Friday, October 9, 2026
More
    Homeనల్గొండNalgonda Drda PD Shekhar Reddy : రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి

    Nalgonda Drda PD Shekhar Reddy : రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి

    📰 Generate e-Paper Clip

     

    Nalgonda Drda PD Shekhar Reddy :  ప్రజా దీవెన, నల్ల గొండ టౌన్: వానాకాలం 2026–27 ఖరీఫ్ సీజ న్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బం దు లు కలగకుండా వరి ధాన్యం కొనుగోళ్లు పా రదర్శ కంగా, సమర్థ వంతంగా నిర్వహిం చాలని జిల్లా గ్రా మీ ణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీ ఏ)-సెర్ప్ అధికారులకు డీఆర్‌డీ ఓ వై. శేఖర్ రెడ్డి సూచించారు. రైతు లకు మద్దతు ధర అందించ డంతో పాటు కొనుగోలు ప్రక్రియలో నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.

    వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు (పీపీసీ) ప్రారం భించనున్న సిబ్బం ది, పీపీసీ వీవో అధ్యక్షురాళ్లు, వీవోఏలకు శుక్రవారం నల్లగొం డలోని టి.టి.డి.సి జిల్లా మహి ళా సమాఖ్య సమావేశ మంది రంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం సేకరణ విధివిధానాలు, నాణ్యత ప్రమా ణాలు, తూకం, గన్నీ బ్యాగుల నిర్వహణ, బిల్లుల చెల్లింపులు తదితర అంశాల పై డీఆర్‌డీఓ సమగ్రంగా వివరించారు.

         జిల్లాలో 77 కొనుగోలు కేంద్రాలు

    జిల్లాలో ఇప్పటివరకు 16 మండ లాల్లో 77 వరి ధాన్యం సేకర ణ కేంద్రాలకు అనుమతులు మం జూరై నట్లు అధికారులు తె లిపారు. వర్షాల అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని కొనుగోలు కేంద్రాలను ఎత్తైన ప్రదేశాల్లో ఏర్పాటు చే యాలని, ధాన్యం త డవకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు ధా న్యం తీసుకువచ్చిన వెంటనే సీరి యల్ బుక్‌లో పే ర్లు నమోదు చేసి క్రమసంఖ్య కేటాయించాలన్నారు.

           నాణ్యత ప్రమాణాలు తప్పనిసరి

    ఎఫ్‌ఏక్యూ (FAQ) ప్రమాణాలకు అనుగుణంగా, తే మ శాతం 17లోపు ఉండి, తాలు, మట్టి పెడ్డలు లే ని ధాన్యాన్ని మాత్రమే కొ నుగోలు చేయాలని స్ప ష్టం చేశారు. రైతులు ప్యాడీ క్లీనర్‌తో ధాన్యాన్ని శు భ్రపరిచి కేంద్రాలకు తీసుకురావాలని అవగాహన క ల్పించాలన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారి (ఏ ఈఓ) ధ్రువీక రించిన ధాన్యాన్నే తూకం వేసి, ధ్రువీ కరణ అనంతరం మిల్లులకు పంపించాలని సూచిం చారు. నిబంధనలకు విరుద్ధంగా సేకరించిన ధా న్యం తిరస్కరణకు గురైతే సంబంధిత కొనుగోలు కేం ద్రం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చ రించారు.

          క్వింటాల్‌కు రూ.2,461 మద్దతు ధర

    ప్రభుత్వం నిర్ణయించిన కనీస మ ద్దతు ధరల ప్రకా రం గ్రేడ్‌-ఏ ధా న్యానికి క్వింటాల్‌కు రూ.2,461, సా ధారణ రకం ధాన్యాని కి రూ. 2,441 చెల్లించనున్నా రు. సిద్ది WGL, సాంబమసూరి BPT 5204, తెలం గాణ సోన RNR 15048, కునారం వరి-2 KNM 1638, హెచ్‌ఎంటీ సోన, జై శ్రీ రాం, JNM-7715 లే దా KNM -7715 రకాల సన్న ధాన్యానికి క్వింటాల్‌ కు అదనంగా రూ.500 ప్రోత్సాహకం అందించను న్నట్లు వివరించారు.

