Big Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: సాంకేతి క రంగంలో డిజిటల్ తెలంగాణ కొ త్త దశలోకి అడుగుపెడుతున్న వేళ రాష్ట్ర పరిపాలనలో అతి పెద్ద మా ర్పు చోటుచేసుకుంది. భవిష్యత్ స వాళ్లను ఎదుర్కొనేందుకు తెలంగా ణ ప్రభుత్వం ( Telangana Gov t) ఒకేసారి 45 మంది ఐఏఎస్ అ ధికారులను రీషఫుల్ చేస్తూ సంచ లన నిర్ణయం తీసుకుంది.రాష్ట్ర అ భివృద్ధిని వేగవంతం చేయడానికి కలెక్టర్ల స్థాయిలో విప్లవాత్మక మా ర్పులు చోటు చేసుకొన్నాయి. జిల్లా ల అభివృద్ధి, డిజిటల్ గవర్నెన్స్, వి పత్తు నిర్వహణ వంటి కీలక రం గా ల్లో నూతన దృష్టితో అధికారుల బ దిలీలు, నియామకాలు జరిగాయి.
తాజాగా ప్రభుత్వం జరిపిన బదిలీ లు, నియామకాల్లో భాగంగా మహబూబాబాద్‌కు స్నేహ శబరీ ష్, రాజన్న సిరిసిల్లకు గరిమా అ గర్వాల్, మెదక్‌కు ప్రతిమ సింగ్, భద్రాద్రి కొత్తగూడెంకు అనికేత్,హనుమకొండకు చాహత్ బజ్పా యి, మహబూబ్‌నగర్‌కు ఖుష్బూ గుప్తా, యాదాద్రికి అనురాగ్ జ యంతి, నారాయణపేట్‌కు ప్రదీప్ జైన్ , జనగాం జిల్లాకు సందీప్ కు మార్ ఝా నియమితులయ్యారు. ప్రతి నియామకంలో యువశక్తి, సాంకేతిక పరిజ్ఞానం, ప్రజాసేవ పట్ల నిబద్ధత ప్రధానంగా పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
*కీలక శాఖల్లో వ్యూహాత్మక మార్పులు…* పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా సంజ య్ కుమార్, విపత్తు నిర్వహణ, రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్ర టరీ గా దాన కిషోర్,ఇరిగేషన్ శాఖ ప్రి న్సిపల్ సెక్రటరీగా శ్రీధర్, ఫైనాన్స్ శాఖ సెక్రటరీగా గౌరవ్ ఉప్పల్,ఐటీ & పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రట రీగా ఎన్. శ్రీధర్, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా రాహుల్ బొజ్జా (బీసీ సంక్షేమ శాఖకు అదనపు బాధ్యత లు), ఎండోమెంట్స్ కమిషనర్‌గా హనుమంతరావుకు బాధ్యతలు అ ప్పగించడంతో ఆలయ పరిపాలన లో పారదర్శకతకు నూతన రూపం రానుంది.
*విద్యుత్ రంగంలో డిజిటల్ దిశ*
రాష్ట్ర విద్యుత్ రంగానికి సరికొత్త దిశగా TSGPDCLకు ముష్రఫ్ అలీ ఫారూఖీ సీఎండీగా నియమితుల య్యారు. జితేష్ వి. పాటిల్ సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా బా ధ్యతలు స్వీకరించారు. స్మార్ట్ గ్రిడ్, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు వేగం పెరగ నందని అభిప్రాయం వ్యక్తం అవు తోంది.
*కీలక బదిలీలు, నూతన బా ధ్యతలు* బదిలీల్లో భాగంగా బి. విజయేంద్ర సోషల్ వెల్ఫేర్ శాఖ కార్యదర్శిగా, అద్వైత్ కుమార్ సిం గ్ ఢిల్లీ తెలంగాణ భవన్ సమన్వ య శాఖకు, సిక్తా పట్నాయక్ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పమేలా సత్పతి లేబర్ కమిషనర్‌గా నియ మితులయ్యారు. ఈ భారీ బదిలీ లు కేవలం పోస్టుల మార్పులు మా త్రమే కావని, ఇవి “విజన్ 2040 తె లంగాణ”కు బలమైన అడుగులు కాబోతున్నాయని అధికారిక వర్గా లు వెల్లడిస్తున్నాయి.
డిజిటల్ పరిపాలన, పారదర్శక వి ధానాలు, ప్రజాకేంద్రీకృత పాలన ల క్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త టీమ్ తో ముందుకు సాగుతోంది. తెలం గాణ పరిపాలనలో ఈ మార్పులు భవిష్యత్తులో అభివృద్ధి వేగాన్ని మరింత పెంచనున్నాయని విశ్లేష కులు అభిప్రాయపడుతున్నారు.
