Intermediate Public Examinations : ప్రజా దీవెన, న ల్లగొండ: నల్లగొండ జిల్లావ్యాప్తంగా బుధవారం నుండి ప్రారం భమైన ఇంటర్మీడియట్ ప బ్లిక్ పరీక్షల పరీక్ష కేంద్రాలను జి ల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వి ద్యార్థుల హాజరు పరీక్ష కేంద్రాలలో సౌకర్యాలు, తదితర అం శాలపై జిల్లా ఇంటర్మీడియ ట్ విద్యాశాఖ అధికారి దశ్రునా య క్ ను అడిగి తెలుసుకున్నారు. న ల్లగొండ జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చే సిన పరీక్ష కేంద్రాన్ని కలెక్ట ర్ సందర్శించి పరీక్షలు రాస్తున్న వి ద్యార్థులను పరిశీలించారు. విద్యార్థుల హాజరు, టాయిలె ట్స్, తాగు నీరు, క్లాక్ రూమ్, ప్రశ్నపత్రాలు, ఆన్సర్ షీట్ల డిపా జిట్, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులు వారి వెంట తీసుకువ చ్చిన పుస్తకాలు, మొబైల్ ఫోన్లు, వాచ్ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులన్నింటిని భద్రపర చుకునేందుకు ప్రతి పరీక్ష కేంద్రం వద్ద తప్పనిసరిగా క్లాక్ రూ మ్ ఏర్పాటు చేయాలని పునరుద్గటించారు. అలాగే అన్ని పరీక్ష కేంద్రాలలో తాగునీటితో పా టు, విద్యార్థులకు టా యి లెట్ సౌకర్యం కల్పించాలన్నారు. పోలీస్ స్టేషన్లో నుంచి క్వ శ్చన్ పేపర్లను జా గ్రత్తగా బందోబస్తుతోపాటు తీసుకు రావా లని, అలాగే ఆన్సర్ సీట్లు సై తం పోలీస్ భద్రతతో డిపాజిట్ చే యాలని చెప్పారు.
ఇంటర్ పరీక్షల సందర్భంగా జిల్లా లో ఎక్కడ మాల్ ప్రాక్టీస్ జరగడా నికి వీలులేదని, అంతేకాక విద్యా ర్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉం డకూడదన్నారు. పరీక్షలకు సంబం ధించి ఏవైనా సమస్యలు ఉంటే జి ల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పా టు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 18004 251442 నంబర్ కు ఫోన్ చేసి తె లియజేయవచ్చని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. కాగా బుధవారం నుండి ప్రారంభమైన ఇంటర్మీడి య ట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 18 వరకు జరగనున్నాయి.
ప్రతిరోజు ఉద యం 9 గంటల నుం డి మధ్యాహ్నం 12 గం టల వరకు ఇంటర్ పరీక్షలను నిర్వహించనుండగా, జిల్లా నుండి మొదటి, రెండ వ సంవత్సరం జనరల్, ఒకేషనల్ క లుపుకొని 27018 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవు తున్నారు. మొదటి రోజు పరీక్షకు జిల్లా వ్యాప్తంగా అన్ని కేం ద్రాల్లో కలుపు కొని 97% హాజరు నమోదయినట్లు జిల్లా ఇం టర్మీడియట్ విద్యా శాఖ అధికారి తెలిపారు.
ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్
నల్లగొండ జిల్లాలో ఫిబ్రవరి 25 నుం డి మార్చి 18, 2026 వరకు నిర్వ హించనున్న ఇంటర్మీడియట్ వార్షి క పరీక్షలను ప్రశాంత వాతావరణం లో నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపా రు.బుధవారం పట్టణ కేంద్రంలోని ప్రగతి కళాశాలలో ఏర్పాటు చేసి న పరీక్ష కేంద్రాన్ని జిల్లా ఎస్పీ ఆకస్మికంగా సం దర్శించి, పరీక్షల నిర్వ హణ, భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమె రా ల పనితీరు, పోలీస్ సిబ్బంది డ్యూటీలను స్వయంగా పరిశీ లించారు. పరీక్షల పారదర్శకతకు ఎ లాంటి భంగం కలగ కుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికా రులకు సూచించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ పరీక్ష కేంద్రాల వద్ద భా రతీయ న్యాయసంహిత (BNS) సెక్షన్ 16 3(144 సెక్షన్) అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్రాల పరిసర ప్రాంతాల్లో గుంపులుగా తిరగడం పూర్తిగా నిషేధమని హె చ్చరించారు. పరీక్షలు పూర్తి అయ్యేంత వర కు కేంద్రాల పరి ధిలో జిరాక్స్ సెం టర్లు, ఇంటర్నెట్ సెంటర్లు, ఇతర అనధి కార కార్యకలాపాలు నిర్వ హించరాదని ఆదేశించారు. పరీక్ష సమయాల్లో సంబంధిత సెంటర్లను మూసివేయించేలా చ ర్యలు తీసుకోవాలని పోలీస్ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.
పరీక్ష కేంద్రాల్లో సెల్ఫోన్లు, స్మార్ట్ వా చ్లు, బ్లూటూత్ పరి కరాలు తది తర ఎలక్ట్రానిక్ వస్తువులు పూర్తి గా నిషేధమ ని పేర్కొన్నారు. విద్యా ర్థులు నిబంధనలు కచ్చితంగా పా టించి, ప్రశాంతంగా పరీక్షలు రా యాలని సూచించారు. ఎ లాంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గ మనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పరీక్షల కాలమంతా ప్రతి కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు, మొబైల్ పై ట్రోలింగ్, ప్రత్యేక నిఘా బృందాల ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలు ఎలాంటి అవాంఛనీయ సం ఘటనలు లేకుండా విజయవం తంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా పనిచేస్తుందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.



