Nalgonda district collector Chandra Shekhar : ప్రజా దీవెన, నల్లగొండ: వచ్చే ఏ డాది చివరి నాటికి నల్గొండ జి ల్లా ను క్షయవ్యాధి (టీబీ) రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమష్టి గా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చా రు.ఈ ఏడాది జిల్లాలో మరో 50 శాతం గ్రామాలను టీబీ ర హిత గ్రామాలుగా ప్రకటించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్సీసీ, మై భారత్ స్వచ్ఛంద సేవకులు సమన్వయంతో పనిచే యాలని కోరారు.గురువారం కలెక్టరేట్ ఆవరణలో ఉన్న ఉదయాదిత్య భవన్ లో జిల్లా క్షయ నివార ణ సంస్థ ఆధ్వ ర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్తో కలిసి కలెక్టర్ పాల్గొ న్నారు.
టీబీ బ్యాక్టీరియా ద్వారా వ్యాపించే వ్యాధి అని, ప్రస్తుతం వ్యా ధి నిర్ధారణ, చికిత్సకు అవసరమైన వైద్య సదుపాయాలు అం దుబాటులో ఉన్నందున ముందస్తుగా గుర్తిస్తే టిబి పూర్తిగా న యం చేయవచ్చని కలెక్టర్ తెలిపారు. టీబీ లక్షణాలపై ప్రజల కు విస్తృతంగా అవగాహన కల్పించడంతో పాటు, అనుమాని తులకు సకాలంలో పరీక్షలు నిర్వహిం చాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 23 ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాల్లో టీబీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరుగుతున్నదని, నకిరేకల్, మిర్యాలగూడ, దేవర కొండ, నాగార్జునసాగర్, మర్రిగూడ, నా ర్కెట్పల్లి తదితర ప్రాంతాల్లో టీబి చికి త్సా సేవలు అందు బా టులో ఉన్నాయని, ఈ సేవ లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టీబీ సోకిన వారు వ్యాధి తగ్గిందనే భావనతో మందు లను మధ్యలోనే నిలిపివేయకుం డా, వైద్యుల సూచన మే ర కు కనీసం 6 నెలలపాటు క్రమంతప్పకుండా మందులు వాడా లని కలెక్టర్ సూచించారు.
టీబీ నిర్మూలనలో భాగంగా టీబిని ముందుగానే గుర్తించేలా కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సాంకే తికతను విస్తృతంగా వి నియోగించేందుకు చర్య లు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపా రు. స్మార్ట్ఫోన్లలో టీబీ సంబంధిత యాప్ ను ఉపయోగించ డం ద్వారా వ్యాధి లక్షణాలపై ప్రాథమిక అవగాహన కల్పించ వచ్చని, స్థానిక భాషలో అడిగే ప్రశ్నలకు సమాధానాలు అందించే సదుపాయం కూడా ఇందులో ఉంటుందని,టీబీపై ఇంటింటికి అవగాహన కల్పిస్తూనే, ఇరుగుపొరుగు వారికి కూ డా అవగాహ న కల్పించాలని సూచించారు. కృత్రిమ మేధ ఆ ధారిత మొబైల్ పరీక్షా పరికరాలు కూడా అందుబాటులోకి వ చ్చాయని, వాటి వినియోగంపై సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని వై ద్యాధికారులను ఆదేశించారు. నర్సింగ్ కళాశాలల సిబ్బంది, విద్యార్థులకు ఏఐ ఆధారిత పరీక్షా పరికరాల వినియోగంపై శిక్షణ ఇచ్చి, గ్రామాల్లో నిర్వహించే టీబీ అవగాహన, పరీక్షా కా ర్యక్రమాల్లో వారి సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ అ న్నారు. దీనివల్ల విద్యార్థులకు ప్రాయోగిక శిక్షణ లభించ డంతో పాటు, గ్రామస్థాయిలో టీ బీ కేసులను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపారు.
