Monday, October 12, 2026
More
    HomeOpinionIndia Japan Friendship strengthen : భారత్, జపాన్ స్నేహబంధానికి కొత్త బాటలు

    India Japan Friendship strengthen : భారత్, జపాన్ స్నేహబంధానికి కొత్త బాటలు

    📰 Generate e-Paper Clip

    –పారిశ్రామిక, సాంకేతిక, విద్యా రంగాల్లో సహకారం విస్తరించాలి
    –శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ లు

    India Japan Friendship strengthen  : ప్రజా దీవెన, హైద రాబాద్: భారత్–జపాన్ దేశాల మధ్య దశా బ్దాలుగా కొనసా గుతున్న స్నేహ సంబంధాలను మరింత బలో పే తం చేస్తూ, తెలంగాణ– జపా న్‌ లోని హిరోషిమా ప్రాంతాలమధ్య పారిశ్రామిక, సాంకేతిక, విద్యా, ప రిశోధన రంగాల్లో పరస్పర సహ కారాన్ని విస్తరించుకోవాలని తె లంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆ కాంక్షించారు. అంతర్జాతీయ శా సనసభల మధ్య పరస్పర అ వగాహన, సహకారం ప్రజాస్వా మ్య వ్యవస్థల బలోపేతానికి దో హదపడతాయని వారు పేర్కొ న్నారు. తెలంగాణ శాసనసభను సోమవారం జపాన్‌లోని హిరోషి మా ప్రిఫెక్చరల్ అసెంబ్లీ, ప్రభుత్వ ప్రతినిధుల బృందం సందర్శించిం ది. ఈ సందర్భంగా అసెంబ్లీలో ని ర్వహించిన ప్రత్యేక సమావేశం లో తెలంగాణ–జపాన్ ప్రాంతాల మధ్య స్నేహ సంబంధాలు, పె ట్టుబడుల అవకాశాలు, సాం కే తిక పరిజ్ఞాన మార్పిడి, ప్రజాస్వా మ్య సంస్థల పనితీరు వంటి అం శాలపై చర్చించారు. జపాన్ ప్ర తినిధులకు తెలంగాణ శాసన స భ తరఫున ఘన స్వాగతం పలి కారు.

    యువతకు ఉపాధి కల్పించే పరిశ్రమలకు ప్రోత్సాహం

    భారత్, జపాన్ దేశాల మధ్య సు దీర్ఘకాలంగా కొనసాగుతున్న సం బంధాలు పరస్పర విశ్వాసం, గౌ రవం, సహకారానికి ప్రతీ కలుగా నిలుస్తున్నాయని శాసన మండ లి చైర్మన్ గుత్తా సు ఖేందర్ రెడ్డి అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, పారిశ్రామిక అ భివృద్ధి, క్రమశిక్ష ణ, పరిశోధనలు, నూతన ఆవి ష్కరణల్లో జ పాన్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు సమాచార సాంకేతిక త, ఫార్మా, వ్యవసాయం, వై ద్యం, విద్య, మౌలిక సదుపాయా ల రంగాల్లో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపా రు. ఈ నేపథ్యంలో తెలంగాణ, హిరో షిమా ప్రాంతాల మధ్య పా రిశ్రామిక, సాంకేతిక, విద్యా, సాం స్కృతిక సంబంధాలను మరింత విస్తరించుకోవాల్సిన అవస రం ఉందన్నారు.

    రెండో ప్రపంచ యుద్ధంలో తీవ్ర వి ధ్వంసాన్ని ఎదుర్కొన్న హిరో షి మా నగరం తిరిగి అభివృద్ధి పథంలో పయనిస్తూ ప్రపంచా నికి శాంతి, పునర్నిర్మాణం, పట్టుదల కు ప్రతీకగా నిలిచిందని పేర్కొ న్నారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి, సామరస్యం, సుస్థిర అభివృద్ధి సాధించాలంటే దేశాల మధ్య స హకారం కీలకమని స్పష్టం చేశా రు. తెలంగాణలో జపాన్ పెట్టుబడు లు మరింత పెరగాలని, యువత కు ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమ లు, నైపుణ్యాభివృద్ధి సం స్థల ఏర్పాటుకు ఇరు ప్రాంతాలు కలి సి పనిచేయాలని సూచించా రు. ప్రజాస్వామ్య విలువలు, శా సన ప్రక్రియలు, పరిపాలనా వి ధానాలపై పరస్పర అనుభవాల ను పంచుకోవడానికి ఇలాంటి సమావేశాలు ఉపయోగపడతా యని తెలిపారు. హైదరాబాద్‌కు జపాన్‌లోని మియోషి నగరం తో ఉన్న సోదర నగర సంబంధాలు ఇరు ప్రాంతాల మధ్య అనుబంధానికి నిదర్శనమని పేర్కొన్నారు.

