Tuesday, October 27, 2026
More
    Homeవరంగల్ గ్రామీణ జిల్లాGram Panchayat Secretary Bribery Case : బిగ్ బ్రేకింగ్, లంచం కేసులో గ్రా మపంచాయతీ...

    Gram Panchayat Secretary Bribery Case : బిగ్ బ్రేకింగ్, లంచం కేసులో గ్రా మపంచాయతీ కార్యదర్శికి రెం డేళ్ల జైలు శిక్ష

    📰 Generate e-Paper Clip

    –రూ.4 వేల లంచం తీసుకున్న కే సులో కోర్టు తీర్పు
    –రూ.10 వేల జరిమానా కూడా విధింపు

    Gram Panchayat Secretary Bribery Case : ప్రజా దీవెన, వరంగల్: ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం డిమాం డ్ చేసే అధికారులపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ రంగల్ జిల్లాలో వెలువడిన ఓ కో ర్టు తీర్పు స్పష్టం చేసింది. శా యంపేట గ్రామ పంచాయతీ కా ర్యదర్శిగా పనిచేసిన కుర్రు కు మార స్వామికి లంచం కేసులో రెండేళ్ల కఠిన కారాగార శిక్షతో పా టు రూ.10 వేల జరిమానా విధి స్తూ వరంగల్ జిల్లా ప్రత్యేక న్యా యస్థానం తీర్పు వెలువరించింది.
    వరంగల్ జిల్లా ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి, మూడవ అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి క్షమ దేశ్‌పాండే ఈ నెల 26న తీర్పు ప్రకటించా రు. క్రైమ్ నంబర్ 10/ACB-W RL/2008కు సంబంధించిన సీసీ నంబర్ 05/2024 కేసులో నింది తుడిని దోషిగా నిర్ధారించారు. అ వినీతి నిరోధక చట్టం, 1988 లో ని సెక్షన్లు 7, 13(2), సెక్షన్ 13(1)(d)తో కలిపి వర్తించే నిబంధనల కింద శిక్ష విధించారు.

    రూ.25,500 అద్దె బిల్లు కోసం రూ.4,000 లంచం

    2008 సెప్టెంబర్ 6న శాయంపేట గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న సమయం లో కుర్రు కుమార స్వామి ఫిర్యా దుదారుడి నుంచి రూ.4,000 లంచం డిమాండ్ చేసి స్వీకరించి నట్లు కేసులో తేలింది. పశువైద్య శాల నిర్వహిస్తున్న భవనానికి సంబంధించిన సుమారు రూ. 25,500 అద్దె బిల్లును సిద్ధం చే సి, ఆ మొత్తానికి చెక్కు అందిం చేందుకు లంచం తీసుకున్నట్లు అభియోగాలు నమోదయ్యాయి. విచారణ అనంతరం కోర్టు నింది తుడిని దోషిగా నిర్ధారిస్తూ శిక్ష ఖరారు చేసింది.

    లంచం అడిగితే 1064కు ఫిర్యా దు చేయండి

    ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు తె లంగాణ అవినీతి నిరోధక శాఖ ను సంప్రదించి ఫిర్యాదు చేయా లని అధికారులు సూచించారు.
    ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064
    వాట్సాప్ 9440446106, ఫేస్‌ బుక్ Telangana ACB,ఎక్స్ ( ట్విట్టర్) @Telangana ACB తో పాటు ప్రభుత్వ కార్యాల యా లు, ప్రధాన బహిరంగ ప్రదేశాల్లో ఏసీబీకి సంబంధించిన క్యూఆర్ కోడ్‌లను కూడా ఏర్పాటు చేసిన ట్లు అధికారులు తెలిపారు. ఫి ర్యాదుదారుల పేర్లు, వ్యక్తిగత వి వరాలను గోప్యంగా ఉంచుతా మని స్పష్టం చేశారు. లంచరహి త పాలనకు ప్రజల సహకారం కీలకం. లంచం అడిగే వారిపై చ ట్టపరమైన చర్యలు తీసుకునేం దుకు ధైర్యంగా ఫిర్యాదు చేయా లని ఏసీబీ సూచిస్తోంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.