసభలు, పంచాయతీలు ప నులు వాటికయ్యే ఖర్చులను నిర్ణ యించేవని, ఇకపై పనులను, ని ధు లను కేంద్ర ప్రభుత్వమే నిర్ణయి స్తుం దన్నారు.

    గతంలో పనులకు సంబంధించిన వే తనాలు 100 శాతం కేంద్రం నుండే వచ్చేవని, ఇప్పుడు కేంద్రం 60 శాత మే భరిస్తే మిగతా 40 శాతం భారం రాష్ట్రంపై పడుతోందని, ఈ నేప థ్యంలో రాష్ట్రాలపై ఆర్థికభారంతో నిధుల కొరత, నిధుల మంజూరు లో జాప్యం జరిగే అవకాశాలున్నా యని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో టిపిసిసి మేనిఫెస్టో కమిటీ మెంబర్ చామల శ్రీనివాస్,జిల్లా సీనియర్ నాయకు లు కన్నారావు, ఎండి ముంతాజ్ అలీ, చింతపల్లి వెంకటయ్య, గౌత మ్, పగిళ్ల శివ, పోలగొని వెంకట్ గౌ డ్, శ్రీనివాస్, సిహెచ్ శంకరయ్య, ర మేష్ బ్రహ్మదేవర,ముత్యాల ఆంజ నేయులు, మజీద్, నాగార్జున గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.