Saturday, October 17, 2026
More
    HomeOpinionMinister Ponguleti Srinivasa Reddy : బిగ్ బ్రేకింగ్, మంత్రి పొంగులేటి కీ లక ప్రకటన,...

    Minister Ponguleti Srinivasa Reddy : బిగ్ బ్రేకింగ్, మంత్రి పొంగులేటి కీ లక ప్రకటన, మూడు దశల్లో తె లంగాణ సమగ్ర భూసర్వే ప్రతి భూమికి ప్రత్యేక భూదార్

    📰 Generate e-Paper Clip

    –285 గ్రామాల్లో సర్వే పూర్తి అ భ్యంతరాల స్వీకరణకు నోటీసు లు

    –వచ్చే నెలాఖరుకు తొలి దశ పూర్తి లక్ష్యం, మరో 400 రోవర్ల కొనుగోలుకు టెండర్లు ఖరారు

    — త్వరలో పాలేరు నియోజకవ ర్గంలో భూదార్ పట్టాల పంపిణీ

    Minister Ponguleti Srinivasa Reddy : ప్రజా దీవెన, హైద రాబాద్: తెలంగాణ లో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడం, ప్రతి భూ కమతానికి కచ్చితమైన హద్దులు నిర్ణ యించడం, భూయా జ మాన్య హక్కులపై స్పష్టత తీసుకురా వడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర భూ రీసర్వేను వేగ వంతం చేస్తోంది. ఈ సర్వే ను మూడు దశల్లో పూర్తి చేయను న్నట్లు రెవెన్యూ, గృహ ని ర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇప్పటికే 285 రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్త యిందని, భూ యజమా నుల అభ్యంతరాల స్వీకరణకు నోటీసులు జారీ చేసినట్లు తెలి పారు.వచ్చే నెలాఖరు లోగా తొలి దశ సర్వేను పూర్తి చేసేందు కు అధికారులు సన్నా హాలు చేస్తున్నారని మంత్రి పేర్కొ న్నా రు. సర్వే ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ఇప్పటికే అందుబాటులో ఉన్న 411 రోవర్లకు అదనంగా మరో 400 రో వర్ల కొనుగోలుకు టెండర్లు ఖరారయ్యాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా భూ స మస్యలు లేని తెలంగాణ నిర్మాణానికి ప్రభుత్వం సమగ్ర రీస ర్వే చేపట్టిందని మంత్రి తెలిపారు. శనివారం డాక్టర్ బీఆర్ అం బేద్కర్ సచివాలయంలో రెవె న్యూ అధికారులతో నిర్వహించి న సమీక్షలో ఆయన సర్వే పురోగతిని పరిశీలించారు.

    రాష్ట్రంలో మొత్తం 10,954 రెవె న్యూ గ్రామాలు ఉండగా, తొలి ద శలో హైదరాబాద్ మినహా మిగి లిన 32 జిల్లాల్లో జిల్లాకు 7 0 గ్రా మాల చొప్పున, మ్యాపులు అం దుబాటులో లేని గ్రామా లను కలుపుకొని మొత్తం 2,720 గ్రామాల్లో సర్వే నిర్వహిస్తు న్నట్లు వివరించారు. ఇప్పటివరకు 285 గ్రామాల్లో సర్వే పూర్త యిందని తెలి పారు.భూమి రైతుకు కేవలం ఆస్తి మాత్రమే కా దని, అది అతని జీవనాధారమని మంత్రి పేర్కొన్నారు. ప్రతి అంగుళం భూమికి స్పష్టమైన హద్దులు, ప్రతి సర్వే నంబర్‌కు ప్రత్యేక భూదార్, ప్రతి రైతుకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

    ఆధునిక సాంకేతికతతో భూముల కొలతలు

    రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ 1936 నాటి నిజాం కా లం సర్వే రికార్డులే ఆధారంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. కాలక్రమేణా భూముల విభజనలు, సర్వే నంబర్ల ఉపవిభా గాలు, ప ట్టణీకరణ విస్తరణ, పరిపాలనా సరిహద్దుల్లో మార్పు ల కారణంగా భూముల అసలు హద్దులపై అనేక సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు.ఈ సమస్యలకు పరిష్కారం గా సంప్రదాయ కొలత పరికరాలకు బదులుగా డీజీపీఎస్, రో వర్లు, జీఐఎస్, క్యూ జీఐఎస్ వంటి ఆధునిక సాంకేతిక పరి జ్ఞానాన్ని వినియోగిస్తు న్న ట్లు చెప్పారు. దీనివల్ల భూముల కొ లతల్లో కచ్చితత్వం పెరగడంతో పాటు సర్వే వివరాలను డిజి టల్ రూపంలో భద్రపరచవచ్చని పేర్కొన్నారు.

