Sunday, October 11, 2026
More
    HomeIndiaMinister Komatireddy Venkat Reddy key words on Srisailam Tunnel : మంత్రి కోమటిరెడ్డి...

    Minister Komatireddy Venkat Reddy key words on Srisailam Tunnel : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీ లక ప్రకటన, 2028 జూన్ నాటికి శ్రీశైలం సొరంగమార్గం పూర్తి చే యడమే నా జీవిత లక్ష్యం

    📰 Generate e-Paper Clip

    –నల్లగొండ జిల్లాలో ప్రతి గ్రామా నికి డబుల్ రోడ్డు
    –గుడిసెలు లేని తెలంగాణే ధ్యేయం
    –రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

    Minister Komatireddy Venkat Reddy key words on Srisailam Tunnel : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా ప్రజల తాగునీటి సమస్య కు ఉపశమనం కల్పించడంతో పా టు, రైతులకు సాగునీటి భద్రత కల్పించి ఫ్లోరైడ్ సమస్యకు శా శ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా శ్రీశైలం సొరంగ మార్గం (ఎస్‌ఎల్‌బీసీ) పనులను వేగవంతం చేస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రె డ్డి తెలిపారు. 2028 జూన్ నాటికి సొరంగ మార్గం పనులు పూ ర్తి చేయడం తన జీవిత లక్ష్యమని స్పష్టం చేశారు. దీంతో రైతు లకు రెండు పంటలకు సాగునీరు అం దించేందుకు మార్గం సు గమమవుతుందని పేర్కొన్నారు. జిల్లాలో మౌలిక వసతుల అ భివృద్ధిలో భాగంగా ఆదివారం కనగల్ మండలంలో సుమారు రూ. 74 కోట్ల అంచనా వ్య యంతో చేపట్టనున్న రహదారుల విస్తరణ, పటిష్టపరిచే పను లకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులు, సాగునీటి ప్రాజెక్టులు, ఇం దిరమ్మ ఇళ్లు, ప్రజా సంక్షేమ పథకాలపై మాట్లాడారు.

     

       రూ.74 కోట్లతో రహదారుల అభి వృద్ధి

    కనగల్ మండలం తెలకంటిగూ డెం వద్ద రూ.41 కోట్లతో తెల కం టిగూడెం నుంచి తొరగల్లు, జంగ మాయిగూడెం మీదుగా ముషం పల్లి వరకు రహదారి విస్తరణ, ప టిష్టపరిచే పనులకు మంత్రి శం కుస్థాపన చేశారు. అలాగే షేరి లింగోటం వద్ద రూ.3 3 కోట్లతో న ల్లగొండ–నిడమనూరు రహదారి నుంచి చెట్లచె న్నారం, చిన్నమా దారం, తంగెళ్లవారిగూడెం మీదుగా ముషం పల్లి వరకు చేపట్టను న్న రహదారి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

    నల్లగొండ జిల్లాలో ఇప్పటికే సు మారు రూ.1,600 కోట్లతో రహ దారుల నిర్మాణం చేపట్టినట్లు మంత్రి తెలిపారు. రూ.900 కోట్ల తో నల్లగొండ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతు న్నాయని చెప్పారు. రహదారు లు మెరుగుపడితే పరిశ్రమలు, రై స్ మిల్లుల ఏర్పాటుకు అవకాశా లు పెరుగుతాయని, రవా ణా సౌకర్యాలు మెరుగై యువతకు ఉ ద్యోగావకాశాలు లభిస్తా యని వివరించారు. భూముల విలువ కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి గూడెం, గ్రామానికి డబుల్ రోడ్డు సౌకర్యం క ల్పించడమే లక్ష్యమని వెల్లడిం చారు.

    ఎస్‌ఎల్‌బీసీ పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు

    గత ప్రభుత్వ హయాంలో నిలి చి పోయిన ఎస్‌ఎల్‌బీసీ సొరం గ మార్గం పనులను ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన త ర్వాత తిరిగి ప్రారంభించామని మంత్రి తెలిపారు. ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి సహకారంతో పనులు కొనసాగుతున్నాయని, ఇ ప్పటివరకు సుమారు 800 మీటర్ల మేర పనులు పూర్తయ్యా యని చెప్పారు.సొరంగ మార్గం పూర్తయితే దేవరకొండ, మును గోడు ప్రాంతాలకు సాగునీరు అం దించడంతో పాటు, నల్లగొండ ని యోజకవర్గంలో సుమారు 2.30 లక్షల ఎకరాలకు సాగునీటి సౌక ర్యం కల్పించే అవకాశం ఉంటుం దని తెలిపారు. ప్రజలకు తాగునీ టి భద్రత చేకూరడంతో పాటు ఫ్లోరైడ్ సమస్య పరి ష్కారానికి దో హదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గంధమల్ల, బస్వాపురం ప్రాజెక్టుల పనులను కూడా వేగవం తం చేస్తామని వెల్లడించారు.

