Wednesday, October 7, 2026
More
    HomeOpinionNalgonda Collector B. Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అప్పీ ల్, రుణాల గ్రౌండింగ్...

    Nalgonda Collector B. Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అప్పీ ల్, రుణాల గ్రౌండింగ్ లోనిర్దేశించిన లక్ష్యాల పూర్తిబాధ్యత బ్యాంకర్లదే

    📰 Generate e-Paper Clip

    Nalgonda Collector B. Chandrasekhar : ప్రజా దీవె న, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం ము గింపు దశలో ఉన్నందున బ్యాంకు ల అనుసంధానంతో అ మలు చేస్తున్న ప్రభుత్వ ప్రాధామ్య పథకాలతో పాటు అన్ని పథకాల గ్రౌండింగ్ ల క్ష్యాలను బ్యాంకర్లు పూర్తిచేయాలని జి ల్లా కలెక్టర్ బి .చంద్రశేఖర్ కోరారు. బుధవారం అయన కలెక్ట ర్ కార్యా లయ సమావేశ మందిరం లో నిర్వ హించిన జిల్లా బ్యాంకర్ల సంప్రదిం పుల కమిటీ సమావేశం లో 2025- 26 ఆర్థిక సంవత్సరా నికి సంబoధించి సెప్టెంబర్, డిసెంబర్ 20 25 త్రైమాసిక లక్ష్యాల సా ధనపై బ్యాంకుల నియంత్రణ అ ధికారులు, జిల్లా అధికారులతో సమీక్షించారు.

    గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని ప్ర జల అభివృద్ధికై ప్రభుత్వం పలు ప థకాలను బ్యాంకుల సహకారంతో అమలు చేస్తు న్నదని, ప్రత్యేకించి వ్యవసాయ రుణాలు ,చిన్న మధ్య తర గతి ఔత్సాహిక వేత్తలకు ఇచ్చే రుణాలు, టర్మ్ లోన్లు, డిఆర్ డిఏ, మెప్మా, ఎస్సి, ఎస్టీ,బీసీ కార్పొరే ష న్ల ద్వారా అందించే తదితర రుణా ల గ్రౌండింగ్ విషయంలో నిర్దేశించిన లక్ష్యాలు పూర్తిచేయాల్సిన బాధ్య త బ్యాంకర్లపై ఉందని, పై అన్ని అంశాలపై బ్యాంకర్లు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ఆర్థిక సంవ త్సరం ముగిసేలోపు వాటిని సాధించాలని కోరారు. గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ ద్వారా వివిధ రంగాలలో ఇస్తున్న శిక్ష ణలో భాగంగా చిరు వ్యాపారాలు నిర్వహించుకునే అతి పే దవారు రుణాల కోసం చేసుకున్న దరఖాస్తులను బ్యాంకర్లు పెద్ద మన సుతో జాప్యం చేయకుండా మంజూరు చేయాలని కోరారు. అలాగే ఆర్ సెటీ సంస్థ శిక్షణ సమయంలో నే శిక్షణ పొందుతున్న వారికి లోన్ కు ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఎ లాంటి బ్యాంకులను సంప్రదించా లో తెలియజేయాలని ఆర్ సెటి డైరెక్టర్ ను ఆదేశించారు.

    ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిపోయిన వ్యవసాయ రుణా లతో పాటు ప్రాధాన్యత రంగాలైన గృహ నిర్మాణం, విద్య రు ణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ కోరారు. చిన్న ,మధ్య తరహా ఔత్సాహిక వ్యా పారవేత్తలకు ఇచ్చే రుణాల విష యంలో అన్ని బ్యాంకులు వారి లక్ష్యాల సాధనను వేగవం తం చేయాల్సిన అవసరం ఉందని, నల్గొండ జిల్లా కేంద్ర స హకార బ్యాంకు లాం టి బ్యాంకులు విద్యా రుణాలపై దృ ష్టి సారించాలని, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా అమలు చేసే బ్యాంకు లింకేజీ, మెప్మా ,సెర్ప్, ఎ స్సీ ,ఎస్టీ, బీసీ తదిత ర కార్పొరేషన్ల ద్వారా అమలు చేసే పథకాలపై కూడా బ్యాం కర్లు ఈ నెల 30 లోపు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చే సేం దుకు చర్యలు తీసుకోవాలన్నారు.

    పశుసంవర్ధక శాఖ ద్వారా బ్యాంకు ల సహకారంతో జారీ చే సే కిసాన్ క్రె డిట్ కార్డులకు ప్రాధాన్యత ఇవ్వాలని బ్యాంక ర్లకు సూచించారు. వివి ధ రుణాల గ్రౌండింగ్ పై ఆయా బ్యాం కులవారీగా జిల్లా కలెక్టర్ కూ లంకషంగా సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయా శాఖల జిల్లా అధికారులు వా రి శాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాల యూనిట్ల గ్రౌండిం గ్, పెండింగ్ ,సమస్యలపై జిల్లా కలెక్టర్ తో పాటు, బ్యాంకర్ల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సంద ర్బంగా నాబార్డ్ ఆధ్వ ర్యంలో 202 6 -27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 16 ,861 కోట్ల రూపాయల తో రూపొందించిన “సామర్ధ్య ఆధా రిత రుణ ప్రణాళిక” (పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ 2026- 27) ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఆర్బిఐ ఎల్డిఓ గోమ తి, నాబార్డ్ డిడిఎమ్ వినయ్, నల్గొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సీఈఓ శంకర్ రావు, సంబంధిత శాఖల జిల్లా అధి కారులు, బ్యాంకుల నియంత్రణ అధికారులు ఈ సమా వేశా నికి హాజరయ్యారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.