         అదనపు వసూళ్లకు తావులేదు

    జిల్లా యంత్రాంగం నిర్ణయించిన ప్రకారం క్వింటాల్‌ కు రూ.45 మా త్రమే హమాలీ చార్జీలుగా రైతుల నుంచి వసూలు చేయా లని, అ దనంగా డబ్బులు లేదా ధాన్యం తీసుకోరాదని స్పష్టం చేశారు. ఒ క్కో బస్తాలో 40 కిలోల 700 గ్రా ముల చొప్పున మాత్ర మే తూకం వేయాలని, తూకానికి ముందు 20 కిలో ల బాటును వెయింగ్‌ మి షన్‌పై ఉంచి ఖచ్చితత్వా న్ని రైతులకు చూపించాలని ఆదేశించారు.

    కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని 1 50 నుంచి 200 బస్తాల పరిమా ణంలో రాశులుగా ఏర్పాటు చే యాలని, గన్నీ బ్యాగులు వచ్చిన వెంటనే వాటిని లెక్కించాలని సూచించారు. ధాన్యం మిల్లులో అన్‌ లోడ్‌ అయిన తర్వాత మరు సటి రోజు సంబంధిత సభ్యులు ట్రక్‌ చిట్‌ తీసుకురావాలన్నారు. కింద ప డిన ధాన్యాన్ని సేకరించి ట్రక్కులో వేయాలని, తిరి గి బస్తా ల్లో నింపరాదని పేర్కొన్నారు. గన్నీ బ్యాగు ల నష్టానికి సంబంధించి నిబంధనల ప్రకారం బా ధ్యుల కమిషన్‌ నుంచి కోతలు విధించే అవకాశం ఉందని వివరించారు.

        బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వద్దు

    ట్రక్‌ చిట్‌ అందిన వెంటనే ట్యాబ్‌ ఆపరేటర్లు సం బంధిత ఎంట్రీ ల ను పూర్తి చేసి, మరుసటి రోజు బిల్లులు సమర్పించాలని డీ ఆర్‌డీఓ సూచించారు. రైతులకు చెల్లింపులు జరిగే విషయం లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించ రాదన్నారు. కొనుగోలు కమిటీ సభ్యులు తమ విధులు, బాధ్య తలను సమర్థ వంతం గా నిర్వర్తిస్తూ కేంద్రాల నిర్వహణను విజయవంతం చేయాలని ఆదేశించారు.

    పీపీసీ దరఖాస్తు ఫారాన్ని కొనుగోలు కమిటీ సభ్యులు, హమా లీల కు పూర్తిగా చదివి వినిపించిన అ నంతరం వీవో తీర్మానం చేసి పంపించాలని సూచిం చారు. కొను గోళ్లలో సమస్యలు తలెత్తకుండా గ్రామస్థాయిలో పీపీసీ ఇన్‌చార్జి, గ్రామపంచాయ తీ కా ర్యదర్శి, సర్వేయర్‌ లేదా వ్యవసాయ విస్తరణ అధి కారి తో కమిటీ ఏర్పాటు చేయాలని తెలిపారు.

    ఈ శిక్షణ కార్యక్రమంలో అదనపు డీఆర్‌డీఓ ఎం. శ్రవణ్ కు మార్, జిల్లా మహిళా సమాఖ్య అధ్య క్షు రాలు ఏ. మాధవి, కోశాధికారి వై. సునీత, డీపీఎం (నాన్‌- ఫా మ్‌) పి. వీరయ్య, జిల్లాలోని డీ పీఎంలు, ఏపీఎంలు, సీసీలు, మార్కెటింగ్‌ ఎస్‌ సీఆర్‌పీలు జా నకమ్మ, నాగలక్ష్మి, రేణుక, శాంత, స్వాతి, నిర్మ ల, దీ పిక తదితరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.