Nalgonda Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా కమర్షి యల్ ఎల్పీజీ గ్యాస్ స్టాక్స్ తగ్గిన ప్పటికీ జిల్లాలో డొమెస్టిక్ గ్యాస్ స రఫరాకు ఏలాంటి కొరత లేదని జి ల్లా కలెక్టర్ బి.చంద్ర శే ఖర్ స్పష్టం చేశారు.గ్యాస్ సరఫరాలేదన్న సాకుతో జిల్లా లో ని హాస్టల్లు, కేజీబీవీ లు, రెసిడెన్షియల్ పాఠశాలల వి ద్యార్థు ల భోజనానికి ఎలాంటి ఇ బ్బంది రాకుండా చూడాలని ప్రి న్సిపాళ్లను,సంక్షేమ శాఖల అధికారులను ఆయన ఆదేశిం చారు.యుద్ధం కారణంగా ఏర్పడిన ఎ ల్పీజీ గ్యాస్ సరఫరా కొరత నేప థ్యంలో గ్యాస్ సక్రమ సరఫరా, పర్యవేక్షణ విష యమై ప్రభుత్వం “జిల్లా స్థాయి ఇంధన సరఫరా పర్యవేక్షణ కమిటీ” ని ఏర్పాటు చేసిందని కలెక్టర్ వెల్లడించారు.
ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ చైర్మన్ గా, పౌరసరఫరాల జిల్లా అధికారి కన్వీనర్ గా,పోలీస్ సూపరింటిం డెంట్, రెవెన్యూ అదనపు కలెక్టర్, ఓఎంసీ రీజనల్ మేనేజర్, ట్రాన్స్పో ర్ట్ అధికారి, జిల్లా వ్యవసాయ అధి కారి, జిల్లా పౌరసంబంధాల అధి కారి, వైద్య ఆరోగ్యశాఖ అధికారి, అన్ని సంక్షేమ శాఖల జిల్లా అధికా రులు, ఎల్పిజి గ్యాస్ సరఫరా ఏజె న్సీల ప్రతినిధులు ఇందులో సభ్యు లుగా ఉంటారని తెలిపారు.
శనివారం జిల్లా కలెక్టర్ కార్యాల యంలోని సమావేశ మంది రంలో నిర్వహించిన “జిల్లా స్థాయి ఇంధన సరఫరా పర్యవే క్షణ కమిటీ” సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా కమర్షియల్ ఎల్పిజి గ్యాస్ సరఫ రాలో తేడా రావడం జరిగిందని, యుద్ధము మొదలైన ప్ప టినుండి గ్యాస్ సరఫరా కొద్దిగా తగ్గినప్పటికీ గడి చిన నా లుగు రోజుల నుండి మాత్ర మే జిల్లాలో సమస్య వచ్చిందని తె లిపారు. అయితే డొమెస్టిక్ గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేద ని, కమర్షియల్ స్టాక్స్ మాత్రమే తగ్గాయని స్ప ష్టం చేశారు. గతంలో సిలిండర్ సరఫరాకు 21 రోజుల స మ యం ఉండగా, ప్రస్తుతం గ్యాస్ ఏజెన్సీలు దానిని 45 రోజు లకు మార్చడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులతో మాట్లాడు తూ ప్రతిరోజు జిల్లాలో సరఫరా అవుతున్న ఎల్పి జి గ్యాస్ , ప్రస్తుత స్టాక్ వివరాలు, ప్రత్యేకించి శనివారం నా టి గ్యాస్ సరఫరా వివరాలను అడిగి తెలుసుకున్నారు. అ లాగే కేజీబీవీలు, రెసిడెన్షియల్ పాఠశా లలు, మోడల్ స్కూ ళ్లు, మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలు, హా స్ట ళ్లలో గ్యాస్ సరఫరా వివరాలను, ప్రతిరోజు వాడే వివరాలను ప్రిన్సి పా ల్స్ ద్వారా అడిగి తెలుసుకు న్నారు.
గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు మాట్లా డుతూ యుద్ధం కారణం గా కమర్షి యల్ గ్యాస్ సరఫరా కొద్దిగా తగ్గిందని,అయితే ఆందోళనతో బుకింగ్స్ ఎక్కువగా పెరిగాయని తెలిపారు. అ నంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డొమెస్టిక్ ఎల్ పిజి గ్యా స్ సరఫరా లో ఎలాంటి తేడాలు లేనందున డొమెస్టిక్ ఎల్పి జి గ్యాస్ సరఫరా ఎట్టి పరిస్థితులలో ఆగకూడదని చెప్పా రు. గ్యాస్ ఏజెన్సీలు ఎప్పటిలాగే డెలివరీ చేయాలని, ఎ క్క డ డెలివరీ ఆపకూడదని, ప్రతి రోజు గ్యాస్ డెలివరీ ఉండా లని, ఏ రోజు కా రోజు డెలివరీ చేసేలా చర్యలు తీసుకోవా ల ని చెప్పారు.
