Thursday, October 8, 2026
More
    HomehealthEbola virus alert : ఎబోలా అలర్ట్.. భారత్‌లో అప్రమత్తత పెంపు, హైదరాబాద్ ఘటనతో ఆందోళన

    Ebola virus alert : ఎబోలా అలర్ట్.. భారత్‌లో అప్రమత్తత పెంపు, హైదరాబాద్ ఘటనతో ఆందోళన

    📰 Generate e-Paper Clip

    Ebola virus alert : ప్రపంచాన్ని గతంలో వణికించిన ఎ బోలా వైరస్ మళ్లీ వార్తల్లోకి రావడంతో ఆరోగ్య వర్గాలు అప్ర మత్తమయ్యాయి. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో కేసులు పెరు గుతున్న సమయంలో హైదరాబాద్‌లో ఓ విదేశీ విద్యార్థిలో ఎబోలా లక్షణాలు కనిపించడం చర్చనీయాంశంగా మారిం ది.సూడాన్‌కు చెందిన 36 ఏళ్ల మహమ్మద్ యగౌచ్ అహ్మద్ ఇటీవల హైదరాబాద్‌కు చేరుకున్నాడు. శంషాబాద్ విమా నాశ్రయంలో సాధారణ వైద్య పరీక్షల సమయంలో అతడి లో తీవ్రమైన జ్వరం, అలసట వంటి లక్షణాలు గుర్తించిన అ ధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. ఆరోగ్య శాఖకు స మాచారం అందించి ప్రత్యేక అంబులెన్స్‌లో అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

    అతడితో సన్నిహితంగా ఉన్న మరో వ్యక్తిని కూడా గుర్తించి ఐసోలేషన్‌లో ఉంచారు. ప్రస్తుతం ఇద్దరికీ వైద్యుల పర్యవేక్ష ణలో చికిత్స కొనసాగుతోంది. వారి రక్త నమూనాలను పరిశీ లన కోసం హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రయోగశాలకు పంప గా, తుది నిర్ధారణ కోసం పూణెలోని ప్రత్యేక వైరాలజీ కేంద్రా నికి పంపించే ఏర్పాట్లు చేశారు.

    ఇదే సమయంలో మధ్య ఆఫ్రికాలోని కాంగో సహా పలు ప్రాం తాల్లో ఎబోలా అనుమానిత కేసులు, మరణాలు పెరుగుతు న్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం వ్యాపిస్తున్న బుండిబుగ్యో ర కం వైరస్‌కు పూర్తి స్థాయి వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవ డం వైద్య నిపుణుల్లో ఆందోళన కలిగిస్తోంది.ఎబోలా వైరస్ ప్రధానంగా సోకిన వ్యక్తి రక్తం, చెమట, లాలాజలం వంటి శరీ ర ద్రవాల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. సమయానికి వై ద్యం అందకపోతే ప్రాణాపాయం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    ఆఫ్రికాలో వైద్య సదుపాయాల కొరత, అవగాహన లోపం, ఘర్షణల పరిస్థితులు వైరస్ నియంత్రణకు సవాళ్లుగా మా రుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బాధితులు చికిత్సకు దూ రంగా ఉండటం, ఐసోలేషన్ కేంద్రాల నుంచి బయటకు వెళ్లి పోవడం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోంది.

    కరోనా మహమ్మారి అనుభవాన్ని ఇంకా మరచిపోని ప్రపం చం ఇప్పుడు ఎబోలా పరిణామాలను జాగ్రత్తగా గమని స్తోంది. అయితే ప్రస్తుతం భారత్‌లో నిర్ధారిత ఎబోలా కేసు లపై అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ ఆరోగ్య శా ఖలు అప్రమత్తంగా ఉండి పర్యవేక్షణను మరింత బలోపే తం చేస్తున్నాయి.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.