Thursday, October 8, 2026
More
    HomeOpinionMinister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి సం చలన వ్యాఖ్య,...

    Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి సం చలన వ్యాఖ్య, రానున్న రోజుల్లో హయత్ నగర్ మరో కోకాపేటా కా నుంది

    📰 Generate e-Paper Clip

     

    Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ హయత్ నగర్ సాయిబాబా టెం పుల్ (తొర్రూర్ x రోడ్) నుండి ZEE స్కూల్ వరకు సుమారు రూ. 10కోట్ల అంచనా వ్యయంతో 2లేన్ నుండి 4లేన్ రహ దారిగా అభివృద్ది చేస్తున్న పనులకు శనివారం రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శా ఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భం గా మంత్రి కోమటి రె డ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే… పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా,ప్రజా అ వసరాల మేరకు పలు రోడ్ల అ భి వృద్ధికి శ్రీకారం చుట్టాం. ఇ వాళ హయత్ నగర్ సాయిబాబా ఆలయం నుండి ZEE స్కూల్ వరకు 4లేన్ రోడ్ గా అభి వృద్ధి పనులకు 10 కో ట్ల తో శంకు స్థాపన చేసుకున్నాం. సోమవారం నుండి పనులు మొదలవుతాయి.

    ఈ ప్రాంతంలో విద్యా,ఇతర పనుల నిమిత్తం ఎక్కువ గ్రామీ ణ ప్రాంతం నుండి వచ్చి స్థిరపడ్డ వారు ఎక్కువ ఉంటారు. గతంలో హైద రాబాద్ ఎల్బీనగర్ నుండి మల్కా పూర్ రోడ్డు కోసం కృషి చేశాను. కేంద్రమంత్రి గడ్కరీ స్వయంగా కోమ టి రెడ్డి కృషి వల్లే అని ఆఅంశాన్ని ప్రస్తావించారు. ఎల్బీనగర్ నుండి హయత్ నగర్ రేడియో స్టేషన్ వరకు డబుల్ డెక్కర్ నిర్మాణం రా బోతుంది. నాగపూర్ 8కిలోమీటర్లు తర్వాత అతిపెద్దది మన ప్రాంతం లో 6కి.మీ నిర్మిస్తున్నాం.

    సుమారు 940 కోట్లతో నిర్మిస్తున్న ఈ డబుల్ డెక్కర్ కారిడా ర్ లో రాష్ట్ర ప్రభుత్వం వాటా 200కోట్లు చె ల్లించేందుకు ఇ ప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. త్వరలో దీనికి సంబం ధించిన మీటింగ్స్ ఉన్నా యి.ఈ డబుల్ డెక్కర్ కారిడార్ లో పైన మెట్రో రైలు,నేషనల్ హైవే, కింద స్థానికులు వాహ నాలు క్రాస్ చే సేందుకు యాక్సిడెంట్స్ కు ఆస్కారం లేకుం డా వెహికిల్ అండర్ పాస్ లు ఏర్పాటు చేస్తున్నాం..

       ఈ ప్రాంత ప్రజలకు మరో శుభవార్త

    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రాంతం నుం డే మూడు హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్లు రాబోతు న్నా యి.ప్రత్యామ్నాయ సిటీగా ఫ్యూచర్ సిటీనీ నిర్మిస్తున్నాం, ఇక్కడ నుండే చెన్నై,బెంగ ళూరు, ముంబై పూణెను కలుపు తూ హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్,హైవే కారిడార్లు రాబోతున్నాయి. హయత్ నగర్,ఇబ్రహీం పట్నం, ఎల్బీనగర్, హైదరాబాద్ -విజయవాడ ర హదారి ప్రాంత వాసులకు వారికి కో కాపేట లాంటి డిమాండ్ రాబోతుంది.

    నేను ప్రతి రోజు హైదరాబాద్ – విజయవాడ 10లేన్ల జా తీ య రహదారి విస్తరణపై సంప్రదింపులు, సమీక్షలు జరుపు తున్న కేంద్రం నుండి అన్ని రకాల అనుమతులు రావడం కోసం కాస్త ఆలస్యం అయింది. వచ్చే నెలలో టెండర్లు పూ ర్తి చేసి రహదారి విస్తరణ పనులు చేపట్టేలా ప్రణాళిక రూ పొం దించాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అ నుమతి తీసుకొని అ సెంబ్లీ సమా వేశాలు జరుగుతున్న సందర్భంలో కూడా నేను స్వయంగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ర హదారి పనులు వేగవంతం చే యాలని విజ్ఞప్తి చేస్తా.