      జాతీయ రహదారుల అభివృద్ధికి చర్యలు

    తెలంగాణలో రహదారులను దే శానికే ఆదర్శంగా నిలిచేలా అ భివృద్ధి చేస్తామని కోమటిరెడ్డి వెంక ట్‌రెడ్డి తెలిపారు. హైద రా బాద్‌ – విజయవాడ జాతీయ రహదారి అభివృద్ధికి రూ.12 వే ల కోట్లు మంజూరు చేయించినట్లు చెప్పా రు. జాతీయ రహ దారులపై గుర్తించిన 17 ప్రమాదకర ప్రాంతాల్లో అభివృద్ధి పను లు చేపడుతున్నామని, వచ్చే సంక్రాంతి నాటికి వాటిని పూర్తి చేయాలని లక్ష్యం గా పెట్టుకున్నట్లు వివరించారు. యాదాద్రి–భువనగిరి రహదారి పనులను నవంబర్ నాటికి పూర్తి చేస్తామ ని తెలిపారు.

        అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

    గుడిసెలు లేని తెలంగాణ నిర్మిం చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్య మని మంత్రి పేర్కొన్నారు. తెలకంటి గూడెంలో ఇప్పటికే 107 ఇందిర మ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. గ్రామంలో ఇంకా ఇళ్లు మంజూరు కాని అర్హులైన కుటుం బాలకు కూడా ఇ ళ్లు అందించేం దుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎల్‌ -1, ఎల్‌-3 కేటగిరీ ల్లో సాంకేతిక సమస్యలు ఎదురై నా అర్హుల కు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇళ్ల పట్టా లు లేని వడ్డెర కులస్తులకు పట్టాలు అందించినట్లు వివరిం చా రు.

    ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వా త రేషన్ కార్డులు, ఉచిత వి ద్యుత్, సన్నబియ్యం పంపిణీ, స్వ యం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, మహిళలకు ఉచి త బస్సు ప్రయాణం, రై తులకు రూ.2 లక్షల వరకు పంట రుణ మాఫీ వంటి పథకాల ను అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. బ తుకమ్మ పండుగ సందర్భంగా మ హిళలకు చిలకపచ్చ రంగు చీరలు అందిం చేందుకు ప్రభుత్వం చ ర్యలు తీసుకుంటోందని చెప్పారు.

      నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి

    ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గి కరువు పరిస్థితులు ఏర్పడే అవ కాశం ఉన్నందున ప్రజలు నీటిని పొదుపుగా వినియోగిం చుకోవా లని మంత్రి విజ్ఞప్తి చేశారు. తాగు నీటిని వృథా చేయ కుండా కాపాడుకోవాలని, పంటలను రక్షించుకునేందుకు నీటి వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని రైతుల కు సూచించా రు. నాగార్జునసాగ ర్‌లో నీటి నిల్వలు తక్కువగా ఉ న్నప్పటికీ, పరిసర గ్రామాల తా గునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని చెరువులను నింపేం దుకు చర్యలు తీసుకున్నట్లు తెలి పారు. రైతులు సంతోషంగా ఉం డాలని, పేదల ముఖాల్లో చిరున వ్వులు చూడాలన్నదే తన ఆకాం క్ష అని మంత్రి పేర్కొన్నారు. శ్రీశై లం సొరంగ మార్గాన్ని నిర్దేశిత గ డువులో పూర్తి చేసి ప్రతి ఎకరా కు సాగునీరు అందించేందుకు కృ షి చేస్తానని స్పష్టం చేశారు.

     

    ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ ఈ మోహన్, ఆర్డీవో వై. అశోక్‌రె డ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీధర్‌రెడ్డి, కనగల్ తహసీల్దార్ పద్మ, ఎంపీ డీవో వేద రక్షిత, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్‌రెడ్డి, మాజీ ము న్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచులు, ఇతర ప్రజాప్రతిని ధులు, అధికారులు పాల్గొన్నారు.

    Minister Komatireddy Venkat Reddy key words on Srisailam Tunnel

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.