జిల్లాలో ఎల్ పి జి గ్యాస్ ను బ్లాక్ చేయడం, లేదా డొమెస్టిక్ సిలిండర్ లను కమర్షియల్ కు వాడడం వం టివి చేస్తే కఠిన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. జిల్లాలో ఇప్పటి వరకు డొమెస్టిక్ సిలిండర్ల ను కమర్షియల్ కు వినియోగించి నందుకుగాను 22 మందిపై కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్ల డించారు. ఈ డ్రైవ్ నిరంతరం కొనసాగుతుందని ఆ యన చెప్పారు. ప్రజలు అనవసరంగా గ్యాస్ బుక్ చేసుకో వద్దని, అవసరం ఉం టేనే బుక్ చేసుకోవాలని, అలాగే హాస్ట ళ్లు, పాఠశాలల ప్రిన్సిపాల్స్ సైతం ఆందోళనలకు గురై నెలరో జులకు సరిపడా గ్యాస్ ముందే బుక్ చేయవద్దని, వారానికి సరిప డా గ్యాస్ ను మాత్రమే బుక్ చే యాలని,వారం తర్వా త తిరిగి బుక్ చేసుకోవాలని చెప్పారు.
గ్యాస్ ఏజెన్సీలు సీనియార్టీ ప్రకా రం గ్యాస్ సరఫరా చేయా లని, ఏ జెన్సీలు రూపొందించిన ఇండెంట్ ఫార్మేట్ ను ప్రిన్సి పల్స్ సంతకం చే సి సంబంధిత ఏజెన్సీకి పంపిస్తే వెం టనే గ్యాస్ సరఫరా చేస్తారని స్ప ష్టం చేశారు. ఏజెన్సీలు ప్రతిరో జు గ్యాస్ డెలివరీ అయ్యేలా చూడా లని,ఎక్కడ డెలివరీ ఆపకూడదని, అలాగే నో స్టాక్స్ ఉండరాదని, ఏ రోజు డెలివ రీ అదే రోజు చే యా ల్సిన అవసరం ఉందన్నారు. ఎక్క డై నా బ్లాక్ మార్కెటింగ్ చేయడం, డెలివరీ బాయ్స్ ఎక్కువ డబ్బులు తీసుకోవడం చేస్తే కఠిన చర్యలు తీ సుకుంటామ నే విషయాన్ని క్షేత్ర స్థాయి సిబ్బందికి సైతం తెలియ జేయా లని చెప్పారు. అలాగే జిల్లా దాటి ఇతర ప్రాంతానికి గ్యాస్ వెళ్ల కుండా కట్టుబద్ధమైన చర్యలు తీ సుకోవాలని, ఎక్కడై నా అక్రమంగా గ్యాస్ సరఫరా చేస్తున్నా, గ్యాస్ కలిగి ఉన్న సీజ్ చేయాలని, ప్రతి విద్యా సంస్థ,ఆసుపత్రులు ప్రతిరో జు గ్యాస్ పరిస్థితిపై సమీక్షించాల న్నారు.
ఈ సందర్భంగా కమర్షియల్ గ్యాస్ సరఫరా అవుతున్న జి ల్లాలోని అ న్ని హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశా లలకు గ్యాస్ సరఫరాలో ఇబ్బం దులు తలెత్తకుండా అవసరమైతే కమర్షి యల్ స్థానంలో డొమెస్టిక్ సి లిండర్లను ఏర్పాటు చేసే విధం గా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిం చేందుకు జిల్లా స్థా యి కమిటీ తీ ర్మానం చేసింది. ఏఎస్ పి రమేష్, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ రాం పతి, జిల్లాస్థాయి కమిటీ సభ్యులు, కేజీబీవీ, మహాత్మ జ్యోతిబాపూలే, మోడల్ స్కూల్స్ ప్రిన్సి పాళ్లు, సంక్షే మ హాస్టళ్ల ఆర్సివోలు, వైద్య ఆరో గ్య శాఖ అధి కారులు ఈ సమావే శానికి హాజరయ్యారు.