గ్రామాల్లో ఇప్పటికే నిర్వహిస్తున్న ఆరోగ్య సర్వేల ను టీబీ ని ర్మూలన కార్యక్రమంతో అనుసంధానం చేయాలని అధికారుల ను ఆదేశించారు. క్షయ నిర్మూలనలో ఎన్సీసీ, మై భారత్ స్వ చ్ఛంద సే వకు లు, సామాజిక స్వచ్ఛంద సంస్థలను భాగస్వా మ్యం చేసి గ్రామస్థాయిలో అవగాహన, పరీక్ష కార్యక్రమా లను విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు. సర్పంచ్లు, ము న్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ క మిషనర్లు టీబీనిర్మూలన కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టా లని కలెక్టర్ అన్నారు. గ్రామ సర్పంచులు గ్రామసభలో టిబిని ఒక ఎజెండాగా పెట్టుకో వాలని కోరారు.టీబి ని యంత్రణ లో భాగంగా జిల్లాలోఇప్పటికే 126 గ్రా మాలను టీబీ రహిత గ్రా మాలుగా ప్రకటించిన ప్ప టికి ఆ ప్రాంతాల్లోనూ వ్యాధి పున రావృతం కాకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అన్నా రు. ఈ ఏడాది మరో 50 శాతం గ్రామాల ను టీబీ రహిత గ్రా మాలుగా తీ ర్చిదిద్దితే జిల్లాలో సగం గ్రామా ల ను టీబీ రహిత గ్రామాలుగా ప్రకటించే అవకాశం ఉంటుందని, వచ్చే ఏడాది చివరి నాటికి జిల్లా ను పూర్తిగా టీబీ రహిత జిల్లాగా ప్రకటించే లక్ష్యంతో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూ చించారు.
టీబి నియంత్రణకు రిచ్ ఫౌండేష న్ సామాజిక బాధ్యతగా సుమా రు రూ.11 లక్షల విలువైన టీబి నిర్ధారణ పరీక్ష పరికరాలను సి ఎ స్ ఆర్ కింద అందించినట్లు వెల్ల డించారు .టీ బి వ్యాధిగ్రస్తుల సం క్షేమంలో భాగంగా టీబి సోకిన వారికి నెలకు పోషణ కోసం 100 0 రూపాయలు ఇవ్వడం జరుగు తున్నదని, టిబి వ్యాధిగ్రస్తులు ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టీబీ ని ర్మూలనకు జిల్లా యంత్రాంగం తరఫున అవసర మైన పూర్తి స హా య సహకారాలు అందిస్తామని కలెక్టర్ తెలిపారు.ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లా డుతూ ఒకప్పుడు టీబి అంటే ప్రాణాంతకమైన వ్యాధి అని భయపడేవారని, ఇప్పుడు ఆధుని క టెక్నాలజీ, మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చినందు న భయపడాల్సిన అవసరం లేదని, టీబిని వార ణ కు డాక్టర్లతోపాటు, ప్రజా ప్రతినిధులు , స్వచ్ఛంద సంస్థ లు,టిబి ముక్త్ కోసం కృషి చేసి నల్లగొండ జిల్లాలో టీబి వ్యా ధి గ్రస్తులు లేకుండా చూడాలని కో రారు.
అనంతరం జిల్లా కలెక్టర్, ఎమ్మె ల్సీలు 126 టిబి రహిత గ్రామా ల సర్పంచులకు సర్టిఫికెట్స్ అం దజే శారు.ఈ సమావేశంలో స్థా నిక సంస్థల ఇంచార్జ్ అదనపు క లెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, శిక్షణ స హాయ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధి కారి రా హుల్, టీబీ అధికారి రవిప్రసాద్, డిపిఓ త రుణ్ చక్రవర్తి, సర్పంచు లు, స్వచ్ఛంద సంస్థల ప్రతి నిధు లు, ఎంపీడీవోలు, ఎన్ సి సి వి ద్యార్థులు, న ర్సింగ్ వి ద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.



