Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ:నల్లగొండ లోని రామగిరి శ్రీ సీతారామచంద్ర స్వా మి దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి వచ్చే సం వత్సరం శ్రీరామనవమి నాటికి మరింత ఆకర్షణీయంగా తీ ర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ ల మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. శ్రీరామ నవమి ని పురస్కరించుకొని శుక్ర వారం నల్గొండ పట్టణంలోని రా మగిరి దేవాలయంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యా ణోత్సవంలో మంత్రి పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు స మర్పించారు.ఈ సంద ర్భంగా మాట్లాడుతూ రామగిరి దే వాలయానికి ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు తరలి వస్తారని చెప్పారు. దేవాలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించామ ని, వైకుంఠ దర్శనం, ఉత్తర ద్వార దర్శనం వంటి సౌకర్యాలను కల్పిం చేందుకు చర్యలు తీసుకుంటా మని వెల్లడించారు.
దర్శన మార్గాల విస్తరణ కోసం అవసరమైన స్థలసేకరణకై ఇప్పటికే చర్చలు జరుపుతున్నామని, నెల రోజుల్లో రిజిస్ట్రే షన్ పూర్తి చేసి ప నులు ప్రారంభిస్తామని చెప్పారు. రామగి రి రామాలయానికి గొప్ప చ రిత్ర ఉందని గుర్తుచేస్తూ, భక్తు లకు మరింత సౌకర్యాలు కల్పించేలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అలాగే దేవాలయ భూములకు ఇబ్బంది కాకుం డా నేషనల్ హైవే మార్గాన్ని బైపాస్ ద్వారా మళ్లించామని పే ర్కొన్నారు. నల్గొండ పట్టణ ప్రజలు శ్రీరాముని కృపతో సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి సహకారం తో రామగిరి రామాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఉత్తర ద్వార దర్శనానికి కృ షి చేస్తానని చెప్పారు. స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై . అశోక్ రెడ్డి, జిల్లా పరి షత్ సీఈవో ప్రేమ్ కరణ్ రె డ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూ కూరి రమేష్, మాజీ ము న్సిపల్ చై ర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి పాశం రామ్ రెడ్డి, కార్పొరేటర్లు, భక్తులు, ప్ర జలు పాల్గొన్నా రు.
జిల్లాయంత్రాంగం తరపున పట్టువస్త్రాలు సమర్పించిన కలెక్టర్
నల్గొండ జిల్లా ప్రజలుసుఖసంతోషాలతో, ఆనందోత్సాహల తో ఉం డేలా జిల్లా మరింత అభివృద్ధి సాధించేలా ఆశీర్వ దించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ శ్రీ సీత రామ చంద్ర స్వామిని ప్రార్థించారు. శ్రీరా మనవమి పర్వదినాన్ని పురస్క రించుకొని శుక్రవారం తన క్యాంపు కార్యాలయవద్ద నల్గొండ జిల్లా కేం ద్రంలోని రామగిరి శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆల యంలో నిర్వ హించే కళ్యాణోత్సవానికి ఆయన జిల్లా యం త్రాంగం తరఫున పూ జాది కార్యక్రమాలు నిర్వహించి స్వా మి వారికి పట్టు వస్త్రాలు, త లంబ్రాలు సమర్పించారు.
పట్టు వస్త్రాలు, తలంబ్రాలను త లపై పెట్టుకొని మేళతాళా లతో వ చ్చి క్యాంపు కార్యాలయంలో ఆలయ అధికారులు, వేద పండితులు, అర్చకులకు వాటిని అందజేశారు. ఈ సం దర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజ లకు శ్రీరామనవమి శుభా కాంక్షలు తెలియజేశారు. జిల్లా యంత్రాంగం తరఫున స్వా మివారికి పట్టువస్త్రాలు,తలంబ్రాలు అందజేయడం సంతో షంగా ఉందన్నారు. నల్గొండ జిల్లా మరింత అభివృద్ధి సాధిం చి జి ల్లా ప్రజలు సుఖ సంతో షాలతో ఉండేలా సీతా రామ చంద్ర స్వామి ఆశీర్వదించాలని కలెక్టర్ ప్రార్థించారు.