    రైల్వే స్టేషన్ కలుపుతూ వేసే మరో రోడ్డు 8కోట్ల పనులకు త్వరలో శం కుస్థాపన చేస్తాం. మూసీ నది ప్ర జెంటేషన్ పై మీడియా అడిగిన ప్ర శ్నకు మంత్రి కోమటి రెడ్డి సమాధా నం ఇస్తూ మూసీ విషజలాలతో బాధపడుతున్న 40లక్షల మం ది బాధితుల గోస చూడండి. మా న ల్లగొండ ప్రజల ఆరోగ్యం గురించి మానవత్వంతో ఆలోచించండి. 30 ఏళ్లకే 60ఏళ్ల మనుషుల లాగా మా రిపోతున్నారు..కిడ్నీ,క్యాన్సర్ లాం టి భయంకర వ్యాధులతో సతమ తం అవుతున్నారు. నల్లగొం డ అంటేనే ఫ్లోరైడ్ జిల్లా, విషపు జలాల జిల్లా అని పేరుంది. ఇక్కడి ప్రజల గోసను మానవత్వంతో అర్థం చేసు కోవాలని కోరుతున్న.

    మూసి పునరుజ్జీవనం చేయాలని ఆలోచించిన ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డినిర్ణయం భవిష్యత్ తరాలకు మేలు చేస్తుంది. దాదాపు మూడు గంటల ప్రజెంటేషన్ చూసాం.మా నల్లగొం డ ప్రజల కష్టాలు ఎలా తొ లగుతాయి అనేది కళ్లకు కట్టిన ట్లు చూసాం.గంగా నదిని,యమునా నదిని శుభ్రం చేస్తున్నా రు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నా యకులు ఇది గ మనించాలి. మురి కి కూపంలా ఉన్న మూసిలో మంచి నీటి ని పారేలా చేస్తామంటే అ డ్డు కోవడం దేనికి.

    10 వేల మంది ఇళ్లు కోల్పోతున్నారు. వారికి ప్రత్యామ్నా య ఏర్పాట్లు తప్పకుండా చూస్తాం. ప్రజల ఆ రోగ్యం కోసం చేస్తున్న మంచి పనిని ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్న.అభివృద్ది,ప్రజా సం క్షేమమే మా ప్రధాన ఎ జెండా.మళ్ళీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎవరెన్ని రాజకీ య విమర్శలు చేసినా ప్రజల ఆరోగ్యం కోసం ఆలోచిస్తున్న ప్రభుత్వమే కావాలని కోరుకుం టారు. ప్రజల ఆరోగ్యం మా కు ప్రధానం దానికి కట్టుబడి ఉన్నామని కోమటిరెడ్డి వెంకట రెడ్డి స్పష్టం చేశారు.

    ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛై ర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మా జీ ఎంపీ మధు యాష్కి గౌడ్, గడ్డిఅన్నారం మార్కెట్ ఛైర్మన్ చిలుక మధుసూదన్ రె డ్డి, ఆదిభట్ల మున్సిపల్ మాజీ చై ర్మ న్ మర్రి నిరంజన్ రెడ్డి,ఆర్ అండ్ బి ఈఎన్సి మోహన్ నా యక్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముద్దగోని రామ్మోహన్ గౌడ్, జక్కిడి ప్రభాకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు రాజశేఖర్ రె డ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, మా ర్కెట్ కమిటీ డైరెక్టర్లు పన్యాల జై పాల్ రెడ్డి, నేలపాటి రామారావు, మెగావత్ గణేష్ నాయక్, నాయ కులు గుర్రం శ్రీనివాస్ రెడ్డి, గజ్జి భా స్కర్ యాదవ్, కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు,పలువురు నాయకులు, ప్రజా ప్రతినిధులు,ఆర్ అండ్ బి అధికారులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.