Thursday, October 8, 2026
More
    HomeOpinionNalgonda Collector Chandrashekhar: నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అల్టి మేటం, చట్ట విరుద్ధమైన అక్రమ ద...

    Nalgonda Collector Chandrashekhar: నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అల్టి మేటం, చట్ట విరుద్ధమైన అక్రమ ద త్తత తీసుకుంటే కఠినచర్యలు 

    📰 Generate e-Paper Clip

    Nalgonda Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: అక్రమ దత్తత చట్టరీత్యా నేరమని అక్రమ ద త్త త తీసుకుంటే కఠిన చర్యలు తీ సుకుంటామని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా అమలు చే స్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణా ళి క 99 రోజుల కార్యక్రమంలో భాగం గా ఈనెల 27 నుండి మే 2 వరకు బా లల భద్రత & రక్షణ మరియు మత్తు పదార్థాలకు “నో చెప్పం డి” అనే అంశంపై వారోత్సవాలను ని ర్వహిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. సోమవారం మహిళా, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చట్టబద్ధమైన దత్తతపై అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏ ర్పాటుచేసిన ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను కలెక్టర్ ప్రారంభించా రు.

    ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎవరైనా పిల్లలను దత్తత తీ సుకోవలసి వస్తే తప్పనిసరిగా చట్టబద్ధంగా మాత్ర మే దత్తత తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. అక్రమ దత్తత చట్టరీత్యా నేరమని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. దత్తత తీసుకో వాలనుకునే వారు మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారు లను సంప్రదించి చ ట్టపరమైన విధానాలను అనుస రించా లని తెలిపారు.మరింత సమాచారం కోసం జిల్లా సంక్షేమ అ ధికారి కార్యాలయం లేదా జిల్లా బా లల పరిరక్షణ విభాగం (బాలరక్ష భ వన్, ఆర్టీసీ బస్టాండ్ వెనుక వీధి, నల్లగొండ)ను సంప్రదించాలని కోరారు.

     

    జిల్లాలో దత్తతపై అవగాహన పెంచేందుకు కలెక్టరేట్‌తో పా టు, బస్టాండ్, రైల్వే స్టేషన్లలో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదే శించారు. అలాగే మిర్యాలగూడ, దేవరకొం డ, హాలియా, నకిరేకల్, చిట్యాల, నాగార్జునసాగర్, చండూ రు వంటి పట్టణాల్లో జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహ న కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. గ్రామ స్థాయిలో గ్రామ బా లల పరిరక్షణ కమిటీల ఆధ్వర్యంలో గ్రా మపంచాయతీలలో దత్తత పై ప్రజలకు వివరించాలని కలె క్టర్ తెలిపారు.

     

    ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశో క్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణ వేణి, జిల్లా పరి షత్ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా బాలల పరిరక్షణ అధికా రి కె. గణేష్, జిల్లా కో-ఆర్డినే టర్ (చైల్డ్ లైన్) బి. మహేశ్, చా రు మతి చైల్డ్ కేర్ సంస్థ నిర్వాహకులు నాగసేనారెడ్డి, జిల్లా బాలల పరిరక్ష ణ సిబ్బంది, చైల్డ్ లైన్ సిబ్బంది, బాలసదనం మరియు శిశుగృహ సిబ్బంది పాల్గొన్నారు.

     

     

    విద్యార్థులు బాగాచదివి ఉన్నత స్థాయికి ఎదగాలని

    విద్యార్థులు బాగా చదివిఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్. బి.చంద్రశేఖర్. అన్నారు.ప్రజా పా లన- ప్రగతి ప్రణా ళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా బాలల భ ద్రత & రక్షణ మరియు “మత్తు పదార్థాలకు నో చెప్పండి”అనే అం శం పై ఈ నెల 27 నుండి మే 2 వరకు నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవా ల్లో భాగంగా జిల్లాలోని శిశు సంరక్ష ణ సంస్థల్లో ఉన్న విద్యార్థులు ఉ న్నతికి కృషి చేస్తామని కలెక్టర్ అ న్నా రు. సోమవారం కలెక్టర్ కార్యా లయ సమావేశ మందిరంలో ని ర్వ హించిన కార్యక్రమంలో చైల్డ్ కేర్ ఇ న్‌స్టిట్యూషన్ (CC Is)ల్లో ఆశ్రయం పొందుతున్న 18 సంవత్సరాల లో పు బాల బాలికలకు గుర్తింపు ప త్రాలు పంపిణీ చేశారు. జనన ధృ వీకరణ పత్రాలు, కుల ధృవీకరణ పత్రాలు, నివాస ధృవీకర ణ పత్రా లు, హెల్త్ కార్డులు, ఆధార్ కార్డు లు, సేవింగ్ బ్యాంక్ ఖాతా పుస్తకాలను జిల్లా కలెక్టర్ బాలలకు అంద జేశారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ శిశు సంరక్షణ సం స్థల్లో అంది స్తున్న సౌకర్యాలను బాలలు సద్వి నియోగం చే సుకొని బాగా చదివి జీ వితంలో ఉన్నత శిఖరాలను అధి రోహించాలని కోరారు. ఈ కార్యక్ర మంలో రెవిన్యూ అద న పు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు క లెక్టర్ వై. అశోక్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆ ఫీసర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి కె. గణేష్, జి ల్లా కో-ఆర్డినేటర్ (చై ల్డ్ లైన్) బి. మ హేశ్, జిల్లా బాలల పరిరక్షణ సిబ్బంది ఉ న్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.