Friday, October 9, 2026
More
    HomeIndiaSudden demise of Nana Patekar : బిగ్ బ్రేకింగ్, నానాపాటేకర్ హఠాన్మరణం, సినీలోకంలో...

    Sudden demise of Nana Patekar : బిగ్ బ్రేకింగ్, నానాపాటేకర్ హఠాన్మరణం, సినీలోకంలో తీవ్రవిషాదం

    📰 Generate e-Paper Clip

     

    Sudden demise of Nana Patekar :  ప్రజా దీవెన, గోవా: భారత సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బాలీ వుడ్ సీనియర్ నటుడు నానాపాటేకర్ (75) హఠాన్మరణం చెం దారన్న వార్త సినీ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిం ది. గోవాలోని తన ని వాసంలో గురువారం ఉదయం 5:20 గం టల సమయంలో ఆయన అపస్మారక స్థితిలో కని పిం చినట్లు సమాచారం. కుటుంబ స భ్యులు, సిబ్బంది వెంటనే ఆయ న ను సమీపంలోని ప్రైవేట్ ఆస్ప త్రికి తరలించారు.వైద్యులు గుండెపోటుగా గుర్తించి సుమారు 45 నిమిషాల పాటు సీపీ ఆర్ చేసిన ప్పటికీ ఫలితం లేకపోయినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీ సులు మెడికో-లీగల్ కేసు నమో దు చేసినట్లు తెలుస్తోంది.

    మూడు జాతీయ అవార్డులు.. పద్మశ్రీతోసత్కారం

    విశ్వనాథ్ పాటేకర్‌గా జన్మించిన నానా పాటేకర్‌ 1951 జనవ రి 1 న మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జి ల్లా మురుద్-జంజీరాలో జన్మిం చారు. 1978లో విడుదలైన ‘గ మన్’ చిత్రంతో సినీ రం గ ప్రవేశం చేశారు. అనంతరం హిందీ, మరాఠీ చిత్రాల్లో తన విలక్షణ నటన తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు .‘క్రాంతివీర్’, ‘నటసా మ్రాట్’ వంటి చిత్రాలు ఆయన కె రీర్‌లో మైలురాళ్లుగా నిలిచాయి. రజినీకాంత్ నటించిన ‘కాలా’ చి త్రంలోనూ కీలక పాత్ర పోషించా రు. ఆయన నటించిన అనేక హిందీ చిత్రాలు తెలుగులోకి డబ్ కా వడంతో తెలుగు ప్రేక్షకుల కు కూడా నానా పాటేకర్ సుపరిచి తుడయ్యారు.అసాధారణ నట నకు గాను ఆ యన మూడు జా తీయ చలనచిత్ర అవా ర్డులు, నా లుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందు కున్నారు. సినీ రం గానికి చేసిన సేవలకు గుర్తింపుగా 2013లో కేంద్ర ప్రభుత్వం ప ద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

        కార్గిల్ యుద్ధంలో 60 రోజులు

    నటుడిగానే కాకుండా దేశ సేవ ప ట్ల తన నిబద్ధతను చా టు కున్న వ్యక్తిగా కూడా నానా పాటేకర్ గు ర్తింపు పొందారు. 199 9 కార్గిల్ యుద్ధ సమయంలో సుమారు 60 రోజుల పాటు భా రత సైన్యం తో కలిసి పనిచేసినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సైన్యంలో చేరాలన్న తన కోరిక ను అప్పటి రక్ష ణ మంత్రి జార్జ్ ఫె ర్నాండెజ్‌కు తెలిపినట్లు ఆయన చెప్పుకొ చ్చారు. కమాండో కోర్సు పూర్తి చేయడంతో పాటు జాతీ య స్థాయి షూటింగ్ పోటీల్లో ప తకాలు సాధించిన విషయాన్ని వి వరించడంతో ఆర్మీతో కలిసి పని చేసే అవకాశం లభించిందని తెలి పారు.

      నమ్మలేకపోతున్నాం..ప్రముఖుల సంతాపం

    నానా పాటేకర్ మృతివార్తతో సి నీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ట్లు సమాచారం. ఆయన మరణం భారతీయ చలనచిత్ర రం గానికి తీరని లోటని పలువురు పేర్కొ న్నారు.సూపర్‌స్టార్ రజి నీకాంత్‌తో పాటు పలువురు సినీ ప్ర ముఖులు నానా పాటేక ర్‌తో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సంతాపం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రు లు రేవంత్ రె డ్డి, చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నటులు ఎన్టీఆర్, విశాల్, ప్రకాశ్ రాజ్, మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్ తదితరులు సంతాపం తెలిపినట్లు సమాచారం.

     

     

    ముగిసిన దిగ్గజనటుడి అంతిమప్రయాణం

    ముంబై: ప్రముఖ బాలీవుడ్‌ న టుడు నానా పటేకర్‌ అంత్యక్రి యలు పూర్తయ్యాయి. ఆయన సొంత ఫామ్‌హౌస్‌లో అంతి మ సంస్కారాలు నిర్వహించినట్లు స మాచారం. మహారాష్ట్ర ప్రభు త్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వ హిం చినట్లు వెల్లడైంది.దిగ్గజ నటుడి అంతిమ ప్రయాణంతో సినీ రంగంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తనదైన నట నతో ప్రేక్షకుల హృద యాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నానా పటేకర్‌ ఇక లేరనే వార్త అభిమానులను కలచివే స్తోంది. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సం తా పం వ్యక్తం చేస్తున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.