Thursday, October 8, 2026
More
    HomeOpinionNalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక వ్యాఖ్య, వారంరోజుల్లో ధాన్యం కొనుగోలు...

    Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక వ్యాఖ్య, వారంరోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియపూర్తికి చర్యలు 

    📰 Generate e-Paper Clip

    Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ : కొనుగోలు చేసిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో మిల్లులకు తరలించి కొ నుగోలు కేంద్రాలలో ధాన్యం నిల్వ లేకుండా క్లోజ్ చేయాలని జిల్లా కలె క్టర్ బి. చంద్రశేఖర్ దా న్యం కొను గోలు ప్రక్రియలో భాగస్వాములైన అధికారులను ఆదేశించారు. ఆది వారం హైదరాబాద్ నుండి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్ర ధా న కార్యదర్శి రామకృష్ణారావు, పౌ ర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫె న్ రవీంద్ర తో కలిసి ధాన్యం కొను గోలు పై నిర్వహించిన వీడియో కా న్ఫరెన్స్ సందర్భంగా ఖమ్మం జి ల్లా నుండి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వివిధ ప్రాం తాల నుండి రాష్ట్ర మంత్రులు జూ పల్లి కృష్ణా రా వు, అడ్డూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వ రరా వు, జిల్లాల కలెక్టర్లు, పౌరస ర ఫరాలు, వ్యవసాయ, అను బంధ శాఖల అధికారులతో రబీ ధాన్యం కొనుగోలు ప్రక్రియ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

    నల్గొండ జిల్లాలో రబీ ధాన్యం కొను గోలు ప్రక్రియపై జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ ముందే సిద్ధం చేసుకున్న కార్యాచరణ ప్ర ణాళిక ప్రకారం రానున్న 6,7 రో జు ల్లో జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్ర క్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, ఇందుకుగాను ప్రతిరోజు ధాన్యం కొనుగోళ్లను ప ర్యవేక్షించడమే కాకుండా, సంబం ధిత అధికారులతో సమీక్షించి, మి. ల్లుల వద్ద తక్షణమే ధాన్యం అన్లో డింగ్ చేసుకునేలా చర్యలు తీసు కుంటామని పౌరసరఫరాల శాఖ మంత్రి కి తెలియజేశారు.

     

    అనంతరం జిల్లా అధికారులతో క లెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో కొ నుగోలు చేసిన ధాన్యం మొత్తాన్ని వారం రోజుల్లో పూ ర్తిస్థాయిలో మి ల్లులకు తరలించి ధాన్యం కొనుగో లు కేం ద్రాలను క్లోజ్ చేయాలని ఆ దేశించారు.కొనుగోలు కేంద్రాల్లో ని ల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు పంపించా లని, మిల్లర్లు వెంటనే ధాన్యాన్ని దించుకోవాల ని,ఏ కొను గోలు కేంద్రంలో ధాన్యం పెండింగ్ లేకుండా చూడాలని చె ప్పారు. ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియ వేగ వంతం చేసి రైతుల ఖా తాల్లో త్వరగా డబ్బులు జమయ్యేలా చర్యలు తీసుకో వా లని ఆదేశించారు.

    అంతకుముందు పౌరసరఫరాల శా ఖ మంత్రి మంత్రి ఎన్ .ఉత్తం కు మార్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో అత్యధికంగా వరి పండించిన రా ష్ట్రంగా తెలంగాణ మొదటి స్థానం లో నిలిచిందన్నారు. రాష్ట్రంలో ఇ ప్పటివరకు 141 లక్షల మెట్రిక్ ట న్నుల ధాన్యం కొనుగోలు జరిగిం దని, ఇంకా 8.5 లక్షల మెట్రిక్ ట న్నుల ధాన్యం కొనుగోలు జరగాల్సి ఉందని, అధికారులు వెంటనే కొ నుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.

    మిల్లర్లు, ట్రేడ ర్లు తాలు, తరుగు పేరు తో రైతులను ఇబ్బం దులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసు కుంటామని మరోసా రి హెచ్చరించారు.అకాల వర్షాల కా రణంగా తడిసిన ధా న్యాన్ని కూడా కొనుగోలు చేసి మిల్లు లకు తరలించాలని సూచించారు. వారం రోజుల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ని ల్వ లేకుండా పూర్తిగా కొనుగోలు చే సి కొనుగోలు ప్రక్రియను ముగించా లని చెప్పారు. ఈ వీడి యో కాన్ఫరె న్స్ కు రెవి న్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, అదనపు ఎస్పీ రమేష్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శే ఖర్ రెడ్డి, పౌరసరఫరాల అధి కారి వెంకటేష్, డిఎం రాంపతి , మార్కెటింగ్ ఎడి ఛా యాదేవి ఇత ర అధికారులు తదిత రులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.