Nalgonda police operation smile : ప్రజా దీవెన, నల్ల గొండ: పలకా బ లపం పట్టి బడిబాట పట్టా ల్సిన బా లలను వెట్టిచాకిరీతోనే బంధీ అయిపోతున్న పసి బాల్యాన్ని నల్ల గొండ జిల్లా పోలీసు తమ చేతుల తో ఒడిసి పట్టుకుని వా రిని విముక్తి కల్పించారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకం గా 118 మంది పసిపి ల్లల భవితవ్యం అంధకారంలో ముని గిపోకుండా చర్యలు చేపట్టింది నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ.
కేంద్ర హోంశాఖ ఆదేశాల ప్రకారం రాష్ట్ర పోలీస్ శాఖ నేతృ త్వంలో ప్రతీ ఆరు నెలలకొసారి ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ పేరు తో బాలకార్మికులు, వీధిబాలలను, ఇటుకబ ట్టీలో నిర్బంధ కార్మికులు గా ఉన్నవారిని, ముష్టి మాఫియా చేతుల్లో బందీలుగా ఉన్నవారిని, ఇండస్ట్రియల్ కంపెనీల్లో పని చేసే వారిని కాపాడేందుకు ఈ కార్యక్ర మాలను చేప డు తున్న సంగతి అందరికీ తెలిసిందే.
నల్లగొండ జిల్లా పరిధిలోని మూడు సబ్ డివిజన్లలో జిల్లా ఎ స్పీ నేతృ త్వంలో అడిషనల్ ఎస్పీ రమేష్, పోలీస్ శాఖ ఏ. హెచ్.టి.యు,చైల్డ్ వెల్ఫేర్ కమిటీ,లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యు కేషన్ డిపార్ట్మెంట్ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, వివిధ డిపా ర్ట్మెంటు అధికారుల సమన్వయం తో టీమ్ లుగా ఏ ర్పడి ఒక్క జనవ రి నెలలోనే 92 కేసుల్లో 118 మంది పిల్ల లను రెస్యూ చేయడం వీరిలో 105 మంది బాలలు 13 మం ది బాలికలు వీరంతా ఎక్కువగా ఇత ర రాష్ట్రాలు బీహార్, చత్తీస్ ఘడ్ ఒరిస్సా, యూపీ, ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు కావడం గమనార్హం.
బాల కార్మికులకు చేత పనిపై కఠిన చర్యలు…. జిల్లాలో బాల ల హక్కులను కాపాడాల్సిన బాధ్య త మనందరిపైనా ఉన్నదని,బాల కార్మిక వ్యవస్థ నిర్ములన కోసం బాధ్యతా యుతంగా కృషి చేయాలని నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర ప వార్ అన్నారు. బాల కార్మికులకు చేత ప నులు చేయిస్తున్న వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేయడం జరుగు తుందన్నారు.
వీధి బాలలను, బాల కార్మికులను చూసిన ప్పుడు, డయల్- 100 లేదా 1098 లేదా స్థానిక పోలీస్ వారికి సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. ఈ ఆపరేషన్ స్మైల్ లో భాగంగా నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా బాలకార్మి కులు రెస్క్యూ చేసి కాపాడిన ఏ.హెచ్.టి. యుసి బ్బంది, సం బంధిత అధికారులను జిల్లా ఎస్పీ అభినందించి రివార్డ్ ప్రక టించారు.