    ప్రతి భూమికి ప్రత్యేక భూదార్ నంబర్

    రీసర్వే పూర్తయిన అనంతరం ప్రతి భూకమతానికి కచ్చితమై న సరిహద్దులు నిర్ణయించి, ప్రతి సర్వే నంబర్‌కు ప్రత్యేక భూ దార్ నంబర్ కేటాయించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆధా ర్ తరహాలో ప్రతి భూమికి ప్రత్యేక గుర్తింపునిచ్చేలా భూదార్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు.డీజీపీఎస్ ద్వారా సేక రించిన సమాచా రా న్ని క్యూజీఐఎస్ సాఫ్ట్‌వేర్‌లో నిక్షిప్తం చేసి, భూ భారతి పోర్టల్‌లో నమోదు చేస్తామని వివరించారు. తెలం గాణ ప్రాంతంలో 1948 నాటికి సుమారు 40 లక్షల సర్వే నం బర్లు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 2.29 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని సర్వే నంబర్లకు దశలవారీగా భూదార్ నంబర్లు కేటాయించేందుకు కార్యాచరణ రూపొందిం చినట్లు తెలిపారు.

    పాలేరులో త్వరలో భూదార్ పట్టాల పంపిణీ

    తన సొంత నియోజకవర్గమైన పాలేరులోని నేలకొండపల్లి మం డలం కొంగర గ్రామ పరిధిలో 66 5 ఎకరాల్లో వందశాతం రీస ర్వే విజయవంతంగా పూర్తయిందని మంత్రి పొంగులేటి శ్రీని వాసరెడ్డి వెల్లడించారు. ఈ గ్రామంలో త్వ రలో భూదార్ పట్టా ల పంపిణీ చేపట్టనున్నట్లు తెలిపారు.సమగ్ర రీసర్వే ద్వారా ప్ర తి భూకమతా నికి ప్రత్యేక సర్వే పటాలు సిద్ధమ వుతాయని, భవిష్యత్తులో భూ ముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రే షన్లు, మ్యు టేషన్ల సమయంలో ఎదురయ్యే సమస్యలు తగ్గుతాయని ఆ శాభావం వ్యక్తం చేశారు.

    సర్వేకు ముందు రైతులకు నోటీసులు తప్పనిసరి

    భూ రీసర్వే నిర్వహణలో అధికా రులు తప్పనిసరిగా పాటిం చాల్సిన విధానాలపై మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశా రు. సర్వేకు వెళ్లే ముందు సంబంధిత పట్టా దారులకు ముంద స్తు నోటీసులు ఇవ్వాలని, సర్వేకు ఒకటి రెండు రోజుల ముం దు గ్రామాల్లో చాటిం పు చేయాలని సూచించారు. దీంతో భూ యజమానులు అందుబాటులో ఉండి తమ భూముల హద్దు లను నిర్ధారించుకునే అవ కాశం ఉంటుందని తెలిపారు. ప్రభు త్వ భూములకు స్పష్టమైన మార్కింగ్ చేయడంతో పాటు గ్రా మకంఠం హద్దులను నిర్ధారించిన తర్వాతే సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు భూముల మ ధ్య ఎలాంటి గందరగోళం తలెత్తకుండా క్షేత్రస్థాయిలో స్పష్టత తీసుకురా వా లని సూచించారు.

       అభ్యంతరాల పరిష్కారానికి ప్రాధాన్యం

    సర్వే పూర్తయిన గ్రామాల్లో భూ యజమానుల నుంచి వచ్చే అ భ్యంతరాలను నిబంధనల ప్రకా రం స్వీకరించి, క్షుణ్ణంగా పరి శీలించి పరిష్కరించాలని మంత్రి స్ప ష్టం చేశారు. సర్వే ప్రక్రియ లో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ప్రజల అభిప్రాయాలను పరి గణన లోకి తీసుకోవాలని అధికారులకు సూచించారు.భూ రీ సర్వేను కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజల జీవి తాలను ప్ర భావితం చేసే కీలక బాధ్యతగా అధికారులు గుర్తిం చాలని అన్నారు. నిర్ణీత లక్ష్యాలకు అనుగుణంగా సమన్వ యంతో, అంకితభా వంతో పనిచేసి సర్వేను విజయవంతంగా పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.భూముల హద్దులపై స్పష్ట త.. యాజమాన్య హక్కు లకు భరోసా.. తరతరాలుగా కొ న సాగుతున్న వివాదాలకు పరిష్కారం అందించే దిశగా సమగ్ర భూ రీసర్వేను ప్రజలకు ఇబ్బం దులు కలగకుండా పూర్తి చే యాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

    Minister Ponguleti Srinivasa Reddy

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.