Wednesday, October 7, 2026
More
    HomeOpinionNalgonda to Global Academia : నల్లగొండ నుండి గ్లోబల్ అకాడెమియాకు, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్‌ లో...

    Nalgonda to Global Academia : నల్లగొండ నుండి గ్లోబల్ అకాడెమియాకు, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్‌ లో సరికొత్త మైలురాయి

    📰 Generate e-Paper Clip

    Nalgonda to Global Academia : ప్రజా దీవెన, నల్లగొం డ: స్థానిక పాఠశాలల నుండి అంతర్జాతీయ విశ్వవి ద్యా లయాల అగ్రశ్రేణి పీఠాల వరకు ఒక ప్రయాణం ఎలా సాగు తుందో చెప్పడానికి ఈరోజు నల్లగొండ ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది. సరిహద్దులను దాటి, గ్లోబల్ ఎ డ్యుకేషన్ మ్యాప్‌లో మన ప్రాంతపు కీర్తిని చాటుతూ, న ల్లగొండకు చెందిన డాక్టర్ అనంతుల హిమని అకడమిక్ రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించారు. అమెరి కాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన నార్త్‌వెస్టర్న్ యూని వర్సి టీ (కెలాగ్ స్కూల్ ఆఫ్ మేనే జ్‌మెంట్) నుండి ఆపరేషన్స్ మేనే జ్‌మెంట్‌లో పీహెచ్‌డీ సాధించిన ఆమె, ఇప్పుడు మి చిగన్ స్టేట్ యూనివర్సిటీలోని ‘ఎలీ బ్రాడ్ కాలేజ్ ఆఫ్ బిజి నెస్’లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్నారు.

    నల్లగొండలోనే మూలాలైనా చూపు గ్లోబల్ లీడర్‌షిప్‌పై ఈ అసాధారణ విజయ ప్రయాణం వెనుక బలమైన పునాది ఉంది. నల్లగొండ జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ అధి కారి కె.వి. కృష్ణవేణి, సీనియర్ అడ్వకేట్ అనంతుల శంకర య్య కుమార్తె అయిన హిమని, స్థానిక కృష్ణవేణి టాలెంట్ హైస్కూల్‌లోనే తన పదవ తరగతి పూర్తి చేశారు. ఆ తర్వా త హైదరాబాద్ టు ఐఐటీ బాంబే వరకు సాగింది. హి మా యత్‌నగర్ నారాయణ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసి, IIT-JE E లో ఆలిండియా 622 వ ర్యాంక్‌తో ఐఐటీ బాంబే లో మె కానికల్ ఇంజినీరింగ్ సీటు సాధించారు.

    కార్పొరేట్ అండ్ రీసెర్చ్ ఎక్స్‌పీరియన్స్

    గ్రాడ్యుయేషన్ తర్వాత ఓలా క్యా బ్స్, ఆపై హైదరాబాద్‌లో ని ప్రఖ్యా త ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినె స్ (ISB) లో ప నిచేస్తూ తన పరిశో ధనా నైపుణ్యాలను మెరుగుపరుచు కు న్నారు. ప్రపంచస్థాయి అధ్యా పకులు ప్రొఫెసర్ అచల్ బ స్సాం బూ, ప్రొఫెసర్ మిలింద్ సోహోనిల మార్గదర్శకత్వంలో ఆపరేషన్స్ మే నేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీని విజయ వంతంగా పూర్తి చేశారు. భవిష్యత్ పరిశోధకులకు హిమని ఇస్తున్న ‘గ్లో బల్ గైడ్’అమెరికాలో ఉన్నత విద్య మరియు పరిశోధన లు కేవ లం కొందరికే పరిమితం కాదని, ప్రతిభ మరియు ప ట్టు దల ఉన్న ప్రతి తెలంగాణ విద్యార్థికీ ఇవి అందు బాటులో ఉన్నాయని డాక్టర్ హిమని స్పష్టం చేశారు.

    గ్లోబల్ అకాడెమియాలోకి అడు గుపెట్టాలనుకునే యువత కోసం ఆమె పంచుకున్న కీలక సమాచా రం ప్రకారం అగ్రశ్రేణి అమెరికన్ వి శ్వవిద్యాలయాల్లో అనేక పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ లు పూర్తిగా నిధులతో (Fully Funded) నడుస్తాయి. ఎంపి కైన విద్యార్థులకు 100% ట్యూషన్ ఫీజు మాఫీతో పాటు, నె లకు సుమారు 3,500 డాలర్ల (దాదాపు రూ. 2.9 లక్షలు) స్టై పెండ్, పూర్తి ఉ చిత ఆరోగ్య బీమా, రీసెర్చ్ సపోర్ట్ లభిస్తా యి. దీనివల్ల ఆర్థిక భారం లేకుండా ప్రపంచ స్థాయి రీసెర్చ్ చే యవచ్చని పేర్కొంది.

    నల్లగొండకు లభించిన గ్లోబల్ ప్రైడ్

    స్థానిక విద్యాసంస్థల నుండి ప్రయా ణాన్ని ప్రారంభించి, గ్లో బల్ బిజినెస్ స్కూల్స్‌లో ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టే స్థాయికి ఎదిగిన డాక్ట ర్ హిమని విజయం.. నల్లగొండకే కాక, యావత్ తెలంగాణ యువత కు ఒక దిక్సూచి. గ్లోబల్ లీడ ర్లుగా ఎదగాలనుకునే వేలాది మంది వి ద్యార్థులకు ఆమె ప్ర యాణం నిరoతరం స్ఫూర్తినిస్తూనే ఉంటుందని స్థానిక అ ధ్యాపక బృందంతో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితు లు చెబుతున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.