Wednesday, October 7, 2026
More
    HomeOpinionMinister Komatireddy VenkatReddy : బిగ్ బ్రేకింగ్, హామ్ రోడ్ల పైలాన్ పనులను ఆకస్మికంగా పరిశీలించిన...

    Minister Komatireddy VenkatReddy : బిగ్ బ్రేకింగ్, హామ్ రోడ్ల పైలాన్ పనులను ఆకస్మికంగా పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి

    📰 Generate e-Paper Clip

     

    Minister Komatireddy VenkatReddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కనగల్ మండల కేంద్రoలోని వ్య వసాయ మార్కెట్ యార్డ్ సమీ పంలో త్వరలోనే రాష్ట్ర ము ఖ్య మంత్రి ఏ. రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యా ప్తంగా నిర్మించనున్న హ్యం రోడ్ల ని ర్మాణానికి శంకు స్థాపన చేయనున్న దృష్ట్యా శ నివారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మం త్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హ్యం రోడ్ల శంకుస్థాపన పైలాన్ ప నులను పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని ఆ యన ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. శనివారం మంత్రి కనగల్ వ్యవ సాయ మార్కెట్ సమీపంలో హ్యాం రో డ్ల శంకుస్థాప నకై నిర్మిస్తున్న పై లాన్ పనులను తనిఖీ చేశా రు.

    ఈ సందర్భంగా పైలాన్ పనులను పరిశీలించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ 13500 కోట్లకు సం బంధించిన పైలా న్ ఎప్పుడు గు ర్తుండిపోయేలా నిర్మించాలని, ము ఖ్యంగా పైలాన్ చుట్టూ కిందివైపున మూడు రంగుల కలర్ వేయిం చాలని,అలాగే పెద్ద అక్షరాలతో రోడ్లు, భవనాల శాఖ పేరు అగుపించేలా రాయించాలని, రైలింగ్ తో పాటు, పైలాన్ చు ట్టూ అందంగా తీర్చిది ద్దాలని, సాయంత్రం సమయాల్లో గ్రా మస్తులు, ప్రజలు పైలాన్ వద్ద గడిపే విధంగా పచ్చ గడ్డితో తీర్చిదిద్దాలని మంత్రి ఆర్ అండ్ బి అధికారులను ఆదేశిం చారు.

    అంతకుముందు మంత్రి ఎన్జి కళా శాల మైదానంలో రాష్ట్ర ముఖ్య మంత్రి బహిరంగ సభ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీ లించారు. బహిరంగ సభకు హాజరయ్యే ప్రజలు, ఏర్పా టు చేయాల్సిన కుర్చీలు, టెంట్లు, ఎల్ఈడి స్క్రీన్లు, పార్కింగ్ ఇతర ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ బి. చంద్రశే ఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవా ర్ లతో చర్చించారు. అంతేకాక ఆ రోజు పట్టణంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని, బహిరంగ సభకు హాజరయ్యే వా రికి అవసరమైన ఏర్పాట్లను చేయాలని అధికారులు ఆదే శించారు.

    జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్,జిల్లా ఎస్ పి శరత్ చంద్ర పవర్ , స్థానిక సంస్థల ఇం చార్జ్ అదనపు కలెక్టర్ వై. అశో క్ రె డ్డి, ఆర్ అండ్ బి ఎస్ ఈ శ్రీధర్ రె డ్డి, డి ఈ గణేష్, ఇరిగే షన్ సి ఈ శ్రీ నివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ మున్సి పల్ చైర్మన్ బుర్రి శ్రీని వాస్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి గుమ్మ ల మోహన్ రెడ్డి, తదితరులు మం త్రి వెంట ఉన్నారు.

    కొరతలేకుండా ఎరువులు సరఫరా చేస్తాం

    నల్లగొండ: ఈ వానకాలం సీజన్లో రై తులు పంటలు సాగు చేసుకు నేం దుకు ఎలాంటి ఎరువుల కొరత లేకుండా అవ సరమైన ఎరువులను సరఫరా చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రా ష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. శని వారం అయన నల్గొండ లోని తన క్యాంప్ కార్యాలయం ఇం దిర భవన్ లో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తో కలిసి “ఫ ర్టిలై జర్ బుకింగ్ యాప్” ను ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా ఎరు వులకు సంబం ధించిన సమస్త సమాచారాన్ని తెలుసుకో వచ్చని, ముఖ్యంగా ఎరువుల అందుబాటు, ప్రస్తుత పరిస్థి తి, నిలువలు, సులభంగా తెలుసుకోవచ్చన్నారు.

