Thursday, October 8, 2026
More
    HomeIndiaTamilnadu cracker factory fire accident : బిగ్ బ్రేకింగ్, తమిళనాడులో ఘోర అగ్నిప్రమాదం,...

    Tamilnadu cracker factory fire accident : బిగ్ బ్రేకింగ్, తమిళనాడులో ఘోర అగ్నిప్రమాదం, పద్దెనిమిది మంది దుర్మరణం

    📰 Generate e-Paper Clip

     

    Tamilnadu cracker factory fire accident:  ప్రజా దీ వెన, చెన్నై: తమిళనాడు లోని విరుద్ నగర్ జిల్లా వరుస పే లుళ్లతో ఉలిక్కిపడింది. ప్రశాంత జీవనం సాగాల్సిన ఆదివా రం ఒక్క సారి గా విషాదంగా మారింది. ఈ ఘోర అగ్ని ప్ర మాద సంఘటనలో పదిహేడు మంది దుర్మరణం చెందగా పలువురు తీవ్రంగా గాయపడి నట్లు స్థానిక అధికారులు తె లిపారు.

    తమిళనాడు ఒక పటాకుల ఫ్యాక్టరీలో భారీ శబ్దంతో జరిగిన పేలుడు ప్రాంతాన్ని కుదిపేసింది. క్షణాల్లోనే మంటలు ఆకా శాన్ని తాకగా, అక్క డ పనిచేస్తున్న వారిలో కనీసం 18 మం ది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనతో కుటుంబాలు శో కసంద్రంలో మునిగిపోయాయి. పలువురు తీవ్రంగా గాయ పడగా, వారిని సమీప ఆసుపత్రులకు తరలించి ప్రాణా పా య స్థితిలో చికిత్స అందిస్తున్నారు.

    ఇది ఒక్కటే కాదు ఇప్పటికే ఏప్రిల్ 13న సత్తూరు సమీపం లోని మడ తపట్టి గ్రామంలో ఉన్న ఎక్సెల్ ఫై ర్వర్క్స్ ఫ్యాక్ట రీలో మరో పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో ముగ్గురు గాయపడి, స్థానికుల్లో ఆందోళనను రేకె త్తించిం ది.ఈ వరుస ప్రమాదాలు భద్రతా ప్రమాణాలపై తీవ్ర మైన ప్రశ్నలు లే వనెత్తుతున్నాయి. పోలీసులు కేసులు న మోదు చేసి దర్యాప్తు ప్రా రంభించారు. ముఖ్యంగా మడత పట్టి ఘటనలో అసలు కారణాలను వెలికితీసే పనిలో అ ధికారులు నిమగ్నమయ్యారు.

    పటాకుల వెలుగులు పండగలను అలంకరించాల్సిన చోట, ప్రాణాలు తీస్తున్న ఈ ఘటనలు అందరినీ క లచివేస్తున్నా యి. భద్రతా నిర్లక్ష్యం ఎంత పెద్ద మూల్యం చెల్లించుకో వా ల్సివస్తుందో ఈ సంఘటనలు మరోసారి గుర్తుచేస్తున్నా యని చెప్పవచ్చు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.