Tuesday, October 27, 2026
More
    HomeOpinionSIR Document Verification : సర్ ప్రక్రియలో ధ్రువపత్రాల పరి శీలన ప్రధానమైనది

    SIR Document Verification : సర్ ప్రక్రియలో ధ్రువపత్రాల పరి శీలన ప్రధానమైనది

    📰 Generate e-Paper Clip

    — జిల్లా ఓటరు జాబితా పరిశీలకురాలు, రాష్ట్ర కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ శ్రీదేవసేన

    SIR Document Verification : ప్రజా దీవెన, నల్లగొండ: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భా గంగా ఫారా లు,ధ్రువపత్రాల పరిశీలన ముఖ్యమని నల్గొండ జి ల్లా ఓటరు జాబితా ఎన్నికల పరిశీల కురా లు మరియు రాష్ట్ర కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ శ్రీదేవసేన అన్నారు. కొత్త ఓటర్ల నమోదు, ఓటరు జాబితాలో తొలగింపులు ,మార్పుచే ర్పులను జాగ్రత్తగా పరిశీలించి చేయాలని చెప్పారు. మంగళ వారం ఆమె నల్గొండ జిల్లా మునుగోడులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని 171వ పోలింగ్ కేంద్రంలో “సర్” ప్రక్రి యను పరిశీలించారు.


    బిఎల్ఓ పద్మ తో ముఖాముఖి మాట్లాడుతూ సర్ ప్రక్రియ ని ర్వహణ తీరును అడిగి తెలుసుకు న్నారు. సర్ లో భాగంగా ఓటరు నమోదు,ఫారాల పరిశీలన, కొత్త ఓటర్ల నమోదు, మా ర్పులు చే ర్పులకు వచ్చిన ఫారాలు,జారీ చేసిన నోటీస్ లు గు రించి అడిగా రు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సర్ షె డ్యూలు ధ్రువ ప త్రాలు పరిశీలించిన విషయాన్ని అడిగి తెలు సుకున్నారు. కొత్తగా ఓటరు నమోదుకై ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు ,వాటి పరిశీలన ధ్రువపత్రాల పరిశీలన, మ్యా పిం గ్ కానీ ఓటర్ల విషయం లో తీసుకున్న నిర్ణయాలు, ధ్రువ పత్రా ల ఆధారంగా ఇల్లిల్లు పరిశీ లన, ఎలా నిర్ధారణ చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అలాగే ఓటరు జాబితా నుండి తొల గింపులు ఏ విధంగా చేస్తున్నారని? ఒక ఓటరు కు రెండు చోట్ల ఓటు ఉన్నట్లయితే ఒకేసారి రెండు చో ట్ల తొలగించకుండా ఒ కచోట ఓ టరు గా కొనసాగేందుకు వీలై నం తవరకు నిర్ధారణ చేసుకోవాలని చెప్పారు.

    ఓటరు జాబితాలో విఐపి ఓట ర్లు తప్పనిసరిగా ఉండేలా చూ డాలని ఈ వివరాలన్నీ ప్ర త్యే కం గా నమోదు చేయాలని, నో టీసులు జారీ చేసిన ఓటరుకు హియ రింగ్ తర్వాత ఓటరు జాబితాలో తన పేరు తిరస్కరించిన లేదా అ నుమతించిన వివరాల న్నింటిని తప్పనిసరిగా తెలియ జేయాలని చెప్పారు. నోటీస్ లు జారీ చేసిన ఓటర్లకు హియరింగ్ తర్వాత త న పేరు ఓటరు జాబి తాలో ఉ న్నది లేనిది ఇంటికి వెళ్లి తెలియ జేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి. చం ద్రశేఖర్ తెలిపారు. రెవెన్యూ అ దనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, దేవ రకొండ సబ్ కలెక్టర్ కరోలిన చిం గ్ థియాన్ మావి, చండూర్ ఆర్డీ వో శ్రీదేవి, మునుగోడు తహసిల్దా ర్ , ఆర్ఐ,తదితరులు ఉన్నారు .

    చండూరు : అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావా ల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో రాజకీయ పార్టీల ప్రతిని ధుల పాత్ర చాలా ముఖ్యమని నల్గొండ జిల్లా ఓటరు జాబితా పరి శీలకురాలు, రాష్ట్ర కళాశాల, సాంకేతిక విద్య క మిషనర్ శ్రీ దేవసేన అన్నారు.మంగళవారం ఆమె నల్గొండ జిల్లా, చండూరు ఆర్డీవో మరియు మునుగోడు ఈ ఆర్ఓ కా ర్యాలయంలో మునుగోడు నియోజకవర్గ రాజకీయ పార్టీల ప్ర తినిధులతో సర్ ప్రక్రియ పై ఏ ర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సర్ ప్రక్రియ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కల గకుం డా చూడడంలో అధికారులతో పాటు, రాజకీయ పార్టీల పాత్ర ముఖ్యమని అన్నారు. సర్ ప్రక్రి యలో అధికారులతో కలిసి పని చేయాలని రాజకీయ పార్టీల ప్రతి నిధులతో కోరా రు. ఇందులో భా గంగా ఎన్నికల కమిషన్ షెడ్యూ ల్ ప్రకారం సర్ ఫారాలపై వచ్చిన అభ్యంతరాలను నవంబర్ 5 వర కు పరిష్కరించేందుకు అవకాశం ఉందని, ఇంకా ఎక్కడైనా అర్హు లైన వారు ఓటరుగా నమోదు కు అవకాశం ఉంటే రాజకీయ పార్టీ ల ప్రతినిధులు అలాంటి వారంద రిని గుర్తించి ఓటరుగా నమోదు అయ్యేలా చూడాలని చెప్పారు.

