Wednesday, October 7, 2026
More
    HomeAndhrapradeshKurnool Family Suicide : కర్నూల్ జిల్లా లో తీవ్ర విషాదం, ప సిబిడ్డలతో కన్నతల్లి...

    Kurnool Family Suicide : కర్నూల్ జిల్లా లో తీవ్ర విషాదం, ప సిబిడ్డలతో కన్నతల్లి ఆత్మార్పణం 

    📰 Generate e-Paper Clip

    Kurnool Family Suicide  : ప్రజా దీవెన కర్నూల్: ఆంధ్ర ప్రదేశ్ కర్నూలు జిల్లా కేంద్రం సమీపంలో శనివారం విషాద ఘటన వెలుగు చూసింది. జిల్లాలో హృదయ విదారక ఘ టన చోటుచేసుకుంది, కన్న పిల్లలను కాపాడాల్సిన తల్లే వా రితో కలిసి ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.జిల్లా కేంద్రానికి సమీపంలోని గార్గే యపురం గ్రామం వద్ద ఉన్న చెరు వులో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

    సంఘటనలో మృతులను రాజేశ్వ రి (35), ఆమె కుమారు లు సుకుమార్ (6), అబ్రహం (3)గా పోలీసులు గుర్తించారు. శనివారం ఉదయం గ్రామస్థులు చెరువులో తేలుతున్న మృ తదేహాలను గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాలను బయటకు తీశా రు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభు త్వ ఆసుపత్రికి తరలించారు.

    ప్రాథమిక సమాచారం ప్రకారం కు టుంబ కలహాల కారణం గా తీవ్ర మనస్తాపానికి గురైన రాజేశ్వరి ఈ దారుణ నిర్ణ యం తీసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తు న్నా రు. అయితే ఘటనకు సంబం ధించిన పూర్తి వివరాలు ఇం కా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యా ప్తు ప్రారంభించారు.ఈ ఘటనతో గార్గేయపురం గ్రామంలో విషాద ఛాయలు కమ్ముకు న్నాయి. చిన్నారుల మృతి స్థాని కులను తీవ్రంగా కలిచివేసింది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.