Wednesday, October 7, 2026
More
    HomeOpinionDistrict Collector Chandrashekhar : నల్లగొండజిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆకాంక్ష, గ్రామీణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి...

    District Collector Chandrashekhar : నల్లగొండజిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆకాంక్ష, గ్రామీణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి 

    📰 Generate e-Paper Clip

    District Collector Chandrashekhar : ప్రజా దీవెన, న ల్లగొండ: గ్రామీణ ప్రాంతంలోని క్రీడా ప్రతిభను గుర్తించి వెలికి తీయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అ న్నారు. ఆదివారం ఆయన నల్లగొండ జిల్లా కేంద్రంలోని మేక ల అభినవ్ స్టేడియంలో సీఎం కప్ క్రీడా పోటీలను ప్రారంభిం చారు.

    అనంతరం మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుంచే క్రీడాకారు ల ప్రతిభ ను గుర్తించి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నుంచి ఇంటర్నేషనల్ స్థాయి వరకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంద న్నారు. గ్రామాల్లో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ సరైన వేదికలే మి కారణంగా క్రీడాకారులు ముందుకు రాలేకపోతున్నారని, సీఎం క ప్ వంటి కార్యక్రమాలు ఆ ప్రతిభకు మెరుగైన అవ కాశాలు కల్పిస్తాయని అన్నారు.

    ప్రతి క్రీడాకారుడు క్రమశిక్షణ, పట్టుదలతో సాధన చేస్తే జాతీ య, అంతర్జాతీయ వేదికలపై జిల్లా పేరు ప్రఖ్యాతులు తీసు కురావచ్చు. ప్రభుత్వం క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, శిక్షణ, ప్రోత్సాహకాలు అందించేందుకు కట్టుబడి ఉందన్నారు.ఈ క్రీడా పోటీల ద్వారా యువతలో జట్టు భావన, నాయకత్వ లక్షణాలు, ఆరోగ్యకరమైన జీవన శైలి పెంపొందుతాయని కలెక్టర్ వివరించారు.

    విజేతలు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించి మరింత ఉ న్నత స్థాయికి చేరాలని. నల్గొండ జిల్లాకు రాష్ట్రస్థాయిలో మె డల్ తీసుకురావాలని ఆకాంక్షించారు.వివిధ కోచ్ లు సె క్రట రీలతో మాట్లాడిన కలెక్టర్

    విద్యార్థులకు మెరుగైన క్రీడశిక్షణ కోసం అన్ని సదుపాయా లు కల్పిస్తామన్నారు.సీఎం క్రీడా కప్ పోటీ లలో భాగంగా హాకీ ,బేస్ బాల్, తై క్వాండో, సైకిలింగ్ ,క్యారం, షూటిం గ్ ,సీలింగ్, రోయింగ్, సెన్సింగ్ వం టి పోటీలను నిర్వహి స్తు న్నారు.ఈ కార్యక్రమం లో జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి అక్బర్ అ లీ, నల్గొండ తహసిల్దార్ పరుశు రాం, క్రీడల కోచ్ లు, క్రీడాకారులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.