    ప్రత్యేకించి యూరియా అవసరమైన రైతులు ఫర్టిలైజర్ బుకింగ్ యా ప్ ద్వారా బుక్ చేసుకోవచ్చని, ప ట్టాదారు పాసుపుస్తకం, పంట వివ రాలను నమోదు చేస్తే రైతు పేరు పైన యూరియాను సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ఎకరాకు 2 బస్తాల చొప్పున ఇవ్వడం జరు గుతుందని, ఒక ఎకరా ఉన్నవారికి ఒకేసారి, 1 నుండి 5 ఎకరాలు ఆ పైన ఉన్న వారికి విడతలవారీగా యూరియాను సరఫరా చేయ డం జరుగుతుందని, ఉదయం 6 నుండి రాత్రి 10 గంటల వరకు యూరియాను బుక్ చేసుకోవచ్చని తెలిపారు. జిల్లా లోని అన్ని మండలా లలో సొసైటీలు, డిసిఎంఎస్ లు, 650 కేంద్రాలకు పైగా సరిపోను యూరియా ఉందని, ప్రతి రైతుకు యూరియా ఇవ్వడం జరుగుతుందని, ఎవరు ఆందోళన చెం దాల్సిన అవసరం లేదన్నారు.

     

    విద్యుత్తు అధికారులతో మంత్రి సమీక్షిస్తూ జిల్లాలో ఎలాం టి విద్యుత్ సమస్య రాకుండా చూసుకోవా లని అన్నారు. ముఖ్యంగా పట్టణా లతో పాటు, గ్రామాలలో సమస్య రాకూ డదని, విరిగిన స్తంభాలను సరిచేయాలని, ఎక్కడైనా కొత్త ట్రా న్స్ఫార్మర్లు అవసరం ఉంటే తక్షణ మే ప్రభుత్వం ద్వారా ఇప్పించేందు కు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. లో వోల్టేజి సమస్య రాకూడదన్నారు.మున్సిపల్ అధికారులతో నల్గొం డ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబం ధించి సమీక్ష నిర్వహిం చారు.ఈ సందర్భంగా మంత్రి ఈనెల 21 న నిర్వహించను న్న యో గా దినో త్సవానికి సంబంధించిన టీషర్టులను ఆవి ష్కరించారు. జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, విద్యుత్ అధికా రులు, జిల్లా వ్యవసాయ అధికారి వి. వినోద్ కుమార్ ,స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, తదితరు లు ఉన్నారు.

     మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం

    నల్లగొండ: ఆగస్టు నాటికి నల్గొండ నియోజకవర్గ పరిధిలోని 40 ప్రభు త్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించి మోడ ల్ పాఠశాలలుగా తీర్చిదిద్దు తామని రాష్ట్ర రోడ్లు, భవనా లు, సి నిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని బొ ట్టుగూడలో ఉన్న కోమటి రెడ్డి ప్రతీక్ ప్రభుత్వ ఉన్నత పాఠ శాలను సందర్శించారు. అంతేకాక ప్ర తీక్ ప్రభుత్వ జూని యర్ కళాశాల ను, ఒకేషనల్ జూనియర్ కళాశాలను సైతం సందర్శించారు.

     

    ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడు తూ అభివృద్ధి నిర్మాణాలలో కనిపించదని, విద్యార్థులకు గుణాత్మక విద్య ను అందించడం ద్వారా వారి జీవితాలు మారిపోతాయని అందువలన విద్య పైన తాను ఎక్కువగా దృ ష్టి సారించినట్లు తెలిపారు. రాష్ట్రం లో ఎక్కడా లేనివి ధంగా నిర్మించిన బొట్టు గూడా కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ద్వారా విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, ఐ ఐటీలను సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు చెప్పా రు. ఈ సం వత్సరం పదవ తరగతిలో ప్రతీక్ ప్రభుత్వ పాఠ శాల ద్వారా 95% పై గా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను తన సొంత నిధులతో ఢిల్లీకి విమానంలో పంపిస్తామని, అం దువల్ల విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులు తెచ్చు కోవాలని అన్నా రు.

