Monday, October 12, 2026
More
    HomeOpinionDoctor Hemalatha elected Nalgonda Red Cross Chairperson : నల్లగొండ రెడ్‌క్రాస్‌కు తొలి మహి...

    Doctor Hemalatha elected Nalgonda Red Cross Chairperson : నల్లగొండ రెడ్‌క్రాస్‌కు తొలి మహి ళా చైర్మన్‌గా డాక్టర్ హేమలత

    📰 Generate e-Paper Clip

    –కీలక పదవులన్నీ ఏకగ్రీవం నూ తన కమిటీపై సభ్యుల్లో హర్షం

     Doctor Hemalatha elected Nalgonda Red Cross Chairperson :  ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ చరి త్రలో నూతన అధ్యాయం ఆవి ష్కృత మైంది. సొసైటీ తొలి మ హిళా చైర్మన్‌గా డాక్టర్ హేమలత ఎం పికయ్యారు. కీలక పదవుల కు పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎ న్నిక కావడంతో నూతన నాయకత్వం కొలువుదీరింది. చైర్మన్‌ గా డాక్టర్ హేమలత, వైస్ చైర్మన్‌గా భీమనపల్లి శ్రీకాంత్, ట్రెజ రర్‌గా కుంభం జ్యోతిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా మంచుకొం డ చిన్న బిక్షమయ్య ఎంపికయ్యారు.నామినేషన్ల దాఖలుకు కేటాయిం చిన పది నిమిషాల గడువులో ఈ పదవులకు పోటీ గా ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపో వడంతో వీరి ఎం పిక ఏకగ్రీవంగా పూర్తయింది.

     

       సేవా కార్యక్రమాలపై కొత్త ఆశలు

    నల్లగొండ రెడ్‌క్రాస్ సొసైటీకి నూ తన నాయకత్వం రావడంతో స భ్యుల్లో హర్షం వ్యక్తమవుతోంది. మానవతా సేవలను మరిం త వి స్తరించడం, పేదలకు వైద్య సహా యం అందించడం, రక్త దాన కా ర్యక్రమాలను బలోపేతం చేయడం, సొసైటీ అభివృ ద్ధి కి కొత్త ది శానిర్దేశం చేయడంపై నూతన క మిటీ దృష్టి సారి స్తుందనే ఆశాభా వం వ్యక్తమవుతోంది.సేవా స్ఫూర్తితో ప్రజ కు  మరింత చేరువగా రెడ్‌క్రాస్ సేవలను తీసుకెళ్లడంలో నూతన కమిటీ కీలక పాత్ర పోషి స్తుందని సభ్యులు ఆశిస్తున్నారు. నల్ల గొండ రెడ్‌క్రాస్ సొసైటీ భవి ష్యత్ ప్రస్థానంలో ఈ నూతన నా యకత్వం ఎలాంటి మార్పులు తీ సుకొస్తుందోనన్న ఆసక్తి నెల కొంది.

    Doctor Hemalatha elected Nalgonda Red Cross Chairperson

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.