Telangana Thalli Statue : ప్రజా దీవెన, హైదరాబా ద్: భవిష్యత్తులో ఒక చారిత్రాత్మక క్ష ణానికి సాక్ష్యంగా నిలిచిం ది. తె లం గాణ జాతి గౌరవం, ఆత్మగౌరవం, సంస్కృతి, అస్తి త్వానికి ప్రతీకగా ని లిచే శక్తి స్వరూపిణి తెలంగాణ త ల్లి విగ్రహం అక్కడ గర్వంగా నిలి చింది. ఆ మహత్తర విగ్రహాన్ని రా ష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ము ఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో కలిసి ఘనంగా ఆవిష్కరించారు.బడ్జెట్ సమావేశాల ప్రారంభ రోజున సోమ వారం జరిగిన ఈ వేడుక శాసనస భ చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టంగా నిలిచింది.
ఈ కార్యక్రమానికి ముందు గవర్న ర్, ముఖ్యమంత్రితో కలిసి అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ వి గ్రహానికి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించా రు. అనంతరం పునరుద్ధరిం చబడిన శాసనమండలి భవ నం ఎదుట ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవి ష్కరించి నివాళులు అర్పించారు.ఆ రోజు నుంచి శాసనసభ ప్రాంగణంలో నిలిచిన ఆవిగ్రహo తెలంగాణ ఆత్మగౌరవా ని కి, పోరాట స్ఫూర్తికి, సంస్కృతికి చిరస్థాయిగా నిలిచే ప్రతీక గా భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిచ్చేలా నిలిచింది.
ఈ కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాస నసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమా ర్, ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాస నమండలి డిప్యూ టీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్‌తో పాటు రాష్ట్ర మoత్రులు కో మటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్ గౌడ్, దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