    తెలంగాణ మానవ వనరులు కలిస్తే అద్భుత ఫలితాలు

    తెలంగాణ, హిరోషిమా ప్రాంతాల మధ్య సాంకేతిక పరిజ్ఞానం, పరి శ్రమలు, విద్య, పరిశోధనలు, ఆ విష్కరణల రంగాల్లో విస్తృత అ వకాశాలు ఉన్నాయని శాసనస భ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. హైదరాబాద్ అంతర్జాతీయ స్థా యిలో ఐటీ, ఫార్మా, బ యోటెక్నాలజీ, పరిశోధన, పారి శ్రామిక రంగాలకు ప్రధాన కేంద్రం గా ఎదుగుతోందని వివరించారు.
    జపాన్ పారిశ్రామిక సంస్థలు తె లంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆ యన కోరారు. ముఖ్యంగా ఆటో మొబైల్, ఎలక్ట్రానిక్స్, సెమీకం డక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, అధు నాతన తయారీ రంగాల్లో జపాన్ సాంకే తిక నైపుణ్యాన్ని తె లంగాణలోని మానవ వనరులతో అనుసంధా నిస్తే ఇరు ప్రాం తాలకు ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు.

     

    తెలంగాణ శాసనసభ, హిరోషి మా ప్రిఫెక్చరల్ అసెంబ్లీ మధ్య స భా నిర్వహణ, శాసన విధానా లు, కమిటీల పనితీరు, ఆధు నిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పై అనుభవాలను పంచు కోవడం ప్రయోజనకరమని తెలిపారు. ప్రతినిధుల పర్యట న లు, అధ్య య న కార్యక్రమాలు, పరస్పర చర్చలను మరింత విస్తరించాలని ఆ కాంక్షించారు.క్రమశిక్షణ, సమయపాలన, సాంకేతిక నైపుణ్యం, వి పత్తుల నిర్వహణ వంటి అంశా ల్లో జపాన్ అనుభవాల నుంచి నే ర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయని స్పీకర్ పేర్కొన్నారు. విద్యార్థులు, పరిశోధకులు, పా రి శ్రామికవేత్తలు, సాంకేతిక నిపు ణుల పరస్పర మార్పిడి కార్యక్ర మాలను ప్రోత్సహించాలని సూ చించారు.

    హిరోషిమా నగరం విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు సాగిన ప్ర యాణం శాంతి, సహనం, మాన వత్వం ప్రాముఖ్యతను ప్రపం చా నికి చాటిచెబుతోందని అన్నారు. ఈ సమావేశం అధికారిక పర్యట నకే పరిమితం కాకుండా తెలంగా ణ–జపాన్ ప్రాంతాల మధ్య భవి ష్యత్తు భాగస్వామ్యానికి బలమై న పునాదిగా నిలవాలని ఆకాం క్షించారు.ఈ సమావేశంలో శాస న మండలి డిప్యూటీ చైర్మన్ బం డ ప్రకాష్, శాసన మండలి కార్య దర్శి డా. నరసింహాచార్యులు, శా సనసభ కార్యదర్శి ఆర్. తిరుప తి, జపాన్ ప్రతినిధుల బృందం సభ్యులు, శాసనసభ, శాసన మం డలి ఉన్నతాధికారులు పా ల్గొన్నారు.తెలంగాణలో జపాన్ పెట్టుబడులకు ప్రోత్సాహం, యు వతకు ఉ పాధి అవకాశాల విస్త రణ, సాంకేతిక పరిజ్ఞాన మార్పి డి, ప్రజా స్వామ్య సంస్థల మధ్య పరస్పర సహకారం వంటి అంశా లకు ఈ పర్యటన మ రింత ఊత మిస్తుందనే ఆశాభావం వ్యక్తమైంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.