Thursday, October 29, 2026
More
    HomePoliticsMLA vemula veeresham review meeting : ఎస్సీ, ఎస్టీల ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ,అభివృద్ధి...

    MLA vemula veeresham review meeting : ఎస్సీ, ఎస్టీల ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ,అభివృద్ధి నిధులు సద్వినియోగం కావాలి

    📰 Generate e-Paper Clip

    –అర్హులందరికీ పథకాలపై అవ గాహన కల్పించాలి
    –ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మె ల్యే వేముల వీరేశం ఆదేశం

    MLA vemula veeresham review meeting : ప్రజా దీవె న, నల్లగొండ: ఎస్సీ, ఎ స్టీ వర్గాల సామాజిక, ఆర్థిక అభి వృద్ధికి ప్రభుత్వం కేటాయిస్తున్న ప్రత్యేక అభివృద్ధి నిధులను సమ ర్థ వంతంగా వినియోగించాలని ప్ర భుత్వ విప్, నకిరేకల్ ఎమ్మె ల్యే వేముల వీరేశం అధికారులను ఆ దేశించారు. కేవలం నిధు ల ఖర్చుకే పరిమితం కాకుండా, ఆయా వర్గాల ప్రజల ఆదా యం, ఆస్తులు, జీవన ప్రమాణాలు పెరిగేలా అభివృద్ధి కార్య క్రమాలను అమలు చే యాలని స్పష్టం చేశారు.ప్రభుత్వ సంక్షే మ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అన్ని శాఖల అ ధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. నల్ల గొండ జిల్లా కలెక్టరేట్‌లో గురు వా రం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎస్సీ ప్రత్యే క అభి వృద్ధి నిధుల (SCSDF) విని యోగం, చేపట్టిన పనుల పురోగ తిని ఆయన సమీక్షించారు. ఆ యా వర్గాల ప్రజలకు నిధుల కే టాయింపు, వాటి ద్వారా చేపడు తున్న అభివృద్ధి పనులు, లబ్ధిదా రులకు కలిగే ప్రయోజనాలపై పూర్తి అవగా హన కల్పించాలని సూ చించారు.


    నిధుల వినియోగంపై నిరంతర పర్యవేక్షణ

    ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధికి సంబంధించి ప్రతి శాఖ తన ప రి ధిలో అమలవుతున్న పథకాలు, కార్య క్రమాల వివరాలను అ ర్హులకు తె లియజేయాలని వేముల వీరేశం అన్నారు. నిధుల కేటాయింపు నుంచి పనుల అమలు వరకు నిరంతర పర్య వే క్షణ ఉండాలని, ప్రతి నెలా సమీక్ష సమావేశాలు నిర్వహించి పురోగతిని అంచనా వే యాలని ఆదేశించారు. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఎ స్సీ, ఎస్టీ కమిషన్ ప్రతినిధులు, సంబం ధిత మంత్రులు, ఎ మ్మెల్యే లతో నిర్వహించిన సమావేశంలో ఈ వర్గాల అభివృద్ధిపై ప్రత్యే కంగా చర్చించినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సంక్షేమం, ఆర్థిక స్వావలంబన ప్రభు త్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నా రు.

       విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం

    ప్రజలకు నాణ్యమైన విద్య, మె రుగైన వైద్య సేవలు అందిం చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచే స్తోందని వేముల వీరేశం వివరించారు. ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పంపిణీ, మ హిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్ వంటి సం క్షేమ కార్యక్రమా లను అమలు చేస్తున్నట్లు తెలిపారు. యంగ్ ఇండియా స్కూళ్లు, తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ద్వారా ప్రభుత్వ విద్యా వ్యవస్థ ను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చే పడుతున్నట్లు పేర్కొన్నారు.

    ప్రతి నియోజకవర్గానికి ఒక పాఠ శాల ఏర్పాటు చేయాలనే ఆ లోచనను విస్తరించి, ప్రతి మండలా నికి ఒక పాఠశాల ఏర్పా టు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిపారు. ఎస్సీ, ఎ స్టీ వర్గాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. విద్య, వైద్య రంగాల్లో మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి వ స్తే ఆయా వర్గాల సామాజిక అభివృద్ధి మరింత వే గవంతమ వుతుందని అన్నారు.

    ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి

    ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలమట్టాలు తగ్గుతున్న నేప థ్యం లో నీటి వినియోగం, వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారించాల ని వేముల వీరేశం సూచించారు. గతంలో పలు మార్లు కరువు పరి స్థితులు ఏర్పడిన విషయాన్ని ప్ర స్తావిస్తూ, ప్రస్తుత పరిస్థితులను ముందుగానే అంచనా వేసి తగిన కార్యాచరణ రూపొందించాలని అధికారులను కోరారు. రైతు లకు గిట్టుబాటు ధరలు లభించేలా చర్యలు తీసుకోవాలని, ధా న్యం మార్కెట్లకు చేరకముందే పొలాల వద్ద కొనుగోలు చేస్తున్న వ్యాపా రుల వ్యవహారాలపై పర్యవేక్షణ ఉండాలని సూచిం చా రు. రైతులకు నష్టం కలగకుండా సంబంధిత శాఖలు సమన్వ యంతో పనిచేయాలని స్పష్టం చేశారు.

    ఇరిగేష న్, వ్యవసాయం, వైద్య ఆరోగ్య రంగాల్లో అభివృద్ధి కా ర్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంతోపాటు, వాతా వరణ మార్పుల ప్రభావాన్ని దృ ష్టిలో ఉంచుకుని ముం దస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధి కారులకు సూచించా రు.ఈ స మావేశంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ వివిధ శాఖ లకు సంబం ధించిన అంశాలు, అభివృద్ధి కార్యక్రమాల వివ రాలను ప్రభుత్వ విప్‌కు వివరించారు. స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ ప్రే మ్ కరణ్ రెడ్డి, జిల్లా సంక్షేమ శాఖ డీడీ శశికళతో పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

    MLA vemula veeresham review meeting

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.