    అర్హులు ఏ ఒక్కరు ఓటరు జా బితా నుండి తప్పిపోకూడద న్నారు.రాజకీయ పార్టీలు ఇంకా ఎక్కడైనా బిఎల్ఏ లను ని యమించకుంటే వెంటనే నియమిం చాలని కోరారు. రాబోయే వారం రోజులు సర్ ప్రక్రియలో అర్హులైన వారందరూ ఓటరుగా నమోద య్యేలా పక్కాగా చూడాలని విజ్ఞ ప్తి చేశారు.ఈ సం దర్భంగా ఆమె ప్రతివారం నిర్వహించే రాజకీయ పార్టీల ప్రతి నిధుల సమావేశానికి హాజరవుతున్నారా? ఓటరు జా బితాలో చనిపోయిన, తొలగిం చిన వారి పేర్లను చూసుకున్నా రా? లే దా అని అడిగి రాజకీయ పార్టీల ప్రతినిధులను తెలుసుకు న్నారు.

    రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ మునుగోడు ని యోజకవర్గంలో సర్ ప్రక్రియ ప కడ్బందీగా జరిగిందని, ప్రతివా రం క్రమం తప్పకుండా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావే శాలు నిర్వహించారని ,సర్ పై తమకు వచ్చిన సందేహాలన్నిం టిని ఈ ఆర్ ఓ,ఆర్డిఓ ఎప్పటికప్పుడు తీర్చారని, సర్ ప్రక్రియ లో ఈఆర్వో, ఏఈఆర్ఓ లందరు బాగా కృషి చేశారని అభినం దించారు.

    జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మా ట్లాడుతూ సర్ ప్రక్రియలో భా గంగా మునుగోడు నియోజకవర్గా నికి సంబంధించి అన్ని హి యరిం గ్స్ ను పూర్తి చేయడం జరిగింద ని, వచ్చిన ఫారం 6 ,7, 7 ఏ ప రిశీలించామని,అన్ కలెక్టెడ్ ఫా రాలన్నింటిని బిఎల్ఎ ల సమక్షం లో పరిశీలించడం జరిగిందని, ఫారం 6,7,8 లపై వచ్చిన అ భ్యంతరాలను నవంబర్ 5 న ప రిష్కరించేందుకు చివరి తేదీగా ఈసీ నిర్ణయించడం జరిగిందని, నవంబర్ 9న తుది ఓటరు జాబి తా ప్రచురించడం జరుగుతుంద ని తెలిపా రు. మిగిలిపోయిన అ భ్యంతరాలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని ఓటరు జాబితా పరిశీలకురాలికి వివరిం చా రు.అనంతరం ఓటరు జాబి తా పరి శీలకురాలు జిల్లాలోని ఈ ఆర్వో లు, ఏఈఆర్ఓ లతో సర్ ప్రక్రియ పై సమీక్షించారు.

    ఈ సందర్భంగా ఫారం 6,7,7ఏ,8 లను వివిధ స్థాయిలలో చేసి న తనిఖీ , ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ల అవసరం ,ఆన్లైన్లో ఎప్పటి కప్పుడు ఓటరు జాబితా సవరణ, తదితర అంశాలపై సమీక్షిం చారు. అలాగే వివిధ పారాలపై వచ్చిన అభ్యంతరాలపై ఏర్పా టు చేసిన హియరింగ్స్ కు ఓటర్లకు సరైన సమయం ఇచ్చింది లేనిది అడిగి తెలుసుకున్నారు. సర్ ప్రక్రియకు సంబంధించి రికార్డులన్నింటినీ జాగ్రత్తగా నిర్వహించాలని, బిఎ ల్ఓ యాప్ లో అన్ని వివరాలు నమోదు అయ్యేలా చూడాలని , రెండు చో ట్ల నమోదైన ఓటర్ల వివ రాలను మరోసారి తనిఖీ చేయా లని, ఫోటో ఓటరు గుర్తింపు కా ర్డుల పంపిణీ, తదితర వివరాల ను అడిగి తెలుసుకున్నారు. అం తేకాక సర్ ప్రక్రియ మొత్తం పూర్తి జాగ్రత్తగా ఉండాలని, ఎక్కడ తప్పులు జరగకుండా చూసుకో వాలని, పూర్తి పారదర్శకంగా చేయాలని, సర్ వల్ల ప్రజలకు ఎ లాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలన్నదే ఎన్నికల సంఘం ముఖ్య ఉద్దేశం అని తెలిపారు.

    రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్,ఈ ఆర్ ఓ దేవరకొండ సబ్ కలెక్టర్ కరోలిన్ చింగ్ థియా న్ మావి, నల్గొండ ఈఆర్వో , ఆర్డి ఓ వై. అశోక్ రెడ్డి, మిర్యాలగూడ ఈఆర్ఓ ,ఆర్డిఓ రమణా రెడ్డి, చం డూర్ ఆర్డిఓ మరియు మునుగో డు ఈఆర్వో శ్రీదేవి, ఆయా ని యోజకవర్గాలఏ ఈ ఆర్ ఓ లు, తహసిల్దార్లు, తదిత రులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.