    గత సంవత్సరం నల్గొండ జిల్లా తిప్పర్తి పాఠశాల విద్యార్థు లు 13 మంది 97 ,98% ఉత్తీర్ణత సాధిస్తే వారందరినీ విమా నంలో విశాఖప ట్నం పంపించడమే కాకుండా, స్టార్ హోటల్ ఏర్పాటు చేసి అరకు ఇత ర పర్యాటక ప్రాంతాలన్నింటిని ఉ చితంగా తిరిగి వచ్చేలా ఏర్పాటు చేశామన్నారు. కోమటిరె డ్డి ప్రతీక్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఐఐటి, ఎంబీబీ ఎస్ ,ఐపీఎస్, ఐఏ ఎస్లు సాధించాలని ఆ విధంగా ల క్ష్యం తో చదవాలని, ప్రధానోపాధ్యా యులు, ఉపాధ్యాయులు విద్యార్థులను సొంత పిల్లల లాగా చదివించాలని, ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చదివించాలని అవసరమైన విద్యా ర్థులకు ప్రత్యేక తరగతుల నిర్వ హించాలని, పదవ తరగతికి తప్ప నిసరిగా ప్రైవేటు క్లాసులు తీసుకో వాలన్నారు.

    ప్రతీక్ పాఠశాలలో నెలరోజుల్లో ఒకటవ తరగతి నుండి ప దవ తరగ తి వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజె న్స్ నేర్పించే విధంగా ల్యాబ్ ను ప్రా రంభించనున్నట్లు వెల్లడించారు. బొ ట్టుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠ శాలలో 600 వరకు విద్యా ర్థుల సంఖ్య చేరుకు న్నందున ఇకపై ఎలాంటి ప్రవేశాలు తీ సుకోవడం లేదని స్పష్టం చేశారు. త్వరలోనే హరే రామహరే కృష్ణ వారి సహకారంతో పాఠశాల పిల్లలకు మంచి నాణ్య మైన ఆహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్న ట్లు తెలి పారు. నల్గొండ నియోజకవర్గ పరిధిలోని 30 నుండి 40 పాఠశాలలను పైలెట్ మోడల్ లో తీసుకుని ఆ పాఠశాల ల్లో తాగునీరు, టాయిలెట్లు, డ్యూయల్ డెస్క్ కంప్యూటర్లు, ఇతర సౌకర్యాలు కల్పించి మోడల్ పాఠశాలలుగా తీర్చిది ద్దుతామని మంత్రి వివరించారు.

    జిల్లావ్యాప్తంగా పదవ తరగతిలో 95 % పైగా ఉత్తీర్ణత సా ధించిన వి ద్యార్థులకు ప్రతీక్ ఫౌండేషన్ ద్వా రా ఇంటర్, మెడిసిన్, ఐఐటి వంటి కోచింగ్ ల కు ఆర్థిక సహకారం అం దిస్తామని తెలిపారు తెలంగాణలో నే నల్గొండ జిల్లా పాఠ శాలలను మోడల్ పాఠ శాలలుగా తీర్చిది ద్దే లా కృషి చేస్తు న్నట్లు మంత్రి వెల్ల డించారు.అనంతరం మంత్రి కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను, ఒకేషనల్ జూనియ ర్ కళాశాలలను సందర్శించి 2 కళాశాలల్లో విద్యార్థుల సం ఖ్య, సౌకర్యాలు, అవసరమైన సౌకర్యాలు, తదితర వివరా లను ప్రిన్సిపల్స్ ద్వారా అడిగి తెలుసుకున్నారు.

    కాగా ప్రభుత్వ జూనియర్ కళా శా లలో 800 మంది, ఒకేష నల్ జూ నియర్ కళాశాలలో 900 మంది విద్యార్థుల సంఖ్య ఉందని, వారికి సరిపడా గదులు లేవని గదుల కొరత ఉంద ని, అలాగే ఒకేషనల్ క ళాశాలలో సామాగ్రి ఏర్పాటుకు గ దులు అవసరం ఉన్నాయని, ప్రిన్సి పల్స్ మంత్రి దృష్టికి తీ సుకువచ్చారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిం చాల్సిన బాధ్యత అ ధ్యాపకులపై ఉందని, చదువుకుంటే తప్పనిసరిగా మార్పు వస్తుందని ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని గుణత్మక విద్యను అందిస్తే వారి భవిష్యత్తు మా రిపోతుందని అన్నారు. స్థానిక సంస్థల ఇంచార్జ్ అ దనపు కలెక్టర్ వై .అశోక్ రెడ్డి, ప్ర భుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సి పల్ ఎం .రాజేందర్, ఒకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సి పాల్ ఏ. ఉపేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, ఇతర ప్రజాప్ర తినిధులు, అధికారులు మంత్రి వెంట ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.