Nipah virus border threat : ప్రజా దీవెన, చెన్నై: కేరళ వే దికగా మరోసారి ‘నిఫా’ వైరస్ కోరలు చా స్తోంది. కోజికోడ్ పరిసర ప్రాంతాల్లో అప్పుడే బాధితుల సంఖ్య 200 మార్కు ను దాటడంతో ఇరు రా ష్ట్రాల్లో తీవ్ర కలకలం రేగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పొరు గున ఉన్న తమిళనాడు ప్ర భుత్వం ముందస్తుగా మేల్కొంది.వైరస్ త మ రాష్ట్రంలోకి వ్యాపించకుండా సరిహద్దు జిల్లాలైన కోయంబత్తూ ర్, తేని, కన్యాకుమారి, మరియు కడలూరు లలో వైద్య ఆరోగ్య శాఖ ను స్టాలిన్ సర్కార్ ‘రెడ్ అలర్ట్’ చేసింది.

మెడికల్ స్క్రీనింగ్ క్యాంపులు
కేరళ సరిహద్దుల గుండా వచ్చే ప్ర తి ఒక్కరినీ క్షుణ్ణంగా పరి శీలిస్తున్నారు. నిఫాలక్షణాలు (తీవ్రమైన జ్వరం, తలనొప్పి, శ్వాసకోస ఇబ్బందులు) స్వల్పంగా కనిపించినా సరే, వారిని వెంటనే ప్రత్యేకంగా ఏ ర్పాటు చేసిన మొబైల్ మెడికల్ క్యాం పులకు తరలిస్తున్నారు. కాగా సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద థర్మల్ స్కానింగ్ రౌండ్-ది-క్లాక్ నడుస్తోం ది. ముందస్తు జాగ్ర త్త చర్యల్లో భా గంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పం డ్లు తినేటప్పుడు జాగ్రత్తలు వహించాలని అధికారులు సూ చిస్తున్నారు.
ఆరోగ్య శాఖ హెచ్చరిక
పరిస్థితి అదుపులోనే ఉంది, కానీ ఏమరపాటు పనికిరాదు. సరిహ ద్దు జిల్లాల్లో వైద్య బృందాలు 24/ 7 అందుబాటులో ఉన్నాయి.వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తమిళ నాడు స రిహద్దుల్లో ఒక రకమైన ‘హెల్త్ ఎమర్జెన్సీ’ వాతావరణం కని పిస్తోంది. రాబోయే 48 గంటలు ఈ జిల్లాలకు అత్యంత కీల కం కానున్నాయి.

