Tuesday, October 27, 2026
More
    HomeతెలంగాణBhagyanagar Loud Noises Panic : భాగ్యనగరంలో భారీ శబ్దాల కలకలం,భయంతో ఇళ్ల నుంచి పరుగులు

    Bhagyanagar Loud Noises Panic : భాగ్యనగరంలో భారీ శబ్దాల కలకలం,భయంతో ఇళ్ల నుంచి పరుగులు

    📰 Generate e-Paper Clip

    — రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌ సహా పలు ప్రాంతాల్లో శబ్దాలు

    Bhagyanagar Loud Noises Panic : ప్రజా దీవెన, హైదరాబాద్‌: హైద రాబాద్‌ నగరంలో మంగళవారం ఉదయం ఒక్కసారిగా వినిపించి న భారీ శబ్దాలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. ఉదయం 9.15 గంటల సమ యంలో రాజేంద్రనగర్‌, ఉప్పరప ల్లి, అత్తాపూర్‌, ఎర్రబోడ, లంగర్‌ హౌస్‌, కేశవ స్వామినగర్‌ తదిత ర ప్రాంతాల్లో వరుసగా పేలుళ్లను తలపించే శబ్దాలు వినిపించడం తో ప్రజలు ఉలిక్కిపడ్డారు.భారీ శబ్దాల ధాటికి కొన్ని ఇళ్లలో ని వ స్తువులు కదిలినట్లు స్థానికులు తెలిపారు. ముఖ్యంగా రాజేంద్రన గర్‌ పరిధిలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్లు అనిపించ డంతో భూకంపం వచ్చిందేమోన ని ప్రజలు ఆందోళనకు గురయ్యా రు. భయంతో పిల్లలను వెంటబె ట్టుకుని ఇళ్ల నుంచి బయటకు ప రుగులు తీశారు. అసలు ఏం జ రిగిందో తెలియక స్థానికులు పర స్పరం ఆరా తీశారు.

    కారణాలపై పోలీసుల ఆరా.. దర్యాప్తు ముమ్మరం

    సమాచారం అందుకున్న రాజేంద్ర నగర్‌, లంగర్‌ హౌస్‌ పోలీసులు ఆయా ప్రాంతాలకు చేరుకుని పరి స్థితులను సమీక్షించారు. భారీ శ బ్దాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వాటి వెనుక కారణాలేమిటి?అనే అంశాలపై విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించిన వివరా లను సేకరించేందుకు బాంబ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీమ్‌లను రంగం లోకి దించుతున్నారు.పేలుళ్లను తలపించే శబ్దాల వెనుక అసలు కారణమేంటన్నది ప్రస్తుతం ఆసక్తి కరంగా మారింది. అయితే, శబ్దా లకు గల కారణంపై అధికారిక ని ర్ధారణ వెలువడాల్సి ఉంది. ద ర్యాప్తు పూర్తయిన తర్వాతే ఘ టనకు సంబంధించి స్పష్టత వ చ్చే అవకాశం ఉంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.