Tuesday, October 27, 2026
More
    Homeవరంగల్ గ్రామీణ జిల్లాGram Panchayat Secretary Bribery Case : బిగ్ బ్రేకింగ్, లంచం కేసులో గ్రామపంచాయతీ కార్యదర్శికి...

    Gram Panchayat Secretary Bribery Case : బిగ్ బ్రేకింగ్, లంచం కేసులో గ్రామపంచాయతీ కార్యదర్శికి రెండేళ్ల జైలుశిక్ష

    📰 Generate e-Paper Clip

    –రూ.4 వేల లంచం తీసుకున్న కే సులో కోర్టు తీర్పు
    –రూ.10 వేల జరిమానా కూడా విధింపు

    Gram Panchayat Secretary Bribery Case : ప్రజా దీవె న, వరంగల్: ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం డిమాం డ్ చేసే అధికారులపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ రం గల్ జిల్లాలో వెలువడిన ఓ కో ర్టు తీర్పు స్పష్టం చేసింది. శా యంపేట గ్రామ పంచాయతీ కా ర్యదర్శిగా పనిచేసిన కుర్రు కు మార స్వామికి లంచం కేసులో రెండేళ్ల కఠిన కారాగార శిక్షతో పా టు రూ.10 వేల జరిమానా విధి స్తూ వరంగల్ జిల్లా ప్రత్యేక న్యా యస్థానం తీర్పు వెలువరించింది. వరంగల్ జిల్లా ఎస్‌పీ ఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి, మూడవ అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి క్షమ దేశ్‌పాండే ఈ నెల 26న తీ ర్పు ప్రకటించా రు. క్రైమ్ నంబర్ 10/ACB-W RL/2008కు సంబంధించిన సీసీ నంబర్ 05/2024 కేసులో నింది తుడిని దోషిగా నిర్ధారించారు. అ వినీతి నిరోధక చట్టం, 1988 లో ని సెక్షన్లు 7, 13(2), సెక్షన్ 13(1)(d)తో కలిపి వర్తించే నిబం ధన ల కింద శిక్ష విధించారు.

    రూ.25,500 అద్దె బిల్లు కోసం రూ.4,000 లంచం

    2008 సెప్టెంబర్ 6న శాయంపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి గా విధులు నిర్వహిస్తున్న సమయంలో కుర్రు కుమార స్వామి ఫిర్యా దుదారుడి నుంచి రూ.4,000 లంచం డిమాండ్ చేసి స్వీ కరించి నట్లు కేసులో తేలింది. పశువైద్య శాల నిర్వహిస్తున్న భవనానికి సంబంధించిన సుమారు రూ. 25,500 అద్దె బిల్లు ను సిద్ధం చే సి, ఆ మొత్తానికి చెక్కు అందిం చేందుకు లంచం తీసుకున్నట్లు అభియోగాలు నమోదయ్యాయి. విచారణ అ నంతరం కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ శిక్ష ఖరారు చే సింది.

    లంచం అడిగితే 1064కు ఫిర్యాదు చేయండి

    ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు తె లంగాణ అవినీతి నిరోధక శాఖ ను సంప్రదించి ఫిర్యాదు చే యాలని అధికారులు సూచించారు.ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 వాట్సాప్ 9440446106, ఫేస్‌ బుక్ Telangana ACB ,ఎక్స్ ( ట్విట్టర్) @Telangana ACB తో పాటు ప్రభుత్వ కా ర్యాలయాలు, ప్రధాన బహిరంగ ప్రదేశాల్లో ఏసీబీకి సంబం ధిం చిన క్యూఆర్ కోడ్‌లను కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఫిర్యాదుదారుల పేర్లు, వ్యక్తిగత వివరాలను గోప్యం గా ఉంచుతా మని స్పష్టం చేశారు. లంచరహి తపాలనకు ప్రజ ల సహకారం కీలకం. లంచం అడిగే వారిపై చ ట్టపరమైన చర్య లు తీసుకునేందుకు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని ఏసీబీ సూ చిస్తోంది.

    Gram Panchayat Secretary Bribery Case

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.