Thursday, October 8, 2026
More
    HomeTelanganaMp Chamala Kiran Kumar Reddy Phone Tapping : ఫోన్ ట్యాపింగ్‌పై చామల సంచలన...

    Mp Chamala Kiran Kumar Reddy Phone Tapping : ఫోన్ ట్యాపింగ్‌పై చామల సంచలన ఆరోపణలు

    📰 Generate e-Paper Clip

    Mp Chamala Kiran Kumar Reddy Phone Tapping : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యా పింగ్ కేసు (Phone Tapping Case) దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో బాధితుడిగా పేర్కొంటున్న భువనగి రి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి శనివారం ప్రత్యే క దర్యాప్తు బృందం (సిట్) అధికారుల ఎదుట హాజరై తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆ రోపణలు చేశారు.

    2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుల రా జకీయ కదలికలను పర్యవేక్షించడానికే ఫోన్ ట్యాపింగ్ వ్యవ స్థను ఉపయోగించారని చామల ఆరోపించారు. తాను టీపీ సీసీ మీడియా కమిటీ ఛైర్మన్‌ (TPCC MEDIA COMITTE CHAIRMAN) గా పనిచేస్తున్న సమయంలో తన ఫోన్‌ను అక్రమంగా ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు తనకు వివ రించారని చెప్పారు. ముఖ్యంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి (CM REVANTH REDDY) కి సన్నిహితంగా ఉండటం, ఆయన బృందంలో కీలక బాధ్యతలు నిర్వహించ డం వల్లే తనపై నిఘా పెట్టారని పేర్కొన్నారు.

    chamala

    ఈ సందర్భంగా చామల మరో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావిం చారు. కేవలం ప్రతిపక్ష నేతలే కాకుండా, అధికార పార్టీలోని కొందరు ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాపింగ్‌కు గురయ్యా యని అన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు ఫోన్‌పై కూడా నిఘా ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగిందని, ఆ అనుమానా లతోనే ఆయన తన సిబ్బందిలో మార్పులు చేసినట్లు తెలి పారు. అలాగే ఎమ్మెల్సీ కవిత కూడా గతంలో ఫోన్ ట్యాపిం గ్ అంశంపై పలుమార్లు బహిరంగంగా వ్యాఖ్యానించారని గుర్తుచేశారు.

    Also Read: Ex-MLA Escapes Major Road Mishap: తృటిలో తప్పిన మాజీ ఎమ్మెల్యే ప్రమాదం

    అధికార దుర్వినియోగానికి ఫోన్ ట్యాపింగ్ ఒక ఉదాహరణ గా నిలిచిందని చామల విమర్శించారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా, వేల సంఖ్యలో ఫోన్లు నిఘా పరిధిలోకి వచ్చాయని ఆయన ఆరోపించారు. వ్యక్తిగత సంభాషణలను సైతం రికార్డు చేయడం ప్రజాస్వా మ్యానికి విరుద్ధమని అన్నారు.

    ఈ కేసులో సిట్ అధికారులు సేకరిస్తున్న ఆధారాలు వెలుగు లోకి వస్తే తెలంగాణ రాజకీయాల్లో మరిన్ని సంచలనాలు బయటపడే అవకాశం ఉందని చామల వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన పూర్తి నిజాలు ప్రజల ముందుకు రావాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీ సుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రస్తుతం ఈ కేసు రా ష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీ యాంశంగా మారగా, సి ట్ దర్యాప్తు పురోగతిపై అందరి దృష్టి నిలిచింది. రాబోయే రోజుల్లో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకా శాలు కనిపిస్తున్నాయి.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.