Wednesday, October 7, 2026
More
    HomeOpinionEx Minister K. T. Rama Rao key comments : మాజీ మంత్రి కేటీఆర్...

    Ex Minister K. T. Rama Rao key comments : మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యా ఖ్య, కేసీఆర్ దార్శనికతకు ప్రపంచ బ్యాంక్ గుర్తింపే నిదర్శనం

    📰 Generate e-Paper Clip

    Ex Minister K. T. Rama Rao key comments  : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణను ‘ఎగువ మధ్య-ఆదాయ’ (Upper-Middl e-Income) ఆర్థిక వ్యవస్థగా ప్రపంచ బ్యాంక్ గుర్తించడం.. బీఆర్ఎస్ అధినేత, మాజీ ము ఖ్య మంత్రి కే.చంద్రశేఖర్ రా వు (కేసీఆర్) దార్శనిక నాయక త్వ నికి, పరిపాలనాదక్షతకు దక్కిన అంతర్జాతీయ స్థాయి గు ర్తింపు అని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎ స్) వర్కింగ్ ప్రెసి డెంట్ కే.టీ. రామారావు (కేటీఆర్) పేర్కొన్నారు. తాజా గు ర్తింపును ప్రస్తావిస్తూ 202 5-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.4.19 లక్షల (5,407 అమెరిక న్ డాలర్లు) తలసరి ఆదా యంతో తెలంగాణ.. ప్ర పంచ బ్యాంక్ ఎగువ మధ్య-ఆదా య కేటగిరీలో చేరిందని, ఈ మైలురాయిని సాధించిన ఐదు భారతీయ రాష్ట్రాల్లో ఒక టిగా నిలిచిందని కేటీఆర్ తెలిపా రు. కేసీఆర్ నాయకత్వం లో గత దశాబ్ద కాలంలో తెలంగా ణ సాధించిన అసాధారణ ఆర్థిక పరివర్తనకు ఈ విశేష విజ యమే అద్దం పడుతోందని ఆయన అన్నారు.

    తెలంగాణ ఆర్థిక పరివర్తనను ప్ర పంచ బ్యాంకు సైతం ధ్రువీ కరించ డం కేవలం ఒక గణాంక విజయం మాత్రమే కాదని, కేసీఆర్ దార్శని కత, నిబద్ధత, పాలనా నమూనా కు దక్కిన అంతర్జాతీయ గుర్తింపు అని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు దశాబ్దాల తరబడి నిర్లక్ష్యానికి గు రైన తెలం గాణ, కేవలం పదేళ్ల వ్యవధిలోనే తన ఆర్థిక తల రాతను తిరగరాసు కుని భారతదేశంలోనే అత్యంత వే గం గా అభివృద్ధి చెందుతున్న, సంపన్న రాష్ట్రాల్లో ఒకటిగా అవ తరించిందని ఆయన గుర్తు చేశారు.

    పారిశ్రామికంగా, ఆర్థికంగా సుదీర్ఘ కాలం పాటు అనుకూలత లు ఉన్న ఇతర రాష్ట్రాల వలె కాకుండా, దార్శనిక నాయక త్వం, సాహసోపేత మైన సంస్కరణలు, వినూత్న పాలన ద్వారానే తెలంగాణ ఈ మైలు రాయిని చేరుకుందని ఆయ న పేర్కొన్నారు. పారిశ్రామిక అనుమతు ల్లో విప్లవాత్మక మా ర్పులు తెచ్చి అ పూర్వమైన పెట్టుబడులను ఆకర్షించిన టీ ఎస్-ఐపాస్ (TS-iPAS S)తో పాటు, కాళేశ్వరం ప్రాజెక్టు, మి షన్ కాకతీయ, రైతుబంధు వం టి ప్రతిష్టాత్మక పథకాలు రా ష్ట్రవ్యాప్తంగా సమ్మిళిత వృద్ధికి, వ్యవసాయాభివృద్ధికి, పారి శ్రామిక విస్తరణ కు, మెరుగైన ఉపాధికి బలమైన పునాది వేశాయని వివరించారు.

    యథాతథ స్థితిని (status quo) సవాల్ చేయడానికి ఒక సంస్కర్త, అపూర్వమైన ఫలితాలను అందిం చడానికి ఒక కార్యదక్షుడు, ఒక రా ష్ట్ర తలరాతను పూర్తిగా మార్చివే య డానికి ఒక నిజమైన మార్గదర్శి అవసరమని, ఈ లక్షణాలే కే సీఆర్ పాలనను నిర్వచిస్తాయని కేటీఆర్ కొనియాడారు. తె లంగాణ అభివృ ద్ధి నమూనా ప్రపంచస్థాయి విశ్వస నీయత ను సంపాదించుకుంద న డానికి ప్రపంచ బ్యాంకు గుర్తింపే మరో నిదర్శనమని ఆయన ఉద్ఘాటించారు.

    కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గు ప్పిస్తూ.. ఎన్నికల హా మీలను నెర వేర్చడంలో తమ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడానికి తెలంగాణను దివాలా తీసిన రాష్ట్రంగా చి త్రించడాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే మాను కో వాలని కేటీ ఆర్ హితవు పలికారు. రాష్ట్రం ఆర్థిక సంక్షో భం లో ఉందంటూ పదేపదే తప్పుడు చిత్రాన్ని చూపేందుకు చే స్తున్న ప్రయత్నాలు, అంతర్జాతీ యంగా గుర్తింపు పొందిన ఆర్థిక సూచీల సాక్షిగా పూర్తిగా బట్టబయలు అయ్యాయని ఆయన ఎద్దేవా చేశారు.

    బీఆర్ఎస్ పాలనలో సృష్టించబడిన బలమైన ఆర్థిక పునా దిపై నిర్మి తమైన రాష్ట్రం తెలంగాణ అని ప్రపంచ బ్యాంక్ గుర్తింపు మరోసారి నిరూపించిందని కేటీఆర్ నొక్కిచె ప్పా రు. దార్శనికత, పనితీరుతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడి పించిన ప్రభుత్వానికి, తప్పుడు ప్రచారాలతో తమ వైఫల్యా లను కప్పిపు చ్చుకోవాలని చూస్తున్న ప్రభుత్వా నికి మధ్య ఉన్న వ్యత్యాసం తెలం గాణ ప్రజలకు పూర్తి స్థాయిలో తె లుసునని ఆయన స్పష్టం చేశారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.