Wednesday, October 7, 2026
More
    HomeOpinionSuryapet Collector Tejas Nand Lal Pawar : ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా పాలన,...

    Suryapet Collector Tejas Nand Lal Pawar : ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక ప్రధాన ల క్ష్యం

    📰 Generate e-Paper Clip

    Suryapet Collector Tejas Nand Lal Pawar : ప్రజాదీ వెన, సూర్యాపేట : ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఆత్మకూ ర్ (ఎస్)మండలం నెమ్మి కల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం నిర్వ హించిన గ్రామ సభ కు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవా ర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ స్థులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడు తూ ప్రజాసమస్యల పరిష్కారం, గ్రామాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చే పట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణా ళిక కార్యక్రమం మార్చి 6వ తేదీ నుండి అన్ని శాఖల సమ న్వయం తో విజయవంతంగా అమలు చేయబడుతోందని తెలిపారు.

    గ్రామ సభలు ప్రజలకు ప్రభుత్వ కా ర్యక్రమాలను చేరవేసే సమర్థవం తమైన వేదికలని అన్నారు. విద్య, వైద్యం, గ్రామీ ణాభివృద్ధి, పర్యావర ణ పరిరక్షణ, పారిశుద్ధ్యం, వర్షాకా లం లో అంటువ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలి పారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక ద్వారా ప్రభుత్వ సేవ లు ప్రజలకు మరింత చేరువవుతున్నాయని అన్నారు.

    రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉం చుకుని రైతులు పంట మార్పిడి వి ధానాలను అనుసరించాలని, వ్య వసాయ శాఖ సూచనల మేరకు శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టా లని సూచించారు. ఎరువులు, పు రుగుమందుల వినియోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, పం టల దిగుబడులు పెరిగేలా ఆధు ని క వ్యవసాయ పద్ధతులను అనుస రించా లని రైతులకు సూచించారు.

    గ్రామాల్లో సాలిడ్ అండ్ లిక్విడ్ వే స్ట్ మేనేజ్‌మెంట్ కార్య క్రమాలను సమర్థవంతంగా అమలు చేయాల ని, తడి చెత్త, పొడి చెత్తను వేర్వే రుగా సేకరించే అలవాటు ప్రతి కు టుం బం అలవరుచుకోవాలని కోరారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా వ్యాధులను నివారించవచ్చని తెలిపారు.

    ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్ర మంలో భాగంగా ఎ స్‌ఐఆర్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా అవ గాహన కల్పించాలని సూచించారు. అర్హులైన వారందరికీ ఓటు హ క్కు కల్పించడం, అనర్హుల పేర్లను జాబితా నుండి తొలగించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వివ రించా రు.

    బడిబాట కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని, ప్రభు త్వ పాఠ శాలల్లో విద్యార్థుల చేరికలు పెరిగే లా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ పాఠశాల ల్లో నాణ్యమైన విద్యతో పాటు ఆ ధునిక మౌలిక వసతులు, డిజిటల్ విద్య, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకా లు, యూనిఫాంలు త దితర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

    తల్లిదండ్రు లు తమ పిల్లలను ప్రభు త్వ పాఠశాలల్లో చేర్పిం చాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిపిఓ యాదగిరి, తహ సీల్దార్ అమిన్ సింగ్, ఎంపీడీవో హ సింహలీ, మెడికల్ ఆఫీ సర్ రమ్య రెడ్డి, ఏవో దివ్య, ఎంఈఓ దారాసింగ్, మండల స్థాయి అధికా రులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు తదిత రులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.