Brs Harish Rao: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన తొ లి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధి నేత కేసీఆర్ పై కడుపులో కత్తులు, నోటి లో విషం పె ట్టుకున్న ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తన అజీర్తిని, అక్కసు ను మరోసారి బయట పె ట్టుకున్నారని మాజీ మంత్రి, బిఆర్ ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిప డ్డా రు. సో మవారం జస్టిస్ సుదర్శన్ రెడ్డికి రా వి నారాయణ రెడ్డి జాతీయ అవా ర్డు ప్రథానోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఫై ర్ అయ్యారు. ఈ సందర్భం గా మా జీ మంత్రి హరీ శ్ రావు సీఎం రేవం త్ పై చేసిన ఘా టైన వ్యాఖ్యలు ఆ యన మాటల్లోనే…
జస్టిస్ సుదర్శన్ రెడ్డి హేట్ స్పీచ్‌పై హిత బోధ చేసిన కొద్ది నిమిషాలు కూడా గడవకముందే, అదే వేదిక పై రేవం త్ రెడ్డి తన అసలు స్వభా వాన్ని, తన మాటల ద్వారానే బ యటపెట్టుకున్నారు. హేట్ స్పీచ్‌పై ఉపన్యాసం ముగియక ముందే, రే వంత్ రెడ్డి హేట్ స్పీచ్‌కు లైవ్ డెమో ఇచ్చారు.
హేట్ స్పీచ్ అంటే ఏమిటో చెప్ప డానికి పుస్తకాలు అవసరం లేదు.. రేవంత్ రెడ్డి ప్రసంగాలు చాలు.అమెరికా వెళ్లి హార్వర్డ్ లో నాలుగు రోజులు చదువుకున్నా. రేవంత్ రె డ్డి తన వెన కటి గుణం మాత్రం మా ర్చుకోలేదు.కనీస సంస్కారం రాలే దు, చిల్లర మాటల్లో, వెకిలి చేతల్లో ఎలాంటి మార్పు రాలే దు.
ద్వేష రాజకీయాలకు, నరం లేని నాలుకతో విషం చిమ్మే కు సంస్కా రానికి నిలువెత్తు నిదర్శనం రేవంత్ రెడ్డి. దేశానికి గాంధీ జాతిపిత అ యినట్లే, తెలంగాణను సాధించిన కేసీ ఆర్ జాతి పితనే రేవంత్ రెడ్డి.నాలుగు కోట్ల ప్రజలు ఏకమై స్వ రాష్ట్రం కోసం కొట్లాడుతుంటే ఆం ధ్రా పాలకుల బూట్లు తుడుస్తున్న నీకు కేసీఆర్ గురించి, తెలంగాణ ఉద్యమం గురించి ఎలా తెలుస్తుం ది.
ఉద్యమకారులపైకి తుపాకి ఎక్కు పెట్టిన నీకు ఉద్యమకా రుల గురిం చి మాట్లాడే హక్కు ఉందా రేవంత్ రెడ్డి. ప్రశ్నిస్తే, నిలదీస్తే అరెస్టులు, కే సులతో నిరంకుశంగా వ్యవహరి స్తు న్న నీకు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడే హక్కు ఉందా రేవంత్ రెడ్డి. అధికారాన్ని ప్రజల బాగు కోసం కాకుం డా, ప్రతిపక్షాల పై రాజకీయ కక్షల కోసం వినియో గిస్తున్న నీకు అధికార దుర్విని యోగం గురించి మాట్లాడే హక్కు ఉందా రేవంత్ రెడ్డి.
లక్కీ లాటరీలో ముఖ్యమంత్రి అయిన నీకు ఇవన్నీ ఎలా తె లుస్తాయి, ఎలా అర్థం అవుతాయి రేవం త్ రెడ్డి. నువ్వు అ మెరికా లోని హా ర్వర్డ్ వెళ్ళినా, అంతరిక్షం వెళ్ళినా నీ చెత్త బుద్ధి మారదు, నోటి ము రికి పోదు అన్నది సుస్పష్టమని హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
